నలేది మషీషీ

సీనియర్ ఫ్యాక్ట్ చెకర్, యూ. కే

నలేది మషీషీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్లోబల్ హెల్త్ పాలసీ నుండి మాస్టర్స్ పూర్తి చేశాక ఫిబ్రవరి 2024లో లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరారు. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ కి చెందిన నలేది ఆఫ్రికా చెక్ అనే సంస్థలో పరిశోధకురాలిగా రెండు సంవత్సరాలు, థామ్సన్ రాయిటర్స్ లో ఇంటర్న్ గా ఒక సంవత్సరం పని చేశారు. తనకి విట్వాటర్స్రాండ్ విశ్వవిద్యాలయం నుండి, రోడ్స్ విశ్వవిద్యాలయం నుండి చెరొక జర్నలిజం డిగ్రీ ఉంది. తన ఖాళీ సమయంలో చదవటం, ఫిక్షన్ రాయడం అంటే ఆసక్తి. ఇన్విజిబిల్ స్ట్రింగ్స్ అనే పేరుతో తన మొదటి నవలని 2021లో ప్రచురించారు. అనేక సాహిత్య జర్నల్స్ లో కథలని కూడా ప్రచురించారు. ఇప్పుడు తన రెండవ నవల రాస్తున్నారు.

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.