మొన్న జరిగిన ఇండియా-పాకిస్థాన్ ఆసియా కప్ మ్యాచ్ లో బిజెపి జెండా రెపరెపలాడలేదు

ద్వారా: మహమ్మద్ సల్మాన్
సెప్టెంబర్ 7 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
మొన్న జరిగిన ఇండియా-పాకిస్థాన్ ఆసియా కప్ మ్యాచ్ లో బిజెపి జెండా రెపరెపలాడలేదు

X, Facebook

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వైరల్ పోస్ట్ లో కనిపించిన ఫొటో ఈ మధ్యది కాదు. భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్ లో జూన్ 2023లో జరిగిన టెస్ట్ మ్యాచ్ అప్పుడు తీసిన ఫొటో ఇది.

క్లైమ్ ఐడి 42cb434e

క్లైమ్ ఏంటి?

భారత్-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలెలో సెప్టెంబర్ 2, 2023 నాడు జరిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన భారతదేశం పాకిస్థాన్ ముందు 267 పరుగుల లక్ష్యం పెట్టింది. అయితే వర్షం కారణంగా రెండవ ఇన్నింగ్స్ ఒక్క బంతి కూడా పడలేదు. దానితో మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్టులకి చెరొక పాయింట్ కేటాయించారు. 

అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫొటో అంటూ ఒక ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది. మైదానంలో ప్రేక్షకులు కొంతమంది బిజెపి జెండా పట్టుకుని ఉన్న ఫొటో అది.  ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూజర్ ఈ ఫొటో షేర్ చేసి, “కాంగ్రెస్ మద్ధతుదారులు జాతీయ జెండా పట్టుకుని మ్యాచ్ చూస్తుంటే బిజెపి మద్ధతుదారులేమో బిజెపి జెండా పట్టుకుని ఉన్నారు. ఇద్దరి మధ్య భావజాల తేడా ఇక్కడే తెలుస్తుంది”, అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 17000 వ్యూస్ ఉన్నాయి. ఇదే ఫొటోని ఇదే క్లైమ్ తో ఫేస్బుక్ లో కూడా షేర్ చేస్తున్నారు. 

ఆన్లైన్ లో చేసిన క్లైమ్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్, ఫేస్బుక్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే మాకు india.com లో జూన్ 28, 2023 నాడు వచ్చిన ఒక కథనం కనిపించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి మ్యాచ్ లో కొంతమంది ప్రేక్షకులు బిజెపి జెండా పట్టుకుని కనిపించారు అని ఈ కథనంలో ఉంది. అయితే ఈ ప్రేక్షకులు ఎవరో తెలుసుకోవటం కుదరలేదు. వైరల్ పోస్ట్,  india.com లో వచ్చిన ఫొటో మధ్య పోలిక కింద ఇస్తున్నాము. 

వైరల్ పోస్ట్ జూన్ 2023లో india.comలో వచ్చిన ఫొటో మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/ india.com/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

పాత్రికేయులు రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఇదే ఫొటోని తన ఎక్స్ అకౌంట్ లో జూన్ 7, 2023 నాడు షేర్ చేశారని కనుగొన్నాము. 

రాజ్దీప్ సర్దేశాయ్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/రాజ్దీప్ సర్దేశాయ్)

భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి టెస్ట్ మ్యాచ్ లండన్ లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుండి 11 మధ్య జరిగింది. ఆస్ట్రేలియా భారతదేశాన్ని 209 రన్నుల తేడాతో ఓడించి ఈ ఛాంపియన్షిప్ గెలుచుకుంది.

అయితే ఈ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరు అనేది మేము తెలుసుకోలేకపోయాము. అలాగే ఇది ఏ రోజు తీసిన ఫొటో అనే విషయం కూడా. అయితే ఈ ఫొటో జూన్ నాటిది కాబట్టి భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్పు మ్యాచ్ కన్నా పూర్వపు ఫొటో అని మనం చెప్పవచ్చు.

తీర్పు

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి మ్యాచ్ లో తీసిన ఫొటోని మొన్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అప్పటి ఫొటో అని చెప్పి షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.    

అనువాదం- గుత్తా రోహిత్

 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.