ఆంధ్రాలో అభివృద్ధి జరగడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంగీకరించినట్టుగా ఎడిట్ చేసిన వీడియో షేర్ చేశారు

ద్వారా: రాహుల్ అధికారి
జనవరి 12 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్రాలో అభివృద్ధి జరగడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంగీకరించినట్టుగా ఎడిట్ చేసిన వీడియో షేర్ చేశారు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్. (సౌజన్యం: ఎక్స్ /లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వైరల్ అవుతున్న సన్నివేశం వైఎస్‌ఆర్‌సీపీ నేత సజ్జల భార్గవ రెడ్డి ప్రసంగం నుండి తీసుకోబడింది మరియు సందర్భం లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.

క్లైమ్ ఐడి 28a576e7

క్లెయిమ్ ఏమిటి?

తమ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ సజ్జల భార్గవ రెడ్డి అంగీకరించారని సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ అవుతోంది. ఈ వీడియో క్లిప్ లో, “రాష్ట్రంలో అభివృద్ధి లేదు” అని రెడ్డి చెప్పడం వినవచ్చు.

ఒక యూజర్ ఈ క్లిప్‌ను ఎక్స్( పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేసారు, ఈ పోస్ట్‌కి 28,000కు మంది పైగా చూసారు మరియు 607 లైక్‌లు వచ్చాయి. పోస్ట్‌తో పాటు షేర్ చేసిన క్యాప్షన్‌లో “మా ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు” అని ఉంది. పోస్ట్ యొక్క ఆర్కైవ్ చేసిన ఇక్కడ చూడవచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్. (సౌజన్యం: ఎక్స్ /లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ వీడియోని సజ్జల భార్గవ రెడ్డి ప్రతిపక్షాన్ని దూషిస్తూ చేసిన ప్రసంగం నుండి తీసి షేర్ చేస్తున్నారు అని మేము కనుగొన్నాము.

మేము ఏమి కనుగొన్నాము?

వీడియో లోని  కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతుకగా, వైరల్ వీడియో మాదిరిగానే మరింత నిడివి గల వీడియో లభించింది. ఇది జూలై 4, 2023న తెలుగు వార్తా సంస్థ సాక్షి టీవీ లైవ్ ప్రచురించిన వీడియో, ఇది రెడ్డి చేసిన 4:57 నిమిషాల ప్రసంగం. వీడియో లో, రెడ్డి ప్రతిపక్షాన్ని విమర్శించాడు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి సరిగ్గా జరగట్లేదు అని ప్రతిపక్షం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది అని అన్నారు.  ఒక వైపు, ప్రభుత్వం సంక్షేమ పథకాల పైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని, కాని ప్రతిపక్షాలు మాత్రం, ఈ ప్రభుత్వం అభివృద్ధికి వ్యతిరేకం అని ముద్ర వేయడానికి చూస్తున్నారు అని అన్నారు. ఇలాంటి కథనాలతోనే ప్రజలను ఉచ్చులో పడేయాలని అని టిడిపి అనుకుంటుంది అని అన్నారు, ప్రజలందరూ ఇలాగే ఆలోచించేలా ప్రతిపక్షం విశ్వ ప్రయత్నం చేస్తుంది అని అన్నారు.

ఇదే ప్రసంగం నుంచి, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని 4:08 నుండి 4:11 టైమ్‌స్టాంప్ వరకు ఉన్న భాగాన్ని కట్ చేసి అసంధర్బంగా షేర్ చేస్తున్నారు. 22:40 నిమిషాల నిడివి గల పూర్తి ప్రసంగం చూస్తే, ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకి సామాజిక మాధ్యమాలను ఎలా వాడాలి అనే దాని పై శిక్షణ ఇస్తున్న వీడియోగా అర్ధం అవుతుంది, రెడ్డి ఆయన ప్రసంగంలో నేతలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మేము ఆయన ఈ ప్రసంగం ఎక్కడ చేసారు అనే దానిని కనుక్కోలేకపోయాము.

రెడ్డి తమ పార్టీలో అభివృద్ధి జరగలేదు అనే వ్యాఖ్యలు చేసినట్లు ఏ విధమైన వార్త కథనాలు కూడా ప్రచురించలేదు, కాబట్టి ఆ వైరల్ క్లిప్, రెడ్డి ఇచ్చే సామాజిక మాధ్యమాల శిక్షణ నుంచి అసంధర్బంగా తీసుకున్నారు అని అర్ధం అవుతుంది.

తీర్పు :

సజ్జల భార్గవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదు అనే వ్యాఖ్యలు అనలేదు. వైరల్ క్లిప్ ని సజ్జల భార్గవ్ రెడ్డి ఇతర ప్రసంగం నుండి తీసుకున్న సందర్భంగా షేర్ చేశారు. కనుక మేము ఇది తప్పు దోవ పట్టించే టట్టు ఉంది అని నిర్ధారించాము.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.