జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడు అని చంద్రబాబు నాయుడు అంటున్నట్టున్న వీడియో ఎడిటెడ్ వీడియో

ద్వారా: సోహం శా
మే 14 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడు అని చంద్రబాబు నాయుడు అంటున్నట్టున్న వీడియో ఎడిటెడ్ వీడియో

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని చంద్రబాబు నాయుడు అన్నాడని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఒరిజినల్ క్లిప్ లో చంద్రబాబుని అడిగిన ప్రశ్న- తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా అని. అంతే కానీ జగన్ మోహన్ రెడ్డి వస్తాడా అని కాదు.

క్లైమ్ ఐడి 09d8c73e

క్లైమ్ ఏంటి?

తెలుగుదేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని చెబుతునట్టున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. రాష్ట్రంలో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13 నాడు జరిగాయి.

ఈ వైరల్ వీడియోలో, ఒక పాత్రికేయుడు చంద్రబాబుని జగన్ మళ్ళీ గెలుస్తాడా అని అడుగుతున్నట్టు ఉంది. దానికి జవాబుగా, బాబు, “వంద శాతం” అని జవాబు ఇవ్వటం మనం చూడవచ్చు. ఈ వీడియోని షేర్ చేస్తూ, “వంద శాతం జగన్ అధికారంలోకి వస్తాడు 🔥✊- చంద్రబాబు” అనే శీర్షిక పెట్టారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ వైరల్ క్లిప్ లో వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ తో సహా వివిధ వార్తా ఛానళ్ల మైక్రో ఫోన్స్ కనిపించాయి. దీని ఆధారంగా మే 13 నాడు మరింత నిడివి ఉన్న ఇదే వీడియోని ఏఎన్ఐ తమ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్  (ఆర్కైవ్ ఇక్కడ) చేసింది. ఈ వీడియో పోస్ట్ శీర్షికలో, “ఓటు వేయటం మన బాధ్యత, బంగారు భవిష్యత్తు డిమాండ్ చేయడం మన హక్కు. వంద శాతం తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది” అని బాబు అన్నారని రాసుంది. గుంటూరులో చంద్రబాబు ఓటు వేశాక తీసిన వీడియో ఇది.

ఈ వీడియో చివర్లో ఒక పాత్రికేయుడు “సర్, ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుందా?” అని అడగటం మనం వినవచ్చు. దీనికి జవాబుగా, బాబు,”వంద శాతం” అని జవాబివ్వడం మనం చూడవచ్చు. ఇక్కడ అడిగినది తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా అనే కానీ, జగన్ మోహన్ రెడ్డి వస్తాడా అని కాదు. 

అలాగే వైరల్ క్లిప్ లో పాత్రికేయుని ప్రశ్న ఆడియో కూడా అసంబద్ధంగా ఉంది. ఈ వీడియోని రోడ్ మీద, జనాల మధ్యలో తీశారు. అంటే ఆ రోడ్ మీద శబ్ధం ఎంతో కొంత ఈ వీడియో క్లిప్ లో వినపడాలి. అయితే, పాత్రికేయుడు, “సర్, సర్, సర్, జగన్ మళ్ళీ గెలుస్తాడా?” అని అడిగినప్పుడు ఎటువంటి ఇతర శబ్ధం మనకి వినపడదు. బాబు జవాబు ఇవ్వటం మొదలుపెట్టగానే మళ్ళీ మనకి వేరే శబ్ధాలు వినిపిస్తాయి. వీడియోలోకి ఈ ఆడియో క్లిప్ ని జొప్పించారు అనే దానికి ఇదొక సంకేతం.

దీనిబట్టి ఆ పాత్రికేయుడు అడిగిన ప్రశ్న తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తున్నదా అని మనకి స్పష్టం అవుతున్నది.

తీర్పు

పాత్రికేయుని ప్రశ్నని మార్చేసే విధంగా వీడియోని ఎడిట్ చేశారు కాబట్టి, ఇది ఫేక్ అని మేము నిర్ధారించాము. వాస్తవంగా, బాబుని అడిగిన ప్రశ్న- తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందా అని. దానికి బాబు “వంద శాతం” అని జవాబు ఇచ్చారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.