ఒడిశాకి సంబంధించిన ఫొటోని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయనాకుడు ఒక దళిత మహిళని కొడుతున్నట్టుగా షేర్ చేసారు

ద్వారా: రోహిత్ గుత్తా
జనవరి 3 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒడిశాకి సంబంధించిన ఫొటోని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయనాకుడు ఒక దళిత మహిళని కొడుతున్నట్టుగా షేర్ చేసారు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఒడిశాలో ఒక వ్యక్తి తన తల్లిని కట్టేసి కొడుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఇదే విషయాన్ని ఒడిశా పోలిసులు కుడా లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి నిర్ధారించారు.

క్లైమ్ ఐడి 227d6455

(సూచన: ఈ కథనంలో దాడి ఘటనకి సంబంధించిన వివరణ, ఫొటోలు ఉన్నాయి. పాఠకులు గమనించగలరు)

క్లైమ్ ఏమిటి?

ఎక్స్ మరియు ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో ఒక మహిళని కట్టేసి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ ఒక దళిత మహిళని స్తంభానికి కట్టేసి కొడుతున్నాడు అనే వ్యాఖ్యలతో షేర్ చేస్తున్నారు. ఫొటోలో రోడ్డు మీద కరెంటు స్తంభంలా కనిపించి ఒక దానికి ఒక పెద్ద వయసు మహిళని తాడుతో కట్టేసినట్టు కనిపిస్తుంది. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ప్రభాకర్ ఏలూరు లోని దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మరియు తెలుగుదేశం నేత. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయితే ఇది ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన ఘటన కానీ టిడిపి నాయకుడికి సంబంధించినది కానీ కాదు. 

మేము ఏమి తెలుసుకున్నాము?

వైరల్ అవుతున్న ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే డిసెంబర్ 24 నాటి ఒడిశా పోస్ట్  కథనం ఒకటి లభించింది, ఇందులో వైరల్ అవుతున్న ఫొటో ఉంది. ఆ కథనం ప్రకారం, ఈ సంఘటన ఒడిశాలోని కియొంఝర్ జిల్లాలో చంపువా పోలీస్ స్టేషన్ పరిధిలోని  సర్సపాసి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ 70 ఏండ్ల మహిళని, తన కొడుకు  కాలీఫ్లవర్ దొంగతనం చేసిందనే నెపంతో స్థంబానికి కట్టేసి కొట్టాడు. ఆ కథనం ప్రకారం, ఇది డిసెంబర్ 20, 2023 నాడు చోటుచేసుకుంది.

డిసెంబర్ 25 నాడు ప్రచురితమయింది టీవీ9 బంగ్లా కథనం ప్రకారం, ఈ సంఘటన తరువాత ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తమ విచారణ మొదలుపెట్టారు. ఈటీవీ భారత్ ఒరియా, డెక్కన్ క్రానికల్ మరియు ఇండియా టుడే కుడా ఈ ఫొటోతో కూడిన కథనాలు ప్రచురించాయి.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని మరియు ఎఫ్ఐఆర్ పత్రాన్ని కుడా సంపాదించింది. దీని ప్రకారం, ఈ ఘటన డిసెంబర్ 20, 2023 నాడు చోటుచేసుకుంది, దాని తరువాత ఆమెని ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 23 నాడు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముద్దాయిపై భారత శిక్షా స్మృతిలోని  వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు, వాటిలో ఉద్దేశపూర్వకంగా గాయపరచడం మరియు బంధించడానికి సంబంధించిన సెక్షన్లు కుడా ఉన్నాయి.

చంపువా పొలిస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ త్రినాథ్ సేథీని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. అయన ఈ ఘటన సర్సపాసి గ్రామం లో జరిగిందని నిర్దారిస్తూ, ఆ మహిళ దళితురాలు కాదని ఇతర వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందినదని తెలిపారు. బాధితురాలిని మేము సంప్రదించలేకపోయాము.

చింతమనేని ప్రభాకర్ మీద ఆరోపణలు 

చింతమనేని ప్రభాకర్ రాజకీయ జీవితం ఆరోపణలమయం. 2018లో 2011నాటి ఒక దాడి కేసుకి సంబంధించి స్థానిక న్యాయస్థానం ఆరు నెలల కారాగార శిక్ష కూడా విధించింది. అయితే ఈ శిక్షని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కొట్టివేసింది. 2019లో ఒక దళిత యువకుడి మీద దాడి చేసి, దూషించిన ఆరోపణల మీద కేసు నమోదు చేయటం జరిగింది. తన 2019 ఎన్నికల ప్రమాణ పత్రం ప్రకారం తన మీద 27 కేసులు ఉన్నాయి. అందులో హత్యా నేరం, బలవంతపు వసూళ్లు, అపహరణ, దాడి లాంటి ఆరోపణలు ఉన్నాయి. 

తీర్పు :

ఒడిశాలో జరిగిన ఘటనకి సంబంధించిన ఫొటోని షేర్ చేస్తూ, ఇది ఆంధ్ర ప్రదేశ్ లో ఒక తెలుగుదేశం నాయకుడు ఒక మహిళని స్తంభానికి కట్టేసి కొట్టిన ఫొటో అని ప్రచారం చేశారు. కాబట్టి ఇది అబద్దం అని మేము నిర్ధారించాము.

(అనువాదం: రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.