జనవరి 22నాడు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైన రాముడి చిత్రం ప్రదర్శించలేదు

ద్వారా: సోహం శా
జనవరి 25 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
జనవరి 22నాడు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైన రాముడి చిత్రం ప్రదర్శించలేదు

బుర్జ్ ఖలీఫాపై రాముడి చిత్రం ప్రదర్శన అంటూ క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్  (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేసి రాముడి ఫోటోని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవంతిపై ప్రదర్శించినట్టుగా చూపారు.

క్లైమ్ ఐడి 443baf0f

క్లెయిమ్ ఏమిటి?


అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా  హిందువులు కొలిచే దేవుడైన రాముడి చిత్ర పటం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై  జనవరి 22 నాడు ప్రదర్శించారు అని ఆజ్ తక్ లో జనవరి 23, 2024 నాడు ప్రచురితమైన కథనంలో రాసి ఉంది. తరువాత ఈ కథనాన్ని మార్చి రాశారు. అయితే ఆ కథనం ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

ఆజ్ తక్ లో పబ్లిష్ అయిన కథనం (సౌజన్యం: ఆజ్ తక్/స్క్రీన్ షాట్)


ఫేస్బుక్, ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లాంటి సామాజిక మాధ్యమాలలో కుడా బుర్జ్ ఖలీఫా పై రాముడి చిత్రం ప్రదర్శించారు అనే వ్యాఖ్యలతో ఈ ఫోటోని పలువురు యూజర్లు షేర్ చేసారు. ఆ పోస్ట్ల ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

బుర్జ్ ఖలీఫాపై రాముడి చిత్రం ప్రదర్శన అంటూ క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్  (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, మా పరిశోధనలో బుర్జ్ ఖలీఫాపై రాముడి చిత్రం ప్రదర్శించినట్టు  ఏ విధమయిన ఆధారాలు దొరకలేదు.

మేము ఏమి కనుగొన్నాము?

యాండెక్స్ సెర్చ్ ఇంజిన్ లో ఈ చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు పిన్టెరెస్ట్ లో అలాంటి ఫోటోనే ఒకటి లభించింది. కాకపోతే ఇందులో రాముడి చిత్రం బుర్జ్ ఖలీఫా పై లేదు. ఈ పోస్ట్ జూలియా ఆల్బం లో భాగంగా అక్టోబర్ 22, 2019 నాడు ప్రచురించినట్టు ఉంది, ఇది ప్రస్తుతం వైరల్ అవుతున్న చిత్రం లానే ఉంది. ఈ రెండు బుర్జ్ ఖలీఫా చిత్రాలను పోల్చి చూస్తే, అందులో కనిపిస్తున్న క్రేన్ల దిశా, వెలిగి ఉన్న కిటికీలు, ఒకే మాదిరిగా అనిపించాయి, దీనితో ఈ రెండు ఒకటే అని మేము కనుగొన్నాము.

వైరల్ అవుతున్న ఫొటో మరియు ఒరిజినల్ ఫొటో మధ్య పోలిక (సౌజన్యం : జూలియా ఆల్బం/స్క్రీన్ షాట్)

ఆ బ్లాగ్ లో ఈ ఫొటోని ఏ రోజున తీశారు అనే విషయం వ్యక్తపరచకపోయిన ఇది 2019 నుండి ఉందని తెలుస్తుంది. 

పైగా బుర్జ్ ఖలీఫా అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కుడా అలాంటి ఫొటోలేమి లేవు. ప్రతి ప్రదర్శన తరువాత బుర్జ్ ఖలీఫా ఆ ఫోటోలను తమ సామాజిక మాధ్యమాలలో పొందుపరుస్తారు. అందులోను ఈ మధ్య కాలంలో కనపడిన ఫోటోలలో బుర్జ్ ఖలీఫా వద్ద వైరల్ ఫొటోలో మాదిరిగా ఉన్న క్రేన్లు కనపడలేదు. 

తీర్పు:

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో పాతది మరియు ఎడిట్ చేయబడినది. బుర్జ్ ఖలీఫా అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్బంగా రాముడి ఫొటోని ప్రదర్శించలేదు. కావున, మేము దీనిని ఫేక్ అని నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరస)

Read this fact check in English here.

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.