తప్పుడు సమాచారాన్ని మరియు ఉద్దేశపూర్వకంగా హాని కలుగచేసే తప్పుడు సమాచారం వల్ల కలిగే హానిని తగ్గించడం, మున్ముందు పూర్తిగా తొలగించడమే మా లక్ష్యం. మేము వాక్ స్వేచ్ఛ ను సమర్థిస్తాం. అలాగే ఆన్లైన్ మాధ్యమాలలో వ్యక్తిగత వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే నిబంధనలకు(censorship) మేము విరుద్ధం. ఆన్లైన్ మాధ్యమాలలో సమాజానికి హాని కలిగించే తప్పుడు వ్యాఖ్యానాలను, మోసపూరితమైన వ్యాఖ్యానాలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని మేము నమ్ముతాము.
లాజికల్లీ-ఫ్యాక్ట్స్ సంస్థ తప్పుడు సమాచారాన్నిమరియు ఉద్దేశపూర్వకంగా హాని కలుగచేసే తప్పుడు సమాచారాన్ని భారీ స్థాయిలో ఎదుర్కోవడానికి ఈ పరిశ్రమలోనే అత్యున్నత సాంకేతిక ఉత్పత్తులని మరియు సేవలను రూపొందించింది. మా సేవలు ప్రభుత్వ, ప్రైవేటు, పౌర సమాజం వినియోగించుకోవడానికి అనుకూలమైనవి. అత్యున్నత నైతిక విలువలు, నిజాయితీ కలిగిన వారికి మాత్రమే మా సేవలు అందిస్తాము.
మేము అత్యున్నత స్థాయి ఖచ్ఛితత్వాన్ని, నమ్మకాన్ని ప్రమాణాలుగా పెట్టుకున్నాము. ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ (IFCN) వారి ధృవీకరణ పొందిన సంస్థ మాది. వారి నియమ సూత్రావళిని మేము పాటిస్తాము. నిష్పక్షపాతం, నిజాయితీ, అలాగే మా సంస్థ గురించి, ఫండింగ్ గురించి, మేము చేసే వార్త కధనాలలో ఉటంకించే వారి గురించి పారదర్శకత ఈ ప్రామాణిక సూత్రాలలో భాగం. మేము వారి నియమ సూత్రావళిని పాటిస్తున్నామో లేదో తెలుసుకోవటానికి ప్రతి సంవత్సరం ఐ ఎఫ్ సి ఎన్ సమీక్ష నిర్వహిస్తుంది. ఇంతకముందు నిర్వహించిన సమీక్షలని ఇక్కడ చూడవచ్చు.
మా సంస్థ సేవలు ఉపయోగించుకోవాలి అనుకునేవారికి మా సేవలు అందించాలా లేదా అని ఒక నిర్ణయానికి రావటానికి ఈ క్రింద ప్రమాణాలు పాటిస్తాము:
మేము మా సేవలు అందించే ఒప్పందం ఈ క్రింద పేర్కొన్న సందర్భాలలో కుదుర్చుకోము:
చివరగా, మేము చేసుకునే ప్రతి ఒప్పందమూ మా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ఆ ఒప్పందాన్ని నైతిక విలువుల ఛట్రంలో నిర్ధారించుకున్నాకే కుదుర్చుకుంటాము. రాజకీయంగా ఏ అభిప్రాయానికీ మద్ధతుగా ఉండము అనే మా వైఖరికి ఈ ఒప్పందం వ్యతిరేకంగా లేదని మా నాయకత్వ బృందం ఏకగ్రీవంగా అంగీకరిస్తేనే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మా అంతర్గత నైతిక విలువల సమీక్ష ఆమోదం పొందుతుంది.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంస్థ ఏ రాజకీయ అభిప్రాయనికీ మద్ధతుగా ఉండము అనే వైఖరికి కట్టుబడి ఉంటుందో లేదో మార్క్ వుడ్ అధ్యక్షులుగా ఉన్న మా సలహా మండలి ఎప్పటికప్పుడు సమీక్షించి IFCN వంటి సంస్థల నిబంధనలను పాటించేలా చూస్తుంది.
మా ఉద్యోగులను కింద సూచించిన ప్రమాణాలకు కట్టుబడి ఉంటారు:
లాజకల్లీ ఫ్యాక్ట్స్ ఏ ప్రభుత్వ, రాజ్య, రాజకీయ పార్టీ లేదా రాజకీయ నాయకుని సంపాదక ఆధ్వర్యంలో పని చేయటం లేదు. మా పరిశోధనని కానీ లేదా మా రిపోర్టింగ్ ని కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదా ఏ ఒక్క రాజకీయ ధోరణి మీద గురి పెట్టి చెయ్యడం లాంటిది ఉండదు.
ఏదైనా రాజకీయ పార్టీ, ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలో జీత భత్యాలతో పని చేసే వారిని లేదా వీటిల్లో ఏదైనా ముఖ్య పదవిలో ఉన్నవారిని కానీ మేము మా సంస్థలోకి తీసుకోము.
ఫ్యాక్ట్ చెకింగ్ పనికి సంబంధించి తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ, లేదా అభ్యర్ధికి కానీ లేదా ఫలానా ప్రభుత్వ విధానానికి కానీ మద్ధతు తెలపమని మేము సలహా ఇవ్వము.
ఏ రాజకీయ పార్టీతో లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఒప్పందం కుదుర్చుకోదు. అలాగే కథానాలలో ఉటంకించే వ్యక్తులకి లేదా సంస్థలకి రాజకీయ అభిప్రాయాలు, ప్రయోజనాలు ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకుని వారిని ఎలా ఉటంకించవచ్చో అనేదానికి ఒక ప్రక్రియ ఏర్పాటు చేశాము.
సంస్థ పేరు మీద ఉద్యోగులు రాజకీయ అభిప్రాయాలు ప్రకటించకుండా ఉండే విధానం మా సంస్థలో అమలులో ఉంది. అలాగే సాధారణ, మర్యాదపూర్వకమైన వాటిని తప్పించి పనికి సంబంధించి ఇతరుల నుండి బహుమతులు, ప్రయోజనాలు ఉద్యోగులు స్వీకరించకూడదు అనే విధానం కూడా అమలులో ఉంది.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఐర్లాండ్ లో రిజిస్టర్ అయిన సంస్థ. రిజిస్ట్రీలో సంస్థ పేరు లాజికల్లీ ఫ్యాక్ట్స్ లిమిటెడ్. రిజిస్ట్రీ సంఖ్య 704166. ఈ సంస్థ మాతృ సంస్థ యునైటెడ్ కింగ్డంకి చెందిన ది లాజికల్లీ లిమిటెడ్. అయితే లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి ది లాజికల్లీ లిమిటెడ్ నుండి ఎటువంటి ఫండింగ్ లేదు, అలాగే సంపాదకీయ, దైనందిక వ్యవహారాల మీద మాతృ సంస్థకి ఎటువంటి అధికారం లేదు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంపాదకీయంగా, దైనందికంగా మాతృ సంస్థ నుండి పూర్తిగా స్వతంత్రంగా పని చేస్తుంది.
లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంపాదకీయ ప్రమాణాలు రాయిటర్స్ మాజీ ఎడిటర్--ఇన్-చీఫ్ మార్క్ వుడ్స్ నేతృత్వంలో పని చేసే లాజికల్లీ ఫ్యాక్ట్స్ సలహా మండలి పర్యవేక్షణకి లోబడి ఉంటాయి. సలహా మండలి సభ్యుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడవచ్చు.
సంస్థ తాజా ఆర్థిక సంవత్సరం (2022) వార్షిక ఆదాయ వివరాలు, అలాగే ఆదాయంలో 5% కన్నా ఎక్కువ ఆదాయం ఎవరెవరి నుండి వస్తున్నదో వారి వివరాలు కింద జతపరిచాము.
క్రితం ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం |
£ 1,799,527 |
వార్షిక ఆదాయంలో 5% కన్నా ఎక్కువ ఎవరెవరి నుండి వస్తున్నది |
బైట్ డాన్స్, మెటా |
ఆర్టికల్ 4.2.బి ప్రకారం ఇతర ఆదాయ వనరులు |
ఏమీ లేవు |
మా భాగస్వామ్య సంస్థలతో కలిసి మేము చేసే పని వివరాలు ఈ కింద చూడవచ్చు
భాగస్వామ్య సంస్థ పేరు |
పని వివరాలు |
మెటా |
థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ భాగస్వామ్యం |
బైట్ డాన్స్ |
థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ భాగస్వామ్యం |