అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగిన కలశ యాత్ర వీడియో అని పాత వీడియో షేర్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
జనవరి 8 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగిన కలశ యాత్ర వీడియో అని పాత వీడియో షేర్ చేశారు

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగిన కలశ యాత్ర వీడియో అని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ ఫొటోలు జూలై, 2023లో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమానికి చెందినవి.

క్లైమ్ ఐడి 568d77cb

క్లైమ్ ఏంటి?

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని జనవరి 22, 2024 నాడు ప్రారంభించనున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అయోధ్యలో రామాలయం ప్రారంభానికి ముందు జరిగిన కలశ పూజ ర్యాలీ అని క్లైమ్ చేశారు.

ఈ 2:36 సెకన్ల వీడియోలో జనం కాషాయ దుస్తులు ధరించి, రామ నామం జపిస్తూ, కొంత మంది మహిళలు నెత్తి మీద కలశ కుండ మోయటం మనం చూడవచ్చు. ఈ వీడియోని ఫేస్బుక్ లో ఈ తెలుగు శీర్షికతో షేర్ చేశారు- రామాలయం విమానం కలశ పూజ కోసం జన సునామి. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

ఆన్లైన్ లో క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉంది. ఈ వీడియో నోయిడా ప్రాంతానికి చెందిన పాత వీడియో.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా జూలై 2023లో ఇదే వీడియోని “భాగేశ్వర్ ధాం సర్కార్ కలశ యాత్ర” అనే శీర్షికతో ఎక్స్ లో షేర్ చేశారని తెలుసుకున్నాము.

ఈటీవీ భారత్ దిల్లీ జూలై 9, 2023 నాడు ఒక వార్తా కథనం ప్రచురించింది. ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో భాగేశ్వర్ ధాం సర్కార్ జూలై 10-16, 2023 మధ్యలో నిర్వహించబోయే ‘భగవత కథ’కి సూచికగా జూలై 9, 2023 నాడు ‘కలశ యాత్ర’ నిర్వహించడం జరిగిందని ఈ కథనంలో పేర్కొన్నారు. జూలై 9 నాడు భక్తులు ఈ కలశ యాత్రలో పాల్గొన్నారని, మహిళా భక్తులు నెత్తిన కలశ కుండలు మోశారని ఈ కథనంలో పేర్కొన్నారు. వైరల్ వీడియోలో ఉన్న ఫొటోలనే ఈ కథనంలో కూడా మనం చూడవచ్చు.

మరింత శోధిస్తే మధ్య ప్రదేశ్ లోని ఛత్తర్పూర్ లో ఉన్న భాగేశ్వర్ ధాం సర్కార్ వారి అధికారిక యూ ట్యూబ్ చానల్ మాకు లభించింది. ఇదే వీడియోని ఈ చానల్ లో జూలై 9, 2023 నాడు “జైత్పూర్ నోయిడా శోభ యాత్ర మరియు కలశ పూజ” అనే శీర్షికతో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో 0:57 టైమ్ స్టాంప్ దగ్గర వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్ నే మనం చూడవచ్చు. 

ర్యాలీ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: యూట్యూబ్/భాగేశ్వర్ ధాం సర్కార్)

వార్తా కథనాల ప్రకారం అయోధ్యలో జనవరి 4, 2024 నాడు కలశ యాత్ర అయితే జరిగింది. న్యూస్ 18 చానల్ ఈ యాత్రని తమ న్యూస్ 18 డిబేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ అనే చానల్ లో లైవ్ స్ట్రీమ్ చేసింది. “లైవ్: అయోధ్య రామ మందిరం అక్షత్ కలశ యాత్ర,” అనేది ఈ లైవ్ స్ట్రీమ్ శీర్షిక. ఇందులో జనం సాంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తి మీద కలశం పెట్టుకోవటం మనం చూడవచ్చు. అయితే ఇందులో విజువల్స్, వైరల్ పోస్ట్ లో విజువల్స్ రెండు వేరు వేరు. వైరల్ వీడియోలో జనం రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు, మొక్కల మధ్య నడుస్తుండగా, ఇందులో భవనాల మధ్య నడవటం మనం చూడవచ్చు. 

వైరల్ వీడియో, అయోధ్య వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: యూట్యూబ్/న్యూస్ 18/స్క్రీన్ షాట్)

తీర్పు

గ్రేటర్ నోయిడాలో 2023లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమానికి చెందిన వీడియోని అయోధ్య కలశ పూజ వీడియో అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పు దోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.