Copy Link

మేము ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఫ్యాక్ట్ చెక్ వార్తలను ప్రచురిస్తాము. అలాగే  వివిధ మాధ్యమాలలో ట్రెండ్ అవుతున్న తప్పుడు కథనాలను ఫ్యాక్ట్ చెక్ చేస్తాము.

మా ఫ్యాక్ట్ చెకర్లు సమాచారాన్ని, డేటా అనలిటిక్స్,  ఇంకా సంపాదకీయ సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ హాని కలిగించే వ్యాఖ్యానాలని  గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. మా అనుభవజ్ఞులైన సంపాదకీయ బృందం మరియు ఫ్యాక్ట్ చెకింగ్ నిపుణులు ఒక్కో క్లైమ్ వ్యాప్తిని, ఆ క్లైమ్ ప్రభావాలను అంచనా వేస్తారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ కింద తెలిపిన ప్రమాణాల ఆధారంగా క్లైమ్స్ ను పరిశోధిస్తారు

  • బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు లేదా అందరికీ అందుబాటులో ఉండే ఆన్లైన్ మాధ్యమాలలో చేసిన వ్యాఖ్యలు
  • అవి నిజామా లేక అబద్ధమా అని సరిగ్గా అంచనా వేయగలిగే వ్యాఖ్యలు
  • అందరికి అందుబాటులో ఉండే, సాధారణంగా అందరూ ఒప్పుకునే ప్రమాణాల ఆధారంగా అంచనా వేయగలిగేవి
  • ఇది నిజం లేదా ఇది వాస్తవం అంటూ ఇచ్చే నిశ్చిత వ్యాఖ్యలని మాత్రమే లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది. నిశ్చిత వ్యాఖ్యలు అంటే అవి నిజమని ఇతరులని నమ్మించేటట్టు ఉండే వ్యాఖ్యలు.

క్లైమ్ ఎవరు చేశారు, ఏ రాజకీయ అభిప్రాయం కలిగి ఉన్నవారు చేశారు అనే దానితో నిమిత్తం లేకుండా ప్రతి క్లైమ్ ని అందుబాటులో ఉన్న అవే ఆధారాలతో అంతే క్షుణ్ణంగా ఫ్యాక్ట్ చెక్ చేస్తాము. కొన్నిసార్లు కొన్ని క్లైమ్స్ ని మావద్ద అప్పటికే ఉన్న ఆధారాలను ఉపయోగించి కాని లేదా భవిష్యత్తులో మాకు అందుబాటులోకి రాబోయే ఆధారాలను ఉపయోగించి కానీ నిర్ధారణ చేయలేకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి క్లైమ్స్ అభిరుచులకు సంబంధించి కాని , అప్పటివరకు నిర్ధారింపబడని చారిత్రక విషయాలకు సంబంధించినవి కానీ లేదా నైతిక/మతపరమైన విలువలకు సంబంధించినవై ఉంటాయి.

ఏదైనా క్లైమ్ ని నిర్ధారించడం బాధ్యతారాహిత్యమని భావిస్తే అటువంటివాటిని మేము ఫ్యాక్ట్ చెక్ చెయ్యము. మాకు ఆ విషయాల పట్ల నైపుణ్యం లేకపోవటం లేదా ఆ క్లైమ్ కి సంబంధించిన నేపధ్యాన్ని అందించే సామర్ధ్యం లేకపోవడం లాంటివి అందుకు కారణం. ఇలా ఒక నేపధ్యం లేకుండా లేదా నిర్ధారించే నైపుణ్యం లేకుండా ఫ్యాక్ట్ చేస్తే అది అంతిమంగా మేము ఆ క్లైమ్ తప్పా ఒప్పా అని చెప్పటంలో ఏ మాత్రం సహాయపడదు.  మేము ట్రోల్స్ తో ఎంగేజ్ అవ్వము. ఆలాగే  నిర్ధారించక తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు తప్ప మేము ప్రమాదకర కుట్ర సిద్ధాంతాలకి కూడా దూరంగా ఉంటాము.

Copy Link

ముందుగా ఒక క్లైమ్ ఎక్కడ నుండి వచ్చిందో పరిశోధించి నేపధ్యాన్ని విశ్లేషిస్తాము. తరవాత వీలైనన్ని ప్రాధమిక ఆధారాలని సైట్ చేసి ఈ క్లైమ్ నిజమా కాదా అనే విషయాన్ని నిర్ధారిస్తాము. 

తగినన్ని ఆధారాలు సంపాదించిన తరవాత ఆ క్లైమ్ ఎంత వరకు విశ్వసనీయమైనదో తెలుపుతూ ఒక ముసాయిదా నివేదికని తయారు చేస్తాము. ఆ ఆధారాలని ఏ విధంగా సేకరించామో కూడా నివేదికలో తెలుపుతాము. ఈ నివేదికే ఫ్యాక్ట్ చెక్. ఈ నివేదికను పలు దశల్లో సమీక్షించిన తర్వాతే ప్రచురిస్తాము. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ చెకర్లు వారి ఫ్యాక్ట్ చెక్లలో కనీసం రెండు ఆధారాలనైనా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ఆధారాలలో ఈ క్రింద పేర్కొన్నవి తప్పక ఉండాలి. ఇంకా కూడా ఉండవచ్చు. 

  • నిపుణుల, ప్రత్యక్ష సాక్షుల, భాగస్వాముల (stake holders) లేదా అధికారుల ఉటంకింపులు
  • పరిశోధన పత్రాలు మరియు అకడెమిక్ జర్నల్స్ లో ప్రచురించిన పత్రాలు
  • ప్రసిద్ధి చెందిన గౌరవప్రదమైన వార్తా సంస్థల నివేదికలు
  • ఓపెన్ సోర్స్ ఇంటలిజెన్స్ (OSINT) ద్వారా సేకరించిన సమాచారం. అంటే  కీ ఫ్రేమ్ అనాలిసిస్ , రివర్స్ ఇమేజ్ సెర్చ్,  ఇంకా జియోలొకేషన్ వంటి సాధనాల ద్వారా సేకరించిన సమాచారం.
  • కుదిరినంత మేరకు, అనువైన సందర్భాలలో ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే ముందు అవాస్తమైన క్లైమ్ చేసినా లేదా అటువంటి క్లైమ్ చేశారు అని ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి లేదా సంస్థని సంప్రదించి వారికి తమ వాదన వినిపించే అవకాశం ఇస్తాము. 

ఫ్యాక్ట్ చెకర్లు ఒక క్లైమ్ ని గుర్తించిన తరువాత, దానిని డిప్యూటీ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్ లేదా రీజనల్ లీడ్ తప్పనిసరిగా ఆమోదించాలి. ఫ్యాక్ట్ చెక్ ముసాయిదాని మా డిప్యూటీ ఎడిటర్స్ లో ఒకరు సంపాదకీయ సూత్రాలకి (ఆధారాలు, నివేదిక రూపం, వాదనలు , నిపుణులు , ప్రత్యక్ష సాక్ష్యులు, భాగస్వాములు, అలాగే అధికారుల ఉటంకింపులు) అనుగుణంగా క్షుణ్ణంగా సమీక్షిస్తారు. ఈ మొదటి సమీక్ష తరవాత, లాజికల్లీ  ఫ్యాక్ట్స్  అసిస్టెంట్ ఎడిటర్లు ఈ క్లైమ్ ని నిర్ధారించడానికి వాడిన ఆధారాలు నమ్మదగినవిగా, ఖచ్చితమైనవిగా ఉండేటట్టు, అలాగే వ్యాకరణ దోషాలు లేకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటారు. అలాగే వీరికి ఆధారాలు, వాటి విశ్లేషణ, సంపాదకీయ నిర్ణయాల పట్ల ఏవైనా ముఖ్యమైన ప్రశ్నలు ఉంటే ఫ్యాక్ట్ చెకర్లకు, ఇంకా సంపాదక వర్గ సభ్యులకు తెలియచేస్తారు. ఆ తరువాతనే ఫ్యాక్ట్ చెక్ ను ప్రచురిస్తారు.

Copy Link

అవిశ్వసనీయ వర్గాల నుండి సేకరించిన సమాచారం కన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిక సమాచారంపై ఆధారపడటం మంచిది. ఎందుకంటే విశ్వసనీయ ఆధారాలు ఖచ్చితమైన పూర్తి సమాచారాన్ని అందచేస్తాయి.

అందుబాటులో ఉన్న ఆధారాలు ద్వారా క్లైమ్ ని నిర్ధారించటం కష్టం అనుకునప్పుడు, ఆలాగే అందుబాటులో ఉన్న ఆధారాలు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ క్లైమ్ నిర్ధారించకపోవడమే మంచిది. ఇటువంటి ఆధారాలతో నిర్ధారించిన క్లైమ్ నిజానికి బదులు బదులు అబద్ధాలని ప్రచారంలో ఉంచే అవకాశం ఉంది.

Copy Link

 మేము మా ఫ్యాక్ట్ చెక్లకు ఆరు రకాల  రేటింగ్‌లను ఇస్తాము. మా ఫ్యాక్ట్ చెక్ సారాంశాన్ని, అలాగే ఆ క్లైమ్ విశ్వసనీయతను తెలపడమే ఈ రేటింగ్ ఉద్దేశం.

  • నిజం: అందుబాటులో ఉన్న ఆధారాల ద్వారా ఈ క్లైమ్ వాస్తవమని నిరూపణ అయ్యింది. ఆలాగే ఈ క్లైమ్ ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని వివరించడంలో సఫలీకృతం అయ్యింది.
  • పాక్షికంగా నిజం: ఈ క్లైమ్ లో కొన్ని మరీ ముఖ్యం కానివి తప్పు అయ్యుండొచ్చు. అయితే చెప్పదలుచుకున్న విషయాన్ని వివరించడంలో సఫలీకృతం అయ్యింది. 
  • తప్పుదారి పట్టించేది: అందుబాటులో ఉన్న ఆధారాలు ద్వారా ఈ క్లైమ్ లో కొన్ని విషయాలు నిజమని నిర్ధారించినా కూడా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పటంలో విఫలం చెందింది.
  • అబద్ధం: అందుబాటులో ఉన్న ఆధారాల ద్వారా ఈ క్లైమ్ పూర్తిగా నిరాధారమైనది అని నిరూపితం అయ్యింది.
  • ఫేక్:  అందుబాటులో ఉన్న ఆధారాల ద్వారా ఈ క్లైమ్ పూర్తిగా నిరాధారమైనది అని నిరూపితం అయ్యింది. అలాగే దాంతో పాటు ఈ ఫొటో కానీ వీడియో కానీ ఎడిటింగ్ ద్వారా సృష్టించింది.
  • నిర్ధారించలేనిది: అందుబాటులో ఉన్న ఆధారాల ద్వారా  ఈ క్లైమ్ ను ధృవీకరించటం కుదరదు. 
Copy Link

తప్పుడు సమాచారాన్ని మరియు ఉద్దేశపూర్వకంగా హాని కలుగచేసే తప్పుడు సమాచారం వల్ల కలిగే హానిని తగ్గించడం, మున్ముందు పూర్తిగా తొలగించడమే మా లక్ష్యం. మేము వాక్ స్వేచ్ఛ ను సమర్థిస్తాం. అలాగే ఆన్లైన్ మాధ్యమాలలో వ్యక్తిగత వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే నిబంధనలకు మేము విరుద్ధం. ఐతే తప్పుదారి పట్టించే మోసపూరితమైన ఆన్‌లైన్ వ్యాఖ్యానాలు వ్యక్తిగత మరియు సామాజిక హాని కలిగించే సందర్భాలలో వాటిని గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని మా అభిప్రాయం. పక్షపాత ధోరణికి దూరంగా రాజకీయాలలో పాల్గొనడం, నిజాయితీ మరియు చిత్తశుద్ధితో చర్చలు జరపడం , విభేదించడం, అలాగే  రాజకీయ మిత్రులు మరియు ప్రతిపక్షాల నుండి మర్యాద, హేతుబద్ధత, గౌరవం వంటి విషయాలలో అత్యున్నత ప్రమాణాలను డిమాండ్ చేయడం అత్యవసరమని మేము నమ్ముతాం.

వీటిని సాధించాలంటే ఏ రాజకీయ అభిప్రాయానికైనా బద్దులుగా ఉండని, నిష్పక్షపాతమైన వనరులను రూపొందించాలి. ఇటువంటి వనరులను ఉపయోగించి వివాదాలకు అతీతమైన వాస్తవాలు ఏమిటో, ఆ వాస్తవాల ఆధారంగా సహేతుకంగా ఏ పక్షాన నిలబడవచ్చో తెలుసునే అవకాశం ఉండాలి. వాస్తవాల ఆధారంగా న్యాయబద్ధంగా వాదించడానికి అవసరమైన వనరులను ప్రతి ఒక్కరికీ అందించాలి. ఇవన్నీ మా లక్ష్య సాధనకు ఉత్తమ మార్గాలని అని మేము విశ్వసిస్తున్నాం.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఉద్యోగులుగా ఏది నిజమో ఏది అబద్ధమో నిరూపించే మా విధిని నిర్వర్తించాలంటే లాజికల్లీ ఫ్యాక్ట్స్ ను అన్ని రాజకీయ వర్గాల వారు విశ్వసించాలని మేము అర్థం చేసుకున్నాం. రాజకీయాలలో  పాల్గొనడం పౌర కర్తవ్యమే అయినా, స్వతంత్ర ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థగా మా పాత్ర, మా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండి, విస్తృతమైన రాజకీయ భావాలు మరియు నైతిక ప్రమాణాలను పాటించేదై ఉండాలని మేము భావిస్తున్నాం.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ రాజకీయ పార్టీలకు అతీతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. అలాగే  మా వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలు మేము చేసే పనిని ప్రభావితం చేయకుండా లేదా ప్రభావితం అయ్యే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడతాం. అంతేకాకుండా, మా వ్యక్తిగత జీవితాలు, ఆన్‌లైన్ మరియు ఇతర చోట్ల మా వ్యాఖ్యలు నిష్పక్షపాతమైన సంస్థగా లాజికల్లీ ఫ్యాక్ట్స్ స్థానాన్ని తగ్గించే విధంగా ఉండకుండా వ్యవహరిస్తాం. మా ఉద్యోగులందరూ మా నిష్పక్షపాత విధానానికి కట్టుబడి ఉండాలి.

Copy Link

మా వాటాదారులకు , ఖాతాదారులకు , మా మాతృ సంస్థైన  The Logically Ltd.కు మా ఫ్యాక్ట్ చెకింగ్  ప్రక్రియను నియంత్రించే అధికారం కాని,  సంపాదకీయ నిర్ణయాలకి  సలహాలు ఇచ్చే అధికారం కానీ లేదు. సంపాదకీయ సూత్రాలు, నాణ్యత మరియు నిలకడ ఉండేలా చూసుకోవడానికి రీజినల్ ఎడిటోరియల్ లీడ్స్ బాధ్యత వహిస్తారు. గ్లోబల్ ఎడిటోరియల్ బృందం సంపాదకీయ విధానాలు మరియు ప్రమాణాలకు గ్లోబల్ హెడ్ ఆఫ్ ఎడిటోరియల్ ఆపరేషన్స్  జస్కీరత్ సింగ్ బవ బాధ్యత వహిస్తారు. రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షించడం, వ్యాపార లాభ నష్టాలని, అలాగే క్లయింట్లు మరియు వాటాదారుల ఖాతాలను చూసుకోవడం వంటి బాధ్యతలని లాజికల్లీ ఫ్యాక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ బేబర్స్ ఓర్సెక్ నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం   ‘మీట్ ది టీమ్’ భాగం చూడండి. 

క్లైమ్స్ నిర్ధారించే మా ఫ్యాక్ట్ చెకర్లు డిప్యూటీ మరియు అసిస్టెంట్ ఎడిటర్ల పర్యవేక్షణలో పనిచేస్తారు. ఇది మూడంచెల వ్యవస్థ. 

ఏవైనా వివాదాలకు తావున్న సంపాదకీయ నిర్ణయాలు, ఫిర్యాదులు లేదా అవసరమైన దిద్దుబాట్లు లాంటి వాటిల్లో రీజినల్ లీడ్స్ వారి జోక్యంతో నిర్ణయాలు తీసుకోబడతాయి. వీరు గ్లోబల్ హెడ్ ఆఫ్ ఎడిటోరియల్ ఆపరేషన్స్ నాయకత్వంలో పని చేస్తారు. 

ప్రపంచ ఫ్యాక్ట్-చెకింగ్ రంగంలో అమలులో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులకి అనుగుణంగా ఫ్యాక్ట్ చెకింగ్ బృందం ప్రమాణాలు ఉండేలా  చూడటానికి బృంద నాయకులకి పాలసీ మేనేజర్ సహాయంగా ఉంటారు. 

Copy Link

వివిధ రకాల ఆధారాలు వివిధ రకాల క్లైమ్స్ ని నిర్ధారిస్తాయి. శాస్త్రీయ పరిశోధనలు ఎంపిరికల్ క్లైమ్స్ ని నిర్ధారిస్తాయి. ఆర్థిక అంచనాలకి సంబంధించిన క్లైమ్స్ ని నిపుణులతో మాట్లాడి నిర్ధారించుకోవచ్చు. రాజకీయ క్లైమ్స్ ని పోలింగ్ డేటా ద్వారా లేదా సాధారణంగా అందరూ అంగీకరించే రాజకీయ సూత్రాల ఆధారంగా నిర్ధారించవచ్చు.  అలాగే, ఏ రకాల ఆధారలైనా కూడా కొన్ని ప్రమాణాలకి లోబడి ఉండాలి. ఈ ప్రమాణాల ఆధారంగా అందుబాటులో ఉన్న వివిధ ఆధారాలని పోల్చి చూడవచ్చు. 

ఆధారాల సోపానక్రమంలో (hierarchy) మేము ఎక్కువ రేట్ చేయబడిన ఆధారాలకు ప్రాముఖ్యత ఇస్తాము. వీలైనన్ని చోట్ల, సెకండరీ సోర్సెస్  కంటే (సెకండరీ సోర్సెస్ అంటే ప్రాధమిక సోర్సెస్ కి సంబంధించిన వివరాలు, వివరణలు) ప్రాథమిక సోర్సెస్ కి (ఫస్ట్ హ్యాండ్ సమాచారం) ప్రాముఖ్యత ఇస్తాము. ఉదహరించబడిన ఆధారం నమ్మదగనిది కాదని విశ్వసించడానికి కారణం ఉంటే లేదా రిపోర్టింగ్‌ ప్రక్రియలో వ్యక్తిగత ప్రయోజనాలకు(conflict of interest) తావుండింది అని తెలిస్తే మేము ఈ విషయాలను తప్పకుండా తెలియచేస్తాము. 

ఆధారాల నాణ్యతను నిర్ణయించడానికి మాకు మేము వేసుకునే ప్రశ్న - “మమ్మల్ని తప్పుదారి పట్టించడం ద్వారా వారికి ఏమిటి లాభం లేదా నష్టం?” విశ్వసనీయమైనవి. క్లైమ్స్ గురించి తుది నిర్ధారణకు రావటానికి మాకు అందుబాటులో ఉన్న అత్యధిక నాణ్యత గల కనీసం రెండు ఆధారాలు అవసరం.

  • నిపుణుల ఏకాభిప్రాయం: అంతర్జాతీయంగా గౌరవప్రదమైన సంస్థల మరియు సంబంధిత రంగాలలోని నిపుణుల పరిశోధనలో లేదా అధికారిక ప్రకటనలో మేము నిర్ధారిస్తున్న క్లైమ్ కి సంబంధించిన తీర్పుకి మూలమైన ఆధారాలని స్పష్టంగా ప్రచురించారు. 
  • పీర్ రివ్యూడ్ రీసెర్చ్: ప్రముఖ పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురించబడ్డ పరిశోధన ఫలితాలు. 
  • నిష్పక్షపాత  ప్రభుత్వ/అధికార వర్గాల ఆధారాలు: తగిన నిర్ధారణ చేసుకున్నాక నమ్మకమైన, గౌరవప్రదమైన నిష్పక్షపాత ప్రభుత్వ సంస్థలు విడుదల చేసే గణాంకాలు, విధానాలు, చట్టాలని నాణ్యమైన ఆధారాలుగా తీసుకోవటం జరుగుతుంది. ఖచ్చితత్వానికి పేరు పొందిన ప్రభుత్వ సంస్థలు ఇందులో భాగమే (యు.ఎస్.బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు). ఒక నిర్ధిష్ట  రాజకీయ స్రవంతికి చెందిన రాజకీయ నాయకుల ప్రకటనలు కాని, ఒక రాజకీయ పార్టీ లేదా ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకటనలు కానీ ఇందులో భాగం కాజాలవు. అయితే ఒక క్లైమ్ ఈ రాజకీయ నాయకులకి సంబంధించినదైనా లేదా వారికి మాత్రమే తెలిసిన విషయమైతే మాత్రం వారి ప్రకటనలని తగు నిర్ధారణ జరిపాక ఆధారాలుగా తీసుకోవటం జరుగుతుంది. 
  • నిపుణుల అభిప్రాయం: క్లైమ్ కి సంబంధించిన విషయం మీద నైపుణ్యం కలిగి ఉన్నారు అని నిరూపణ అయిన సంస్థలు లేదా వ్యక్తులు లేదా ఆ విషయాలకి సంబంధించి నైపుణ్యం కలిగిన సంస్థలతో బలమైన సంస్థాగత అనుబంధం ఉన్న వారి పీర్-రివ్యూడ్ కాని పరిశోధన కూడా నాణ్యమైన ఆధారమే.
  • (నిపుణలు కాని )పాత్రికేయ శోధన: నిర్దిష్ట విషయ నైపుణ్యం లేకున్నా కూడా  గౌరవప్రదమైన పాత్రికేయ సంస్థలు, శోధన సంస్థలు లేదా పరిశోధనా సంస్థలతో బలమైన సంస్థాగత సంబంధాలు కలిగి ఉన్న వారు జరిపిన శోధన/పరిశోధన. 
  • ప్రత్యక్ష సాక్షుల కథనాలు: సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన వారి కథనాలు (ఇటువంటి కథనాలను ఎల్లప్పుడూ ధృవీకరించుకోవాలి).
  • కుదిరినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మా సంపాదక బృందం సభ్యుల ప్రత్యక్ష పరిశీలన.

పారదర్శకత కోసం లాజికల్లీ ఫ్యాక్ట్స్ చేసే ఫ్యాక్ట్ చెక్ లలో వాడిన ఆధారాల, మాట్లాడిన వ్యక్తుల/సంస్థల వివరాలు ఆ ఫ్యాక్ట్ చెక్ లోనే స్పష్టంగా తెలియచేస్తుంది. అయితే ఆ వ్యక్తి/సంస్థ పేరు తెలపడం వల్ల వారికి హాని ఉందంటే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వారు తెలిపిన వివరాలు ఇతర ఆధారాలతో సరితూగితే వారు చెప్పిన సమాచారాన్ని ఫ్యాక్ట్ చెక్ లో వాడతాము. 

Copy Link

అనేక కారణాల వల్ల ఫ్యాక్ట్ చెక్లను సవరించాల్సి రావచ్చు. కొత్త సమాచారం అందుబాటులోకి రావటం, కొత్త ఆధారాలు దొరకటం లేదా అచ్చు తప్పులని సరిదిద్దడం వంటివి కొన్ని కారణాలు. మా ఫ్యాక్ట్ చెక్లలోని ఏ అంశంలోనైనా మేము పొరపాటు చేసామని మీకు అనిపిస్తే ప్రచురించిన ప్రతి ఫ్యాక్ట్ చెక్ లో కనబడే “కాల్స్ టు యాక్షన్” ద్వారా మమ్మల్ని సంప్రదించండి. 

ప్రతీ ఫ్యాక్ట్ చెక్ ఒక ప్రత్యేక గుర్తింపు కోడ్ తో వస్తుంది. ఏదైనా ఫ్యాక్ట్ చెక్ ను అప్‌డేట్, ఫిర్యాదు లేదా దిద్దుబాటు కోసం త్వరగా గుర్తించటానికి ఈ కోడ్ మా సంపాదకీయ బృందానికి సహాయపడుతుంది. 

  • ఎక్కువ సవరణలు చేసిన ఫ్యాక్ట్ చెక్లు 'దిద్దుబాటు’ (correction) అనే నోట్ కలిగి ఉంటాయి.
  • పెద్దగా ముఖ్యమైన సవరణలు చేయని ఫ్యాక్ట్ చెక్లు (ఉదాహరణకు  అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేదా క్లైమ్ సారాంశాన్ని మార్చే అవకాశం లేని తప్పులు)  'అప్డేటెడ్' నోట్  కలిగి ఉంటాయి.
  • ఏ కథనంలో అయితే తప్పు వచ్చిందో అక్కడ సవరణ చేయలేని పరిస్థితి ఉంటే కనుక అదే ఒరిజినల్ ఫార్మాట్ లో ఈ సవరణని చేస్తాము.
  • ఫిర్యాదులను సంపాదక బృందంలోని సీనియర్ సభ్యులు పరిశీలించి, ఫ్యాక్ట్ చెక్లను సరి చేయాలా లేక అలాగే ఉంచాలా అనే నిర్ణయాన్ని వివరణతో సహా వెంటనే తెలియచేస్తారు.
  • మీరు మా జవాబుతో సంతృప్తి చెందకపోతే, మా సంపాదక బృందంలోని సీనియర్ సంపాదకీయ సభ్యులకు మీ ఫిర్యాదుని తీసుకునివెళ్లొచ్చు. వారు సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే క్లైమ్ ను పరిశోధించడానికి స్వతంత్ర సలహాదారుని కూడా నియమిస్తారు.
  • అప్‌డేట్ లేదా దిద్దుబాటుకు సంబంధించి ఆ ఫ్యాక్ట్ చెక్ ను ట్రాక్ చేస్తున్న పాఠకులకు  నోటిఫికేషన్ అందుతుంది.

సవరణలు చేసిన వివిధ కథనాల జాబితా మీరు ఇక్కడ చూడవచ్చు.

Copy Link

మేము ప్రచురించిన పాత్రికేయ, పరిశోధనాత్మక లేదా విద్యా సంబంధమైన విషయాలు తప్పుగా, తప్పుదారి పట్టించేవిగా లేదా అన్యాయంగా ఉన్నాయని మీరు విశ్వసిస్తే, దయచేసి పేజీ చివరిలో ఉన్న ఫారమ్ ద్వారా దిద్దుబాటు అభ్యర్థనను సమర్పించండి. ఇదే ఫారం 'మమ్మల్ని సంప్రదించండి' పేజీలో కూడా ఉంది. 

ఈ ఫిర్యాదులు మా సంపాదకీయ లీడ్‌లకు పంపబడతాయి. వారు 48 గంటలలోపు స్పందిస్తారు. యోగ్యమైన ఫిర్యాదులు సవరించబడతాయి. అలాగే ఆ సవరణకు వ్యాసంతో సమానమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మా విమర్శలకు న్యాయంగా తమ స్పందన తెలియచేయగలరు అన్న పరిస్థితులలో మా ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొన్న వారందరికీ స్పందించే హక్కును కల్పిస్తాము.  ఎవరికైనా కనుక స్పందించే హక్కుని మేము నిరాకరించేటట్టయితే అందుకు గల కారణాలని మా వెబ్సైట్లో తెలియచేస్తాము. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ IFCN సూత్రాలను ఉల్లంఘిస్తుందని మీరు భావిస్తే కనుక IFCNకి నేరుగా ఇక్కడ తెలియజేయవచ్చు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.