వీడియోలో ప్రధాని నరేంద్ర మోది మాట్లాడుతున్నది క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తో కాదు

ద్వారా: రాజేశ్వరి పరస
సెప్టెంబర్ 22 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వీడియోలో ప్రధాని నరేంద్ర మోది మాట్లాడుతున్నది క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తో కాదు

వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ శాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ప్రధాని ఇస్రో చీఫ్ తో ఫోన్ లో మాట్లాడిన వీడియోని, ఆసియా కప్పు విజయం తరువాత మహమ్మద్ సిరాజ్తో మాట్లాడినట్టుగా ప్రచారం జరిగింది.

క్లైమ్ ఐడి 4a448a61

ఈ మధ్య జరిగిన పురుషుల-ఆసియా కప్పు 2023లో ఇండియా శ్రీ లంక పైన విజయ పతాకం ఎగురవేసింది. ఈ ఆటలో బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఏడు ఓవర్ లలో ఆరు విక్కెట్స్ తీసి ఇండియాను విజయం వైపు తీసుకెళ్ళాడు. ఒక్క ఓవర్ లోనే నాలు వికెట్ లో తీసిన భారత దేశ మొట్ట మొదటి ఆటగాడి గా నిలిచాడు.

క్లెయిమ్ ఏమిటి ?

ఆసియా కుప్పు విజయం తరువాత సామాజిక మాధ్యమాలలో భారత దేశాన్ని మరియు సిరాజ్ ఆటని ప్రసంసిస్తూ చాలా మంది యూసర్లు పోస్ట్ లు పెట్టారు. ఈ సంధర్బంలోనే ప్రధాని మోది సిరాజ్ కి ఫోన్ చేసి మాట్లాడారు అంటూ ఒక వీడియో ఆన్లైన్ లో వైరల్ అయ్యింది. ఒక యూసర్ X లో (ఇంతకుమునుపు ట్విటర్) హిందిలో రాసి ఇలా పోస్ట్ చేశారు. “ ప్రధాని నరేంద్ర మోది సిరాజ్’కుటుంబానికి మరియు మొత్తం జట్టుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.” ఈ కథనం రాసే సమయానికి ఈ పోస్ట్ను 31,000 వేల మంది చూడటం జరిగింది.


వైరల్ అవుతున్న పోస్ట్ ఫోటో (సౌజన్యం: X/స్క్రీన్ శాట్/ లాజికల్లీ ఫాక్ట్స్ ఎడిటింగ్)

అయినప్పటికీ ఇది అబద్దం. 

వాస్తవం ఏమిటి? 

ఎన్ డి టి వి మరియు ఇండియా టుడే లాంటి మరెన్నో వార్తా సంస్థలు ఇప్పుడు ప్రచారంలో ఉన్న వీడియోని, భారత దేశం చంద్రుడు మీదకి చంద్రయాన్ 3 పంపినపుడు షేర్ చేశారు. ఆ విజయానికి అభినందిస్తూ ప్రధాని, ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ని మరియు వారి బృందాన్ని ప్రశంసహించడానికి ఫోన్ చేశారు అని ఆ వీడియో శీర్షికగా రాసి ఉంది.  

ప్రధాన మంత్రి వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో కూడా ఈ వీడియొ ని ఆగస్టు 23న, “చంద్రయాన్ 3 విజయవంతమయిన సంధర్బంగా, ప్రధాని నరేంద్ర మొది ఇస్రో చీఫ్ సోమనాథ్ ని ఫోన్ చేసి అభినందనలు తెలిపారు” అనే శీర్షిక తో అప్లోడు చేశారు.


ప్రధాని నరేంద్ర మోది ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తో ఫోన్ లో మాట్లాడుతున్న వీడియో స్క్రీన్ శాట్. (సౌజన్యం: యూట్యూబ్/పి ఏం వో ఇండియా/స్క్రీన్ శాట్)

మోది X అకౌంటుని కూడా మేము పరిశీలించాము, అక్కడ మాకు సెప్టెంబర్ 27 న భారత దేశ క్రికెట్ జట్టుని అభినందిస్తూ చేసిన ఒక పోస్ట్ కనిపించింది. ఆ పోస్ట్ మొత్తం జట్టుని ఉద్దేశించి చేసినది, ఒక్క ఆటగాడిని మాత్రమే కాదు. 

తీర్పు: 

ప్రధాని నరేంద్ర మోది ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కి అబినందనలు చెబుతున్న వీడియో, ఆసియా కప్పు తరువాత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తో ప్రధాని మాట్లాడుతున్న వీడియో గా ప్రచారం జరిగింది. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము. 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.