గతంలో వైసీపీ శాసనసభ్యులు టిడీపీని విమర్శించిన వీడియోని ఇటీవల జగన్ ప్రభుత్వం మీద విమర్శగా ప్రచారం చేస్తున్నారు

ద్వారా: రాజేశ్వరి పరస
డిసెంబర్ 22 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
గతంలో వైసీపీ శాసనసభ్యులు టిడీపీని విమర్శించిన వీడియోని ఇటీవల జగన్ ప్రభుత్వం మీద విమర్శగా ప్రచారం చేస్తున్నారు

సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న క్లెయిమ్ (సౌజన్యం: ఎక్స్/ స్క్రీన్ షాట్ /లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ప్రచారంలో ఉన్న వీడియో 2018 లో ఆంధ్ర ప్రదేశ్లో టిడీపీ ప్రభుత్వం ఉన్న సమయం లోనిది.

క్లైమ్ ఐడి aa01cde6

క్లెయిమ్ ఏమిటి ? 

ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో వైసిపి పార్టీకి చెందిన  కురుపాం శాసనసభ్యులు పుష్ప శ్రీవాణి మాట్లాడుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో తను మాట్లాడుతూ, ఒక గిరిజనురాలిగా, విజయనగరంలో గిరిజన బాలికలకు వైద్యం అందించిన విధానం చుసి తాను భాద పడ్డాను అని, ఒక ఎం ఎల్ ఏ గా నిస్సహాయంగా ఉన్నాను అని, గిరిజనులకి సంబంధించిన విషయాలను తాను పైస్థాయి వారికి తీసుకెళదామన్నా ఎవరూ పట్టించుకోవట్లేదని వాపోయారు. 

ఈ వీడియోని షేర్ చేస్తూ, పలువురు యూజర్లు ఇలాంటి శీర్షిక తో షేర్ చేస్తున్నారు, “ఈవిడ ఎవరో తెలుసు కదా ? కురుపాం వైసిపి శాసనసభ్యురాలు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి జగన్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్య ఆంద్రప్రదేశ్ సాధించానని చిడతలు వాయించే విడదల రజని గారి వైద్య ఆరోగ్య శాఖ దుస్థితికి నిదర్శనం,” అని రాసి ఒక ఒక యూజర్ షేర్ చేసారు. మరొక యూజర్, “ఈ ప్రభుత్వం లో ఉండడం సిగ్గు పడుతున్నానని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి చాలా రోజులకి తెలుసుకున్నారు.” ఆర్కైవ్ చేసిన పోస్ట్లు ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

కానీ ఈ పోస్ట్లు తప్పుదోవ పట్టించేటట్టుగా ఉన్నాయి, ఎందుకంటే ఈ వీడియో 2018 నాటిది. 


సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న క్లెయిమ్ (సౌజన్యం: ఎక్స్/ స్క్రీంషాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

వాస్తవం ఏమిటి? 

ఈ వీడియో వైరల్ అవుతుండడం తో మేము ఒక ఫ్రేమ్ తీస్కుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. అది మమ్మల్ని గతంలో 2018 లో హెచ్ఎంటీవీ రాసిన ఒక వార్తా కథనానికి తీసుకెళ్లింది. ఈ కథనం, “కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి” అనే శీర్షికతో సెప్టెంబర్ 5 నాడు, 2018 లో ప్రచురితమయింది. 

ఈ కథనంలో పుష్ప శ్రీవాణి “అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజన విద్యార్ధినులకు అందుతున్న వైద్యాన్ని తలుచుకుంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు,” అని రాసి ఉంది. పైగా, “ఇలాంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు. బాబు గారి 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు,” అని ఉంది. ఇక్కడ బాబు గారు అంటే, అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, మరియు టిడీపీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు. 

హెచ్ఎంటీవీ కథనం (సౌజన్యం: హెచ్ఎంటీవీ లైవ్/ స్క్రీన్ షాట్) 

ఇదే వీడియో ని రెండు యూట్యూబ్ ఛానళ్ళు కుడా సెప్టెంబర్ 5 నాడు, 2018 లో తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాయి. 

ఈ వీడియో బాగా వైరల్ అవుతుండటంతో, శ్రీవాణి  స్వయంగా తన సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో తన గురించి ప్రచారంలో ఉన్న వీడియో పాతది అని, కావాలనే కొందరు టిడీపీ వర్గీయులు తప్పుడు థంబ్ నైల్స్ పెట్టి షేర్ చేస్తున్నారు అని తెలిపారు. గతంలో తీసిన వీడియో గురించి మాట్లాడుతూ, అయిదు సంవత్సరాల క్రితం సాలూరులో గిరిజన బాలికల వైద్యం అందిన విధానం గురించి బాధతో పెట్టాను అని స్పష్టం చేశారు. పైగా, అప్పటి టిడీపీ ప్రభుత్వం గురించి మాట్లాడాను అని కుడా చెప్పారు.

గిరిజన బాలికలకు 2018 లో ఏమైంది? 

14 మంది గిరిజన బాలికలు ఆసుపత్రిలో చేరారు అని సెప్టెంబర్ 5, నాడు 2018 ది హిందూ  కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, విజయనగరంలోని కొత్తవలస ఆశ్రమం పాఠశాల నుంచి 14 మంది విద్యార్థులు డ్రగ్ ఎలర్జీ మరియు అధిక జ్వరంతో సాలూరు ఆసుపత్రిలో చేరారు. ఈ కథనంలో ఒక చిత్రాన్ని కుడా ప్రచురించారు, ఇందులో మనం కొంతమంది గిరిజన బాలికలు నేలపై కూర్చుని, సెలైన్ సీసా ఎక్కించుకోవడం చూడవచ్చు, అయితే ఒకటి రెండు స్టాండ్లకి అనేక సెలైన్ సీసాలను జోడించి బాలికలకు ఎక్కిస్తున్నారు. ఈ చిత్రం అప్పట్లో బాగా వైరల్ అయింది. 

ది హిందూ కథనం (సౌజన్యం: ది హిందూ/ స్క్రీన్ షాట్) 

తీర్పు:

ఈ వీడీయో 2018 నాటిది. వైసిపి శాసనసభ్యులు పుష్ప శ్రీవాణి నాటి టిడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెట్టిన వీడియో. కావున, ఇది తప్పుదోవ పట్టించేటట్టుగా ఉంది అని మేము నిర్ధారించాము.

(అనువాదం: రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.