ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన పాత వీడియో చూపించి రాజస్థాన్ కి బుల్ డోజర్లు వెళ్తున్నాయని ప్రచారం చేసారు

ద్వారా: చందన్ బొర్గోహాయ్
డిసెంబర్ 15 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన పాత వీడియో చూపించి రాజస్థాన్ కి బుల్ డోజర్లు వెళ్తున్నాయని ప్రచారం చేసారు

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ అవుతున్న వీడియో 2021 లోనిది, ఆంధ్ర ప్రదేశ్ లో ఒక గూడ్స్ ట్రైన్ కి సంబంధించినది. రాజస్థాన్ ఎన్నికలకి దీనికి సంభందం లేదు.

క్లైమ్ ఐడి 213e9435

క్లెయిమ్ ఏమిటి?

ఇటీవల కాలంలో భారత దేశం లోని అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తరుణంలో, సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది.ఇందులో, రాజస్థాన్ లో బిజెపి పార్టీ 119 స్థానాలలో 115 గెలుపొంది అత్యధిక మెజారిటీ  గెలిచినందున, ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజస్థాన్ కు బుల్ డోజర్ల పంపుతున్నారు అని ఉంది.

ఈ వీడియోని ఫేస్బుక్ లో ఒక యూజర్ షేర్ చేస్తూ, రాజస్థాన్ లో గత ఐదేండ్ల లో కాంగ్రెస్ పార్టీ వల్ల పేరుకున్న ‘చెత్త’ ను తొలగించడానికి ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఒక ట్రైన్ బుల్ డోజర్లను తీసుకెళ్తుంది అని రాసుకొచ్చారు. ఆ పోస్ట ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.

మరొక వ్యక్తి కుడా ఇలాంటి క్లెయిమ్ తోనే అస్సామీస్ భాష లో కూడా షేర్ చేసారు (ఆర్కైవ్ ఇక్కడ). “యోగి బాబా 50 బుల్ డోజర్స్ రాజస్థాన్ కు వెళ్తున్నాయి” యోగి బాబా అనేది ఇక్కడ బిజెపి నాయకుడు మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి అంటున్నది. 

అస్సామీస్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

కానీ ఇది ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించిన పాత వీడియో

ఇక్కడ బుల్ డోజర్ల ప్రాముఖ్యత

ఈ బుల్ డోజర్లు అనేది యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ లో అధికారం లోకి వచ్చాక వాడకం లోకి వచ్చింది. అవుట్ లుక్ మ్యాగజిన్ కథనం ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ 2022 ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ బుల్ డోజర్ ఎత్తుగడలు వాడడం జరిగింది. 

ఈ మధ్య కలంలో ఈ బుల్ డోజర్లు అనేవి ఒక రాజకీయ అస్త్రం లాగా మారాయి. ప్రత్యేకంగా బిజెపి పాలించే రాష్ట్రాలలో ఎవరైనా అధికారానికి వ్యతిరేకంగా వెళ్తే, వారి పై చర్యలు తీసుకోడానికి వాడే విధంగా చూస్తున్నారు. యోగి ప్రభుత్వం కుడా ‘ఇల్లీగల్’ గా కట్టిన కట్టడాలను, మరియు కొంత మంది ‘నిందితులను’ వారి ఇంటిని బుల్ డోజర్లు వాడి కూల్చి వేసి శిక్షించారు. ఇలాంటి చర్యలే, బిజెపి పాలిత రాష్ట్రాలు అయినా హర్యానా మరియు మధ్య ప్రదేశ్ లో కుడా చూడవచ్చు. టైం మ్యాగజిన్ లో వచ్చిన కథనం ప్రకారం, హిందూ జాతీయవాదాన్ని ప్రతిపాదించే పార్టీ అయినా బిజెపి, న్యాయవిరుద్దంగా ఈ బుల్ డోజర్లను ఒక అస్త్రంగా వాడి వేలాది మంది ముస్లింల ఇళ్లను, వ్యాపారాలను, మసీదులని గతం లో ద్వాంసం చేసింది. 

ఈ వీడియో ఎక్కడిది?

ఈ వీడియో లోని ఒక ఫ్రేమ్ ని రివర్స్ ఇమేజ్ ద్వారా వెతకగా, ‘గోపి రైల్ వరల్డ్’ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో నవంబర్ 26నాడు, 2021 లో అప్లోడ్ చేసిన మరింత నిడివి గల వీడియో దొరికింది. 

ఈ వీడియోకి శీర్షికగా, “రెండు రైళ్ళు ఒక గూడ్స్ రైలు బండి ని అధిగమిస్తున్నాయి | రైళ్లపై జేసీబీ | WAP-7 అద్భుతమైన వేగవృద్ది | వీడియో లో ఒక ఒక గూడ్స్ బండి ప్లాట్ఫారం దాటుతున్నట్టు కనిపిస్తుంది, ఆ తరువాత మనకి వైరల్ వీడియో లో కనిపించే విధంగా కనిపిస్తుంది. షుమారుగా 03:37 నిడివి లో, వీడియో లో మనము, “WAG-9H 31395 BHILAI with JCB's on BOMN Train,” చూడవచ్చు, వైరల్ అవుతున్న క్లిప్ లో కుడా ఇదే రాసి ఉంటుంది. 

యూట్యూబ్ లో ఉన్న వీడియోకి మరియు వైరల్ అవుతున్న వీడియోకి పోలిక (సౌజయానం : ఫేస్బుక్ / యూట్యూబ్/ స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

యూట్యూబ్ వీడియో లో ఇచ్చిన వివరణ ప్రకారం, ఈ వీడియోని ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలి రైల్వే స్టేషన్ లో తియ్యటం జరిగింది.

మేము ఈ వీడియోలో తెలిపిన తెనాలిని కుడా గూగుల్ మ్యాప్స్ ద్వారా జియో లొకేట్ చేయగలిగాము. వీడియోలో 5:34 నిడివి దగ్గర, ఒక తెలుపు మరియు గులాబీ రంగులో ఉన్న భవంతి పై, ‘జీసస్ హీల్స్’ అని గ్రాఫిటీ లో రాసి ఉంది, ఇదే మనకి స్ట్రీట్ వ్యూ లో గూగుల్ లో కూడ కనబడుతుంది.

యూట్యూబ్ వీడియోలో క్లిప్ కిమరియు గూగుల్ స్ట్రీట్ వ్యూ లో ఉన్న ఫోటో కి మధ్య పోలిక(సౌజన్యం: యూట్యూబ్/గూగుల్ మ్యాప్స్/ స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

దీని ఆధారంగా ఇది ఆంధ్ర ప్రదేశ్ లో ఒక గూడ్స్ బండికి సంబంధించిందే అని రాజస్థాన్ కు వెళ్తున్న బుల్ డోజర్లు కావని నిర్ధారించవచ్చు. మేము ఈ వీడియోలో బండి ఎక్కడికి వెళ్తుంది అనే దానిని నిర్ధారించలేకపోయిన, ఇది రెండు సంవత్సరాల నుండి సామాజిక మాధ్యమాలలో ఉంది అని మాత్రం చెప్పవచ్చు. మరియు ఇది ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించింది, అక్కడ అధికారంలో ఉన్నది, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజెపి కాదు. 

తీర్పు :


2021 నాటి ఆంధ్ర ప్రదేశ్ కి సంభందించిన పాత వీడియో ఇది. ఇది తప్పుగా రాజస్థాన్ ఎన్నికల ఫలితాలకు లంకె చేయబడింది. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.