హమస్ గాజాలోని చర్చిని ధ్వంసం చేస్తున్న వీడియో కాదిది

ద్వారా: జాన్ ఫార్సేథ్
అక్టోబర్ 26 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
హమస్ గాజాలోని చర్చిని ధ్వంసం చేస్తున్న వీడియో కాదిది

ఆన్లైన్ లో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ అవుతున్న వీడియో 2017 లో ఫిలిప్పీన్స్ లోని చర్చిని ధ్వంసం చేస్తున్న వీడియో. గాజాకి గాని, ఇజ్రాయెల్- హమాస్ యుద్దానికి కానీ సంబంధం లేదు.

క్లైమ్ ఐడి 0f94bae4

నేపధ్యం

ఎక్స్ (పూర్వపు ట్విటర్) లో షేర్ చేసిన ఒక వీడియోలో కొంత మంది వ్యక్తులు ఒక శిలువను పడగొడుతూ, ఏసు విగ్రహంలా కనిపించే ఒక విగ్రహాన్ని తంతూ కనిపిస్తున్నారు. ఈ వీడియో కి శీర్షికగా,”హమాస్ ఉగ్రవాదులు గాజాలోని బాప్టిస్ట్ చర్చిని ధ్వంసం చేస్తూ ఏసు విగ్రహాన్ని తంతున్నారు”, అని రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ, “ఇది తమ భూమిని పొందడానికి వారు చేస్తున్న యుద్దమా లేక వేరే మతాలకు వ్యతిరేకంగా జిహాదీలు చేసే యుద్దామా ? మీరే ఆలోచించుకోండి,” అని రాసుకొచ్చారు.

ఈ వీడియోని మరో 200 మంది యూజర్లు కూడా షేర్ చేశారు. వీరిలో ఒకరు సిఎన్ఎన్ న్యూస్ నెట్వర్క్ లోగోతో ఉన్న ఇదే వీడియోని షేర్ చేశారు.

గాజా జనాభా 2.2 మిలియన్ జనాభా కాగా, అందులో దాదాపు 1,100 మంది పాలస్తీనా క్రైస్తవులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది గ్రీక్ ఆర్థోడాక్స్ కాగా, బాప్టిస్ట్ మరియు కాథలిక్ మైనారిటీ వారు కూడా ఉన్నారు. 

వాస్తవం ఏమిటి?

వీడియోలోని స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, ఈ వీడియోని ది డెయిలీ మెయిల్ అనే బ్రిటిష్ వార్తా పత్రికలో జూన్ 2017లో ప్రచురితం అయినట్టు తెలుస్తుంది. ఈ కథనం ప్రకారం, మొదటిగా ఆ వీడియోని ఇస్లామిక్ స్టేట్ (ఐ ఎస్ ఐ ఎస్ ) కు సంబంధిత న్యూస్ ఏజెన్సీ అయిన అమాక్ ప్రచురించింది. ఆ వీడియోని ఫిలిప్పైన్స్ లో మారావి అనే పట్టణంలో చిత్రీకరించారు.  వీడియోలో కనిపించే వ్యక్తులే వర్జిన్ మేరీ విగ్రహాన్ని, పోప్ ఫ్రాన్సిస్ ఫొటోని, మరియు ఇతర మత పరమయిన వాటిని కూడా ధ్వంసం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. 

మారావి అనేది మిన్డానావ్ ద్వీపంలో ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ తరుచూ ఫిలిప్పైన్ ప్రభుత్వానికి మరియు ఇస్లామిస్ట్సి ద్ధాంతాలను పాటించే రెబెల్ బృందాల మధ్య మద్య గొడవలు జరుగుతున్నాయి . ఇక్కడ చాలా మంది ఫిలిప్పినోలు రోమన్ కాథలిక్లు. ముస్లిం మైనారిటీ 5 శాతం ఉంటుంది, వీళ్ళు చాలా వరకు మిన్డానావ్ లో ఉంటారు. 

ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థలు మిన్డానావ్ లో 2014-15 లో తమ ఉనికి ఏర్పాటు చేసుకున్నాయి. అసంతృప్తితో ఉన్న మాజీ గెరిల్లాలని, బక్కచిక్కిన రైతులని, విసిగి వేసారిపోయిన యువతని తమ వైపుకి తిప్పుకున్నారు. అలాగే విదేశీ మిలిటెంట్లని కూడా.

ఐఎస్ఐఎస్ అనుబంధ మౌటే గ్రూప్ కూడా మారావిలోని కొన్ని ప్రాంతాలను మే 2017లో తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అయిదు నెలల యుద్ధం తరువాత  ఫిలిప్పైన్ సైన్యం అక్టోబర్ లో వెనక్కి తీసుకోవటం జరిగింది. ఈ మౌటే గ్రూప్ మారావిలోని సెయింట్ మేరీ కథెడ్రల్ మీద మే 23, 2017 నాడు దాడి చేసింది. అక్కడ మతపరమయిన కళాఖండాలను ధ్వంసం చేసి నిప్పు అంటించి, అక్కడి చర్చికి వెళ్ళిన భక్తులను మత గురువుతో సహా అందరినీ బందీగా తీసుకున్నారు. ఆ వీడియోని రికార్డు చేసి ఈ విషయాన్ని ప్రచారం చేయడానియకి ఉపయోగించారు. తీవ్రంగా ధ్వంసం అవ్వడంతో తరువాత ఆ చర్చిని కూల్చివేశారు. 

గాజాలో ఉండే క్రైస్తవులు కూడా మిగితా పాలస్తీనా జనాభా లాగానేఆంక్షల మధ్య జీవిస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో క్రైస్తవులు మరియు ముస్లింలు ఇద్దరూ చర్చిలో తలదాచుకున్నారు.

తీర్పు

ఫిలిప్పైన్స్ లోని మారావిలోని సెయింట్ మేరీ కథెడ్రల్ చర్చి మీద ఐఎస్ఐఎస్ 2017 లో దాడి చేసిన వీడియో ఇది. దీనికి ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి సంబంధం లేదు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్దారించాము.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.