క్లిప్ చేసిన వీడియో చూపి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాబోయే ఎన్నికలలో బీజేపీ విజయం అని అన్నట్టుగా షేర్ చేసారు

ద్వారా: మహమ్మద్ సల్మాన్
ఫిబ్రవరి 9 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
క్లిప్ చేసిన వీడియో చూపి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాబోయే ఎన్నికలలో బీజేపీ విజయం అని అన్నట్టుగా షేర్ చేసారు

వైరల్ వీడియోని షేర్ చేసిన పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

మల్లిఖార్జున్ ఖర్గే ప్రసంగం లోనుంచి ఒక భాగాన్ని తీసి, అసంధర్బంగా షేర్ చేసారు. ఆయన బీజేపీ కి కనీసం 100 సీట్లు కుడా రాబోయే ఎన్నికలలో రావని చెప్పారు.

క్లైమ్ ఐడి 8e4e7be5

క్లెయిమ్ ఏమిటి?

భారత దేశ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇందులో అయన ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో  మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటమిని ముందుగానే ఒప్పుకున్నట్టుగా షేర్ చేసారు. దీనిని షేర్ చేస్తూ, కొంతమంది యూజర్లు, బీజీపీ కి కచ్చితంగా 400 కి పైగా సీట్లు వస్తాయని ఖర్గే అన్నారని పేర్కొన్నారు. (భారత దేశం లో ఒక పార్టీ గెలవాలంటే, కనీసం 272 సీట్లు కావలి). 

వైరల్ వీడియోలో ఖర్గే హిందీ లో మాట్లాడుతూ, “మీకు చాలా ఆధిక్యత ఉంది, ఇంతకుముందు 330-334 ఉంటే, ఇప్పుడు 400కు పైగా” అని అన్నట్టుగా ఉంటుంది. ఈ వీడియోని, బీజేపీ వారు ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేసారు, మరియు స్మ్రితి ఇరానీ. పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య లాంటి ఇతర మంత్రులు కుడా షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.


వైరల్ వీడియోని షేర్ చేసిన పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ, ఇక్కడ ఖర్గే వీడియోని క్లిప్ చేసి అసంధర్బంగా షేర్ చేసారు. 

మేము ఏమి కనుగొన్నము?

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకి సంబందించిన పూర్తి వీడియోని మేము చూసాము, ఇది పార్లమెంట్ లో ఖర్గే మాట్లాడుతున్న వీడియో. ఈ వీడియోని, సన్సద్ టివి (పార్లమెంట్ లో జరిగే విషయాలను తెలియజేసే ఛానల్) వారి యూట్యూబ్ ఛానల్ లో ఫిబ్రవరి 2 నాడు అప్లోడ్ చేసారు.

ఈ వీడియోలో, రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్తూ, రాజ్య సభ లో ప్రతిపక్ష నాయకుడు అయిన ఖర్గే బీజేపీ  ప్రభుత్వాన్ని వివిధ విషయాల పైన విమర్శించారు. ఈ వీడియోలో 45 నిమిషాల నిడివి దగ్గర, ఖర్గే ఆడవారి ప్రాతినిధ్యం గురించి మాట్లాడారు. ఆయన బీజేపీ పార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రమాణం చేసింది, కానీ వారి ప్రభుత్వమే, సుప్రీమ్ కోర్ట్ లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది అని అన్నారు. 

మరియు 45:55 నిడివి దగ్గర, ఖర్గే బిజెపి నినాదాన్ని గురించి మాట్లాడుతూ, “మీకు చాలా ఆధిక్యత ఉంది, ఇంతకుముందు 330-334 ఉంటే, ఇప్పుడు 400కు పైగా” అని అన్నారు. (‘ఈసారి మేము 400 దాటుతాము’ అనేది బీజేపీ నినాదం). ఖర్గే ఈ వ్యాఖ్యలు అనగానే, అక్కడున్న సభ్యులు బెంచీలని కొట్టారు. 

ఈ వీడియోలో ఖర్గే అయన ప్రసంగాన్ని కొనసాగించాలని చుసిన కుడా అక్కడి కొంతమంది అధికార పార్టీ  సభ్యులు నవ్వుతూ, బెంచీలను కొడుతూ ఆయనని అడ్డుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఖర్గే కొనసాగిస్తూ, “వాళ్ళ గురించి గొప్పలు వాళ్ళే చెప్పుకుంటున్నారు, 400, 500 పైగా వస్తాయని. మీరు నిజంగా, అధికారం లోకి వచ్చేదట్ఠితే, మీరు ఇవన్నీ ఎందుకు చెయ్యట్లేదు, అంటూ, బీజేపీ చేసిన ప్రమాణ పాత్రలను చూపారు. “ఈసారి మీరు 100 కుడా దాటారు. INDIA కూటమి బలమయినది” (INDIA అనేది ప్రతిపక్షాల కూటమి) అని అన్నారు.


ఖర్గే వెంటనే, మహిళల యొక్క ప్రాతినిధ్యం గురించి, రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఇక్కడినుంచే, ఖర్గే  బీజేపీ ని విమర్శిస్తూ, కనీసం 100 సీట్లు కుడా రావని అన్నారు, కానీ వారి పార్టీ మాత్రం 400 దాటుతాయని గొప్పలు చెప్పుకుంటుంది అని అర్ధం తో అన్నారు.  కానీ ఆయన తరువాత మాట్లాడిన దానిని తీసేసి, కేవలం, వైరల్ క్లిప్ లో ఉన్నట్టుగా ఉన్న మాటలని ప్రచారం చేసారు.

తీర్పు :

క్లిప్ చేసిన వీడియో చూపి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఓటమిని ఒప్పుకుని బీజేపీ కి 400 పైగా సీట్లు వస్తాయని అన్నారు అనే తప్పుడు క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు. కనుక మేము దీనిని తప్పుదోవ పట్టించేటట్టుగా ఉందని నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.