డి.కే. శివకుమార్ పాత వీడియోని తెలంగాణా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోగా ప్రచారం చేశారు.

ద్వారా: ఇషిత గోయల్ జె
నవంబర్ 2 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
డి.కే. శివకుమార్ పాత వీడియోని తెలంగాణా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోగా ప్రచారం చేశారు.

సామాజిక మాధ్యమాలలో పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

డి.కే.శివకుమార్ కర్ణాటకలో 2022లో చేసిన పాదయాత్రకి సంబంధించిన వీడియోని తెలంగాణలో మద్యం సేవించి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని క్లైమ్ చేస్తూ షేర్ చేశారు.

క్లైమ్ ఐడి 78f188e3

క్లైమ్ ఏమిటి?

తెలంగాణలో శాసనసభ ఎన్నికలు నవంబర్ 30, 2023 నాడు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 నాడు జరగనుంది. ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు కర్ణాటక ఉపముఖ్యమంత్రి అయిన డి.కే. శివకుమార్ తన అనుచరులతో కలిసి నడుస్తున్నట్టు ఉంది. తను అస్తవ్యస్తంగా నడుస్తూ, దాదాపుగా పడిపోబోతునట్టు ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో షేర్ చేస్తూ తను మద్యం సేవించి తాండూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని క్లైమ్ చేశారు. ఈ పోస్ట్స్ ఆర్కైవ్ వెర్షన్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.  

డి. కే. శివకుమార్ అక్టోబర్ 28, 2023 నాడు తాండూర్ లో ప్రచారం నిర్వహించారు. 

సామాజిక మాధ్యమాలలో పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది పాత వీడియో. తెలంగాణలో ప్రచారానికి ఈ వీడియోకి సంబంధం లేదు. 

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియో పైభాగాన ఎడమవైపు “న్యూస్ ఫస్ట్ కన్నడ” అనే లోగో ఉంది. అలాగే కింద భాగాన వీరి సామాజిక మాధ్యమ హ్యాండిల్స్ వివరాలు ఉన్నాయి. ఈ వీడియోని ఈ ఛానల్ వారు తమ అధికారిక యూట్యూబ్ అకౌంట్ లో జనవరి 9, 2022 నాడు అప్లోడ్ చేశారని తెలుసుకున్నాము. ఈ వీడియోకి “డి. కే. శివకుమార్: అలసిపోయిన డి. కే.I మేకెదాతు పాదయాత్రI న్యూస్ ఫస్ట్ కన్నడ” అనే శీర్షిక పెట్టారు. 

అలాగే జనవరి 10 తారీఖున ఇండియా టుడే పత్రిక శివకుమార్ తో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ చేసింది. “కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుని పాదయాత్రలో కనపడని భౌతిక దూరం?I డి. కే. శివకుమార్ ఎక్స్క్లూసివ్” , అనేది ఈ ఇంటర్వ్యూ శీర్షిక. ఈ వీడియోలో 7:28 టైమ్ స్టాంప్ దగ్గర వైరల్ వీడియోలో ఉన్న క్లిప్ నే చూడవచ్చు. ఎడమవైపు ఇది మేకెదాతులో తీసిన వీడియో అని ఉంది. “నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. మీరు నా శాంపిల్ ఇవ్వమని బలవంతపెట్టకూడదు. చట్టం నాకు తెలుసు. నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని మీ హోమ్ మంత్రికి చెప్పండి”, అని శివకుమార్ ఒక అధికారితో అన్నారని ఇండియా టుడే వీడియో వివరణలో ఉంది. జనవరి 9 నాడు కాంగ్రెస్ 165 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టింది. ఇది ఆ పాదయాత్రలో జరిగిన సంఘటన. కోవిడ్ పరీక్ష చేపించుకోవడానికి నిరాకరించినందుకు శివకుమార్ విమర్శలకి గురయ్యారు. 

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం బెంగళూరు పట్టణ, పరిసరాలకి తాగు నీటి సౌకర్యం కలిపించడానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించడం కోసం శివకుమార్ ఈ పాదయాత్రని జనవరి 2022 లో చేపట్టారు. పది రోజులలో 60 నియోజకవర్గాలని చుట్టేలా ఈ పాదయాత్రని ప్లాన్ చేశారు. కోవిడ్ నియమాలకి వ్యతిరేకంగా ఈ పాదయాత్ర ఉన్నందున దీని మీద విమర్శలు వచ్చాయి. 

సామాజిక మాధ్యమాలలో ఆరోపించినట్టు తను మద్యం సేవించి ఉన్నారో లేదో మేము తెలుసుకోలేకపోయాము కానీ ఈ వీడియో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో మాత్రం కాదనేది సుస్పష్టం. 

తీర్పు 

జనవరి 2022లో కర్ణాటకలో శివకుమార్ చేపట్టిన పాదయాత్రకి సంబంధించిన వీడియోని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తను మద్యం సేవించి పాల్గొన్నారంటూ క్లైమ్ చేస్తూ షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.