తెలంగాణలో ఒక వ్యక్తి మీద దాడి చేసిన వీడియోని ఆంధ్ర ప్రదేశ్ లో జరిగినట్టుగా షేర్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
అక్టోబర్ 13 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తెలంగాణలో ఒక వ్యక్తి మీద దాడి చేసిన వీడియోని ఆంధ్ర ప్రదేశ్ లో జరిగినట్టుగా షేర్ చేశారు

సామాజిక మాధ్యమాలలో వస్తున్న క్లైమ్స్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ అవుతున్న ఘటన తెలంగాణ లో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధం లేదు.

క్లైమ్ ఐడి 429f90ad

పాఠకులకి గమనిక: ఇందులో హింసకు సంబంధించిన వర్ణన ఉంది 

క్లెయిమ్ ఏమిటి?

అక్టోబర్ 11, 2023న ఎక్స్ (పూర్వపు ట్విటర్ )లో ఒక యూజర్ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో కొంతమంది వ్యక్తులు ఇంకో మనిషిని దారుణంగా కొడుతున్నట్టు ఉంది. ఆ వ్యక్తి చేతులు జోడించి వేడుకుంటున్నా కూడా వదలకుండా కొట్టడం మనం చూడవచ్చు. ఈ వీడియోని పాఠకులు గమనికతో షేర్ చేస్తూ, “ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పాలక పార్టీ శాసనసభ్యులు ఒకరు ఈ విధంగా ఒక అమాయక వ్యక్తిని కొడుతున్నారు. ఏం పార్టీ రా బాబు మీది”, అని రాసుకొచ్చారు. ఆ ట్వీట్ ఆర్కైవ్ లింకు ఇక్కడ చూడవచ్చు.  


సామాజిక మాధ్యమాలలో వస్తున్న క్లైమ్స్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతుకగా, ఈ వీడియో మాకు అక్టోబర్ 10, 2023న ఎక్స్ లో హేమ అనే యూజర్ షేర్ చేశారు అని తెలిసింది. హేమ ఎక్స్ బయోలో ఏ బి ఎన్ తెలుగు ఛానల్ పాత్రికేయురాలు అని ఉంది. ఆవిడ ఈ వీడియోని షేర్ చేస్తూ ఇలా రాశారు, “జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు, ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్,ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో, ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉంది.”

హేమ పోస్ట్ చేసిన పోస్ట్ ని జోడించి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ఫాక్ట్ చెక్ విభాగం వారు కూడా వారి ఎక్స్ అకౌంటులో ఇది తెలంగాణలో జరిగిన ఘటన అని స్పష్టం చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్ ఫాక్ట్ చెక్ విభాగం వారు ప్రచురించిన పోస్ట్ (సౌజన్యం: ఎక్స్/ స్క్రీన్ షాట్)

దీని ఆధారంగా తెలంగాణ లో ఆటవంటి దాడి ఏమైనా జూబ్లీ హిల్స్ లో జరిగిందా అని మేము కీ -వర్డ్ సెర్చ్ చేసి వెతుకగా మాకు కొన్ని వార్తా కథనాలు లభించాయి. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన కథనం ప్రకారం, అక్టోబర్ 12, 2023 అర్ధరాత్రి అమ్మాయితో మాట్లాడిన కారణంగా ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టారని, ఇద్దరిని అరెస్ట్ చేశారని ఒక కథనం ప్రచురిచారు. ఆ కథనం ప్రకారం, అందులో గాయపడిన వ్యక్తిని చందుగా గుర్తించారు. అతడు ఒక అమ్మాయితో ఆదివారం నాడు అర్దరాత్రి 2 గంటల ప్రాంతంలో మాట్లాడుతుంటే అది లలిత్ అనే వ్యక్తి ప్రశ్నించటంతో గొడవ మొదలయ్యింది. ఆ తరువాత మాట మాట పెరిగి లలిత్ , అతడి స్నేహితుడు భాస్కర్ మరియు ఇంకొందరు కలిసి చందు ని తీవ్రంగా గాయపరిచారు. 

కథనం ప్రకారం, ప్రస్తుతం పోలీసులు లలిత్  మరియు భాస్కర్ లను అదుపులోకి తీసుకున్నారు, భాస్కర్ ఏం ఎల్ ఏ మాగంటి గోపీనాథ్ కి పర్సనల్ అసిస్టెంట్ కాదు అని కేవలం అనుచరుడు మాత్రమే అని పోలీసులు తెలిపారు. 

ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా లో అక్టోబర్ 12న ప్రచురించిన మరో కథనంలో వైరల్ వీడియోకి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా ఉంది.  ఈ కథనం ప్రకారం, బాధ్యుడు చందు హైదరాబాద్ లో వైద్యం చేయించుకుని తన స్వంత గ్రామానికి వెళ్ళిపోయాడు అని పోలీసులు తెలిపారు. 


టైమ్స్ ఆఫ్ ఇండియాలో వైరల్ వీడియో కి సంబంధించిన స్క్రీన్ షాట్ (సౌజన్యం: టైమ్స్ ఆఫ్ ఇండియా/స్క్రీన్ షాట్)

ఈ విషయం గురించి తెలుసుకోవటానికి, లాజికల్లీ ఫ్యాక్ట్స్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి రవీంద్ర ప్రసాద్ ని కూడా సంప్రదించింది. ఆయన మాతో మాట్లాడుతూ, ఈ ఘటన అక్టోబర్ 7నాడు అర్దరాత్రి యూసఫ్ గూడ లోని లక్ష్మీ నరసింహ నగర్ లో చోటుచేసుకుంది అని తెలిపారు. “భారతీయ శిక్షాస్మృతి ప్రకారం 307 సెక్షన్ (హత్యా ప్రయత్నం) కింద మేము ఇద్దరు వ్యక్తులని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించాము. గాయపడిన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతున్నది”, అని తెలిపారు. పోలీసులు కూడా అరెస్ట్ అయిన వారిలో ఒకరు జూబ్లీ హిల్స్ శాసనసభ్యుని పిఏ అనే అంశాన్ని నిరాకరించారు. 

పైగా లాజికల్లీ ఫ్యాక్ట్స్, గూగుల్ మ్యాప్స్ ద్వారా, ఘటన జరిగిన ప్రదేశాన్నిహైదరాబాద్ లోని యూసఫ్ గూడ కి జియో లొకేట్ చేయగలిగింది. వైరల్ వీడియోని మరియు మ్యాప్స్ లో కనపడిన ప్రదేశాన్ని పోల్చి చూస్తే కొన్ని పోలికలు కనిపించాయి. 


వైరల్ వీడియోకి మరియు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కి పోలిక (సౌజన్యం: ఎక్స్/ గూగుల్ మ్యాప్స్/స్క్రీన్షాట్)

తీర్పు: 

తెలంగాణలో జరిగిన ఒక దాడికి సంబంధించిన వీడియోని ఆంధ్రలో జరిగినట్టుగా షేర్ చేశారు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.