ఒక ఆదివాసీ యువకుని మీద కొంత మంది పురుషులు మూత్ర విసర్జన చేస్తున్న వీడియో మణిపూర్ కి చెందినది కాదు.

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 24 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒక ఆదివాసీ యువకుని మీద కొంత మంది పురుషులు మూత్ర విసర్జన చేస్తున్న వీడియో మణిపూర్ కి చెందినది కాదు.

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగింది. ఒక ఆదివాసీ యువకుడుని కొట్టి, తన మీద మూత్ర విసర్జన చేసిన ఆరోపణల మీద జూన్, 2023లో 9 మందిని అరెస్ట్ చేశారు.

క్లైమ్ ఐడి 27d3b8d6

(హెచ్చరిక- ఈ ఫ్యాక్ట్ చెక్ లో మిమ్మల్ని ఆందోళనకి గురి చేయగల విజువల్స్ గురించి వివరణ ఉంటుంది. అలాగే  శారీరక, లైంగిక దాడి గురించి కూడా వివరణ ఉంటుంది. పాఠకులు  గమనించగలరు.)

నేపధ్యం

ఒక యువకుడిని కొంత మంది పురుషులు కొడుతూ తన మీద మూత్ర విసర్జన చేస్తున్న ఒక వీడియోని షేర్ చేసి ఇది మణిపూర్ లో ఒక క్రైస్తవ వ్యక్తి మీద జరుగుతున్న దాడి తాలూకా వీడియో అని తప్పుడు క్లైమ్ తో ఒక వీడియో సామాజిక మాధ్యమలలో చక్కర్లు కొడుతున్నది. 

“మణిపూర్ లో ఒక హిందుత్వ మూక ఒక క్రైస్తవ వ్యక్తి మీద దాడి చేసి, తన మీద మూత్ర విసర్జన చేసింది. ఆ తరువాత ఈ మూక ఈ వ్యక్తి భార్య, పిల్లలని హత్య చేసింది” అన్న శీర్షికతో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. 

మణిపూర్ లో నడుస్తున్న మారణహోమం నేపధ్యంలో కుకి-జోమి తెగకి చెందిన ఒక మహిళ మీద ఒక మూక లైంగిక దాడికి పాల్పడిన వీడియో ఒకటి గత వారం వైరల్ అయిన కొద్ది రోజులకి ఈ వీడియో సామాజిక మాధ్యమలలో పైన పేర్కొన్న శీర్షికతో వైరల్ అయ్యింది. 

వాస్తవం

ఈ వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఇదే వీడియోని వార్తా వెబ్సైట్ ఎన్ డి టి వి జులై 19, 2023 నాడు తమ వెబ్సైట్ లో అప్లోడ్ చేసినట్టు గుర్తించాము. ఈ ఘటన 2023 జూన్ నెలలో జరగగా, ఈ ఘటనకి సంబంధించిన ఈ వీడియో జులై 15, 2023 నాడు బయటకి వచ్చింది. ఎన్ డి టి వి వెబ్సైట్ లో కథనం ప్రకారం ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికతో సంబంధం పెట్టుకున్నాడు అనే ఆరోపణ మీద ఒక ఆదివాసీ యువకుడిని మద్యం మత్తులో ఉన్న కొంతమంది పురుషులు దాడి చేసి, మూత్ర విసర్జన చేశారు. ఇండియా టుడే, అలాగే స్థానిక పత్రిక ది హాన్స్ ఇండియా కూడా ఈ ఘటన గురించి రిపోర్ట్ చేశాయి. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగింది అని ఈ రెండు వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడి వీడియో లింకుని లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఇక్కడ జతపరచడం లేదు. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఒంగోలు డిఎస్పి నారాయణ స్వామి రెడ్డిని సంప్రదించింది. ఆయన ఈ ఘటన జరిగింది అని స్పష్టం చేశారు. బాధితుడు ఆదివాసీ అని కూడా తెలియచేశారు. “జూన్ 19, 2023 నాడు బాధితుడు తన మిత్రులతో మద్యం సేవించడానికి బయటకి వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.” ఈ ఘటన గురించి అధికారికంగా ఫిర్యాదు అందింది అని, అయితే ఆ ఫిర్యాదులో మూత్ర విసర్జనకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదని తెలిపారు. 

“జులై 15, 2023 నాడు పోలీసుల దృష్టికి ఈ వీడియో రాగానే, కేసుని పునఃపరిశీలించి హత్యాప్రయత్నం (భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్. 307), ఆలాగే ఎస్. సి/ఎస్. టి (అత్యాచారాల నిరోధన) చట్టం కింద కేసు నమోదు చేశాము”, అని ఆయన తెలిపారు. 

ఈ కేసుకి సంబంధించి ఒక మైనర్ తో పాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. బాధితుడు, నిందితులు ఒకరికి ఒకరు తెలిసినవారేనని, నిందితులు కూడా ఎస్. సి./ఎస్. టి వర్గాలకి చెందిన వారేనని, ఇది కులానికి సంబధించిన నేరం కాదని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. అలాగే వార్తా కథానాలలో కానీ, పోలీసు ప్రకటనలలో కానీ బాధితుడి “భార్య, పిల్లలలని” హత్య చేసినట్టు ఎక్కడా లేదు. 

తీర్పు

ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఒక ఆదివాసీ యువకుడి మీద అతని స్నేహితులు దాడి చేసిన ఘటనకి సంబంధించినది . కాబట్టి ఈ క్లైమ్ అ బద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.