కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కూర్చోవటానికి సోనియా గాంధీ అనుమతి కోసం వేచిచూడటం లేదు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కూర్చోవటానికి సోనియా గాంధీ అనుమతి కోసం వేచిచూడటం లేదు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

సోనియా గాంధీ కి నమస్కారం తెలపటం కోసం నుంచుని అటునుండి అటే మాట్లాడటానికి పోడియంకి వెళ్లారు అని మనకి మొత్తం వీడియో తెలియచేస్తున్నది.

క్లైమ్ ఐడి 35148549

నేపధ్యం

దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు మే 10, 2023 నాడు జరిగాయి. రాజకీయ పార్టీలని లక్ష్యం చేసుకుని సామజిక మాధ్యమలలో అనేక అబద్ధపు వీడియోలు చక్కర్లు కొట్టాయి. 

అటువంటి అబద్ధపు వీడియోలలో ఇది ఒకటి. ఎన్నికలప్పుడు జరిగిన ఒక ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తన కుర్చీలో కూర్చోవడానికి సోనియా గాంధీ అనుమతి కోసం వేచి చూస్తున్నారు అని చెబుతూ భారతీయ జనతా పార్టీ (BJP) ఐటి సెల్ అధ్యక్షులు అమిత్ మాల్వీయా ఒక వీడియో ట్వీట్ చేశారు. సోనియా గాంధీకి నమస్కారం తెలిపాక మల్లిఖార్జున ఖర్గే నుంచుని ఉండటం మనకి ఆ వీడియోలో కనిపిస్తుంది. 

ఇదే క్లిప్ ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదరుడు కాంచన్ గుప్తా కూడా ట్వీట్ చేశారు. “కూర్చోవాలా? కూర్చోకూడదా? సోనియా గాంధీ తనని కూర్చోమని చెప్పటం మరిచిపోయిందా లేక కూర్చోవచ్చు అని చెప్పకుండా తనని నిర్లక్ష్యం చేసిందా అని తెలియక మథనపడుతూ చేతులు నలుపుకుతున్న నిస్సహాయుడైన మిస్టర్ ఖర్గే” అంటూ కాంచన్ గుప్తా వ్యాఖ్యానించారు. అయితే మొత్తం వీడియోలో ఒక భాగాన్ని కట్ చేసి, దానిని ఇటువంటి అబద్ధపు వ్యాఖ్యలు జోడించి షేర్ చేశారు.

వాస్తవం

ఈ వైరల్ వీడియో స్క్రీన్ షాట్స్ తీసుకుని రివర్స్ ఇమేజ్ సర్చ్ ఇంజన్ లో వెతికితే ఈ సభ పూర్తి వీడియో కాంగ్రెస్ పార్టీ అధికార యూట్యూబ్ ఛానల్ లో దొరికింది. ఈ మొత్తం వీడియోని వాళ్ళు మే 6, 2023 నాడు అప్లోడ్ చేశారు. ఇదే మొత్తం వీడియోని నవభారత్ టైమ్స్ వాళ్ళు తమ యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేశారు. కర్ణాటకలోని హుబ్బళిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచార ర్యాలీ, సభకి చెందిన వీడియో ఇది. వీడియోలో 22:19 దగ్గర సోనియా గాంధీ తన ఉపన్యాసం ముగించుకుని తన కుర్చీ వైపు వెళ్ళటం మనం చూడవచ్చు. 

ఆవిడ వచ్చి తన కుర్చీలో కూర్చుంది. ఆ సమయంలో మల్లిఖార్జున ఖర్గే నిలబడి ఉండటం మనం చూడవచ్చు. అదే సమయంలో సభ నిర్వహకులు ప్రజలని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మల్లిఖార్జున ఖర్గేని కోరగా ఆయన పోడియం వైపు నడుచుకుంటూ వెళ్ళటం మనం చూడవచ్చు. ఇది ఈ వీడియోలో 22:54 దగ్గర చూడవచ్చు. 

దీనిబట్టి మనకి స్పష్టంగా తెలిసేది ఏమిటంటే తాను కూర్చోవటానికి సోనియా గాంధీ అనుమతి కోసమేమి మల్లిఖార్జున ఖర్గే వేచి చూడటం లేదని, సోనియా గాంధీ తరువాత వక్త తానే అవ్వడంతో ఆవిడకి నమస్కారం తెలిపి, అటు నుండి అటే మాట్లాడటానికి వెళ్లారు అని.  ఆయన ప్రజలని ఉద్దేశించి ప్రసంగించటానికి వెళుతున్నప్పుడు సోనియా గాంధీ కూడా తన కుర్చీలో నుండి లేచి నిలబడ్డారు. 

తీర్పు

కాంగ్రెస్ ప్రచార సభకి చెందిన ఒక వీడియో నుండి ఒక భాగం కట్ చేసి తను కూర్చోవటానికి సోనియా గాంధీ అనుమతి కోసం మల్లిఖార్జున ఖర్గే వేచి చూస్తున్నారు అనే అబద్ధపు వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమలలో ప్రచారం చేశారు. కాబట్టి ఈ వార్త తప్పుదోవ పట్టించేటట్టు ఉంది అని మేము నిర్ధారించాము.  

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.