పాత వీడియో షేర్ చేసి ఇజ్రాయెల్ గాజాలో ఒక మసీదు మీద బాంబు వేసిందని క్లైమ్ చేశారు

ద్వారా: వివేక్ జె
అక్టోబర్ 18 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత వీడియో షేర్ చేసి ఇజ్రాయెల్ గాజాలో ఒక మసీదు మీద బాంబు వేసిందని క్లైమ్ చేశారు

ఇజ్రాయెల్ గాజాలోని ఒక మసీదు మీద బాంబులేస్తుంది అని చెబుతూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది 2014 నాటి వీడియో. ఐఎస్ఐఎస్ సిరియాలో ఒక మసీదు మీద బాంబులేసిన వీడియో ఇది.

క్లైమ్ ఐడి a0bf037c

ఇజ్రాయెల్ హమస్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో ఈ యుద్ధానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అంటూ  చాలా తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. అటువంటి కోవకి చెందిన ఒక వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో షేర్ చేశారు. గాజాలో ఒక మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ఆ మసీదు మీద బాంబులేసిందని, ఇదే ఆ వీడియో అని క్లైమ్ చేశారు. “ఇజ్రాయెల్ ఈ ప్రవర్తనని నేను ఖండిస్తున్నాను. ప్రార్థనలు పూర్తి చేసుకొనివ్వాల్సింది. #Israel #IsraelPalestineWar #Hamasattack#Gaza #Israelatwar.”, అంటూ ఒక ఎత్తిపొడుపు శీర్షికతో ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇదే వీడియోని హిందీ, కన్నడ సహాయ అనేక భారతీయ భాషలలో ఇటువంటి శీర్షికతోనే షేర్ చేశారు. ఈ పోస్ట్స్ ఆర్కైవ్ వెర్షన్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ మసీదు మీద బాంబులేసిందని చెబుతూ క్లైమ్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు. 2014లో సిరియాలో ఒక మసీదు బాంబు దాడికి గురయ్యిన వీడియో ఇది.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే మాకు “పీర్ జోహరే ఆనా ఫోరం” అనే ఒక టర్కిష్ వెబ్సైట్ లో ఒక వార్తా కథనం లభించింది. అందులో ఇదే ఫొటో ఉంది. సిరియాలోని రక్కా లో షియా సమాజానికి చెందిన మసీదు ఫొటో అని, 2014లో ఐఎస్ఐఎస్ ఈ మసీదు మీద బాంబులేసిందని ఈ కథనంలో ఉంది. సిరియాలో ఐఎస్ఐఎస్ షియా మసీదుల మీద దాడుల గురించి వెతికితే అట్లాంటిక్ కౌన్సిల్ అనే సంస్థ వారి నివేదిక ఒక మాకు లభించింది. సిరియాలో ఐఎస్ఐఎస్ సాగించిన విధ్వంసం గురించి అందులో వివరంగా ఉంది.

ఈ నివేదికని ఆధారంగా తీసుకుని సిరియాలో ఐఎస్ఐఎస్ ధ్వంసం చేసిన వివిధ భవంతులు లేదా పరిసరాలు గురించి వెతికితే “రెమి సంగ్ సుబ్ యూన్” అనే యూజర్ యూ ట్యూబ్ లో జూన్ 8, 2014 నాడు అప్లోడ్ చేసిన వీడియో ఒకటి మాకు లభించింది. “ఐఎస్ఐఎస్ యువేస్ అల్ ఖరనీ ప్రార్థన స్థలాన్ని ధ్వంసం చేసింది” అనేది ఈ వీడియో శీర్షిక. వైరల్ వీడియోలో ఉన్న విజువల్సే ఈ వీడియోలో కూడా ఉన్నాయి. సిరియాలో ఐఎస్ఐఎస్ చేసిన విధ్వంసం గురించి బిబిసి కూడా ఒక వార్తా కథనం చేసింది. వాళ్ళు ధ్వంసం చేసిన వాటిల్లో కొన్నిటి శాటిలైట్ ఫొటోలని తన కథనంలో జతపరిచింది. 

వైరల్ వీడియో  2014 నాటి యూ ట్యూబ్ వీడియో మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/యూ ట్యూబ్/స్క్రీన్ షాట్స్)

సిరియాలో ఐఎస్ఐఎస్ వారు ధ్వంసం చేసిన వాటి గురించి లైవ్ మింట్ వార్తా పత్రిక తమ యూ ట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియోలో కూడా వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్ ఉన్నాయి. అలాగే ఐఎస్ఐఎస్ ధ్వంసం చేయకముందు 2014లో మసీదు భవనాన్ని, ధ్వంసం చేసిన తరువాత భవనాన్ని మేము జియోలొకేట్ చేశాము. 

బాంబు దాడికి గురవ్వకముందు, గురయ్యాక మసీదు ఫొటోలు (సౌజన్యం: గూగుల్ ఎర్త్/స్క్రీన్ షాట్)

ఈ మసీదు తాజా శాటిలైట్ ఇమేజ్ చూస్తే ఇక్కడ ఎటువంటి భవనం లేదు. ఇక్కడ ఒక భవనం ఉన్న ఆనవాళ్ళు కూడా లేవు. 

2022లో తీసిన ఈ మసీదు శాటిలైట్ ఫొటో (సౌజన్యం: గూగుల్ ఎర్త్/స్క్రీన్ షాట్)

తీర్పు

ఇజ్రాయెల్ గాజాలోని ఒక మసీదు మీద బాంబులేసింది అంటూ షేర్ చేసిన వీడియో ఈ యుద్ధానికి సంబంధించినది కాదు. సిరియాలోని రక్కాలో ఒక షియా మసీదు మీద 2014 లో ఐఎస్ఐఎస్ బాంబులేసిన వీడియో ఇది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.