తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కి మద్దతు పలకమని చంద్రబాబు నాయుడు తన తోటి కులస్థులకి బహిరంగ లేఖ రాయలేదు

ద్వారా: రోహిత్ గుత్తా
నవంబర్ 13 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కి మద్దతు పలకమని చంద్రబాబు నాయుడు తన తోటి కులస్థులకి బహిరంగ లేఖ రాయలేదు

సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

సర్కులేట్ అవుతున్న లేఖ ఫేక్. తెలుగుదేశం పార్టీ అధికారిక లెటర్ హెడ్ ని ఎడిట్ చేసి ఈ లేఖ సృష్టించారు.

క్లైమ్ ఐడి 7d60ebd8

క్లెయిమ్ ఏమిటి?

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో వివిధ పార్టీల ప్రచారం జరుగుతున్న సమయంలో తప్పుడు ప్రచారాలు కుడా సామాజిక మాధ్యమాలలో జోరందుకున్నాయి.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ ఒక ఫోటోని నవంబర్ 8, 2023 నాడు షేర్ చేస్తూ, అది నారా చంద్రబాబు నాయుడు కమ్మ కులస్థులకి తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కి మద్దతు పలకమంటూ రాసిన లేఖ అని రాసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు కమ్మ కులానికి చెందిన వారు. ఈ కులస్థులు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం సర్కులేట్ అవుతున్న లేఖలో, తెలుగు దేశం పార్టీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ని తమ అధీనం లో ఉంచుకున్నారు అని కుడా రాసి ఉంది.“కమ్మ వారికి చంద్రబాబు లేఖ” అనే శీర్షికతో ఈ ఫొటోని షేర్ చేశారు.  ఆ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. ఈ లేఖ ఫేస్బుక్ లాంటి వేరే సామాజిక మాధ్యమాలలో కుడా సర్కులేట్ అయ్యింది. (ఆర్కైవ్ ఇక్కడ). 

సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ.  ఈ పార్టీ తెలంగాణ మరియు అండమాన్ అండ్ నికోబర్ దీవులలో కుడా ఉంది. రాబోయే తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ లేఖ ఫేక్.

మేము ఏమి కనుగొన్నము?

ఇలాంటి లేఖ ఏమైనా చంద్రబాబు రాశారా అని మేము వార్త కథనాలు, అలాగే టిడిపి మరియు చంద్రబాబు  అధికారిక సామాజిక మాధ్యమ అకౌంట్లు వెతికాము.  అయితే మాకు అలాంటి కథనాలు ఏమీ లభించలేదు.

ఆ తరువాత మేము వైరల్ అవుతున్న లెటర్ హెడ్ ని టిడిపి వారి అధికారిక లెటర్ హెడ్ తో పోల్చి చూస్తే మాకు కొన్ని లొసుగులు కనిపించాయి.

మొదటిది: లెటర్ హెడ్ లో వాడిన ఫాంట్

వైరల్ లేఖలో చిరునామా సెక్షన్ లో వాడిన ఫాంట్ మరియు టిడిపి అధికారిక లెటర్ హెడ్ లోని ఫాంట్ వేరేగా ఉన్నాయి. వైరల్ లెటర్ లో అడ్రస్ సెక్షన్ లో ఆఖరి లైన్ మరియు హెడర్  మధ్య దూరం కూడా  ఒరిజినల్ లెటర్ హెడ్ లో ఉన్నదానికన్నా ఎక్కువగా ఉంది.

వైరల్ లెటర్ హెడ్ మరియు అధికారిక లెటర్ హెడ్ మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/ స్క్రీన్ షాట్)

రెండవది: పార్టీ గుర్తు

టిడిపి లెటర్ హెడ్ అని చలామణి అవుతున్న లేఖలో లొసుగులు ఉన్నాయి. అధికారిక లెటర్ హెడ్ లో పచ్చ జెండా, కొద్దిగా వంగి ఉంటుంది, కానీ వైరల్ అయిన లెటర్ హెడ్  లో ఆలా లేదు. పైగా, అధికారిక లెటర్ హెడ్ లో చక్రం మధ్యలో తెలుపు రంగు ఉంటుంది, కానీ అది వైరల్ లెటర్ హెడ్ లో వెనుక ఉన్న పసుపు రంగులో కలిసిపోయి పసుపు పచ్చ రంగులో కనబడుతుంది. 

వైరల్ అవుతున్న లెటర్ హెడ్ మరియు అధికారిక లెటర్ హెడ్ కి మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)


టిడిపి ఈ లెటర్ హెడ్ ని 2019 రెండవ భాగంలో వారు మంగళగిరికి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని మార్చిన తరువాత నుంచి వాడుతున్నారు. 2019 కి మునుపు టిడిపి పాత అడ్రస్, ఆరండల్ పేట్ , గుంటూరు అని ఉంటుంది. అలాగే ఈ పాత లెటర్ హెడ్ లోని   చిరునామా ఫాంట్  వైరల్ లెటర్ హెడ్ లో ఉన్న ఫాంట్ కూడా వేరు వేరు. 

పాత ప్రధాన కార్యాలయం చిరునామా ఉన్న అధికారిక లెటర్ హెడ్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)

టిడిపి వారు తమ అధికారిక ఎక్స్ అకౌంట్లోఈ లెటర్ ఫేక్ అని తెలిపారు. “జగన్ కి ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ ఫేక్ లెటర్ చెబుతోంది. కుల అహంకారంతో విర్రవీగే జగన్ రెడ్డి... రాజకీయ ప్రయోజనాల కోసం అదే కులాలను రెచ్చగొడతాడు. ప్రజలారా! ఈ ఫేక్ గాళ్ళ మాటలను, చేతలను నమ్మకండి.”

ఆ లేఖ ఫేక్ అని ఎక్స్ లో టిడిపి పెట్టిన పోస్ట్ స్క్రీన్ షాట్ ( సౌజన్యం: ఎక్స్/జై టిడిపి)

తీర్పు:

ఒక ఫేక్ లేఖ సృష్టించి చంద్రబాబు నాయుడు తన కులస్థులని  తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటు వేయమన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. కనుక మేము దీనిని ఫేక్ అని నిర్ధారించాము.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.