లాజికల్లీ ఫ్యాక్ట్స్ గురించి

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఐర్లాండ్ లో రిజిస్టర్ అయిన సంస్థ. ఆలాగే ఈ సంస్థ యు.కె లోప్రధాన కార్యాలయం కలిగిన ది లాజికల్లీ సంస్థకి స్వతంత్ర అనుబంధ సంస్థ. తప్పుడు సమాచారం, ఆన్లైన్లో నడిచే మోసపూరిత వ్యాఖ్యానాల కారణంగా వ్యక్తులకి, సంస్థలకి, సమాజనికి కలిగే హానిని ఫ్యాక్ట్ చెక్ పని ద్వారా తగ్గించడం మా లక్ష్యం.

తమ తమ విపణి రంగాలలో వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు భద్రంగా, భాధ్యతాయుతంగా, చట్ట నియమాలకి లోబడి పనిచేసేలా సహాయం చేయడం ద్వారా ప్రజారోగ్యానికి, ప్రజా భద్రతకి, ఎన్నికల నిష్పక్షపాతానికి, జాతీయ భద్రతకి తప్పుడు సమాచారం (mis-information)/ఉద్దేశపూర్వకంగా హాని కలిగించే తప్పుడు సమాచారం (dis-information) కారణంగా ఎదురయ్యే ప్రమాదాలని ఎదుర్కోవడంలో లాజికల్లీ ఫ్యాక్ట్స్ సహాయం చేస్తుంది. మెటా థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ లోనూ అలాగే టిక్ టాక్ థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ లోనూ కూడా లాజికల్లీ ఫ్యాక్ట్స్ భాగస్వామి. అలాగే మేము 2020 నుండి ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ వారి ధృవీకరణ పొందిన సభ్యులం కూడా.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.