ఐరోపా కి విచ్చేసే వారందరు బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు

ద్వారా: యిరీనా నటియుక్
డిసెంబర్ 6 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఐరోపా కి విచ్చేసే వారందరు బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

సా ద్వారా ఈఈఎస్ నుంచి విచ్చేసే వారు మాత్రమే బయోమెట్రిక్స్ చూపించాలి. ఈటిఐఏఎస్ ద్వారా వచ్చేవారు అవసరం లేదు.

క్లైమ్ ఐడి 6dee2a36

క్లెయిమ్ ఏమిటి? 

ఐరోపా కి విచ్చేసే వారందరు వారి వేలి ముద్రలు, ఫేషియల్ స్కాన్లు తప్పనిసరిగా ఇవ్వాలి అంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక ఫేస్బుక్ యూజర్ ఆ వీడియోని షేర్ చేస్తూ (ఆర్కైవ్ ఇక్కడ) దానికి శీర్షికగా, “ప్రయాణించడానికి నిబంధనలు మారుతున్నాయి,” అని రాసుకొచ్చారు. దానిలో కొన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఉండగా, మొత్తానికి ఐరోపాకి రావడానికి అందరూ బయోమెట్రిక్ డేటా ను మాత్రం సబ్మిట్ చెయ్యాలి అని అర్ధం వచ్చేలా ఉంది. 

2025 మధ్యలో ప్రారంభం కానున్న యూరోపియన్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆథరైజేషన్ సిస్టమ్ (ETIAS) పద్దతిలో ప్రయాణికులు వీసా లేదా పాస్పోర్ట్ చూపనవసరం లేదు అంటూ ఈ వీడియోలో ఉంది. ఇది ప్రయాణికుల పాస్పోర్ట్ కు లింక్ అయి ఉంటుంది అని ఉంది. దీనిని యుఎస్ లో ఉన్న వీసా వైవెర్ పద్దతి, ది ఎలక్ట్రానిక్ సిస్టం ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ESTA) తో పోల్చి, ఈటిఐఏఎస్ కుడా ఈ విధంగానే ఎంట్రీ వెయిటింగ్ సమయాన్ని తగ్గిచడానికి ముందుగానే తగిన సమాచారం, అంటే పాస్పోర్ట్ ఐడి సంఖ్య, వెళ్ళబోతున్న చిరునామా, ఎంతకాలం ఉంటాం అనే వివరాలు అడిగి తెలుసుకుంటుంది అని ఉంది. 

వాస్తవం ఏమిటి? 

ప్రయాణికులకు ఇప్పటికి కుడా ఒక అధికారిక పాస్పోర్ట్ మరియు అవసరమైతే వీసా కుడా ఉండాలి. వారు తప్పనిసరిగా, యూరోపియన్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆథరైజేషన్ సిస్టమ్ (ETIAS) లో లేదా యూరోపియన్ ఎగ్జిట్ ఎంట్రీ సిస్టమ్ (EES) లో నమోదు చేసుకుని ఉండాలి. ప్రయాణికులు ఈటిఐఏఎస్ ద్వారా నమోదు చేసుకుంటే వారి వేలిముద్రలు, వారి ఆరోగ్య వివరాలు, టీకా వివరాల లాంటి బయోమెట్రిక్ డేటా తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ ఈఈఎస్ పద్దతి ద్వారా నమోదు చేసుకుంటే మాత్రం వారు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2024 లో ప్రారంభం కానున్న ఈ ఆటోమేటెడ్ పద్దతి ఐరోపా బయటనుంచి వచ్చే ప్రయాణికుల్ని రిజిస్టర్ చేస్తుంది. ఇందులో వారి పేరు, ప్రయాణానికి వాడిన పత్రాలు మరియు బయోమెట్రిక్ డేటా అడుగుతుంది. 

ఐరోపా కి ఏ దేశంతోనైతే వీసా అక్కర్లేదు అనే ఒప్పందం ఉందో వారు ఈటిఐఏఎస్ ద్వారా అప్లై చెయ్యాలి, దీనికి బయోమెట్రిక్స్ అక్కర్లేదు. ఉదాహరణకి అమెరికా. ఎవరికైతే ఐరోపాకి రావడానికి షెన్జెన్ వీసా కావాలో వారు ఈఈఎస్ ద్వారా అప్లై చేసి, బయోమెట్రిక్స్ అందజేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఒక కుట్ర అని అర్థం వచ్చేలా ఈ వీడియో చివర్లో “ఇది ప్రారంభం మాత్రమే,” అని ఉంది. .

అయితే ఈ పద్దతి ఉద్దేశం సమర్ధతని పెంచడమే కానీ జనాల కదలికలని నియంత్రించటం కాదు. 

తీర్పు : 

ఈఈఎస్ ద్వారా మాత్రమే ప్రయాణికులు బయోమెట్రిక్స్ అందజేయాల్సి ఉంటుంది. ఈటిఐఏఎస్ ద్వారా అవసరం లేదు. ఎవరికైతే వీసా అవసరం లేదో వారు ఈటిఐఏఎస్ పద్దతి ద్వారా కుడా బయోమెట్రిక్స్ అందజేయక్కర్లేదు. ఈ రెండు పద్ధతులు కుడా అధికారిక ప్లాట్ఫామ్లు, ఇవి వీసాకి కానీ పాస్పోర్ట్ కి కానీ బదులుగా కాదు. కనుక మేము దీనిని తప్పుదోవ పట్టించేటట్టు గా ఉంది అని నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.