ఎలాన్ మస్క్ ‘బల్లపరుపు భూమి కుట్ర సిద్ధాంతం’ అనే పుస్తకం చదువుతున్నట్టున్న ఫొటో ఎడిటెడ్ ఫొటో

ద్వారా: సోహం శా
అక్టోబర్ 12 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎలాన్ మస్క్ ‘బల్లపరుపు భూమి కుట్ర సిద్ధాంతం’ అనే పుస్తకం చదువుతున్నట్టున్న ఫొటో ఎడిటెడ్ ఫొటో

ఎలాన్ మస్క్ ఎడిటెడ్ ఫొటో షేర్ చేసిన ఒక సామాజిక మాధ్యమ పోస్ట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది ఎడిటెడ్ ఫొటో. వాస్తవ ఫొటోలో తాను చదువుతున్నది ‘ది డైనోసర్ హంటర్’ అనే పుస్తకం.

క్లైమ్ ఐడి 618908bc

అక్టోబర్ 5, 2023 నాడు ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒక యూజర్ ఒక ఫొటో చేశారు. అందులో టెస్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ ‘ది ఫ్లాట్ ఎర్త్ కాన్స్పిరసీ’ అనే పుస్తకం చదువుతున్నట్టు ఉంది. ఈ ఫొటో షేర్ చేసి, “తనకి తెలుసు” అనే శీర్షిక రాశారు. ఆ పోస్ట్ ని తరువాత డిలీట్ చేసేశారు. అయితే ఈ పోస్ట్ కి అప్పటికే 80000కి పైగా వ్యూస్, 1200 లైక్స్ ఉన్నాయి. ఎక్స్ లో ఇంకొక యూజర్ కూడా ఇటువంటి శీర్షికతోనే ఇదే ఫొటో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఎక్స్ లో షేర్ చేసిన రెండు పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది ఎడిటెడ్ ఫొటో.

వాస్తవం ఏమిటి?

ఈ పోస్ట్ కి వచ్చిన రిప్లైలలో ఒక రిప్లై లో ఒక యూజర్ ఎలాన్ మస్క్ ‘ది డైనోసర్ హంటర్’ అనే పుస్తకం చదువుతున్న ఫొటో ఒకటి షేర్ చేశారు. దీనిని ఆధారం చేసుకుని మేము మరింత శోధించాము. ఎలాన్ మస్క్ ‘ది డైనోసర్ హంటర్’ అనే పుస్తకం చదువుతున్న ఇదే ఫొటోని @elonmuskbooks అనే ఒక యూజర్ ఎక్స్ లో ఆగస్ట్ 14, 2022 నాడు పోస్ట్ చేశారని కనుగొన్నాము. ఎలాన్ మస్క్ ‘ది ఫ్లాట్ ఎర్త్ కాన్స్పిరసీ’ అనే పుస్తకం చదువుతున్నారు అని పోస్ట్ చేసిన దానికన్నా చాలా ముందే పైన పేర్కొన్న ఫొటోని ఎక్స్ లో వేరే వాళ్ళు పోస్ట్ చేశారు. 

ది ఎలాన్ మస్క్ బుక్ క్లబ్ యూజర్ పోస్ట్ చేసిన ఫొటో (సౌజన్యం: ఎక్స్)

ఈ ఫొటోని మొదటిగా హోమార్ హికం ఆఫీషియల్ పేజ్ అనే ఒక ఫేస్బుక్ పేజ్ లో నవంబర్ 23, 2010 నాడు పోస్ట్ చేశారని కనుగొన్నాము. ఈ పేజ్ ఈ ‘ది డైనోసర్ హంటర్’ రచయిత హోమార్ హికం కి చెందిన వేరిఫైడ్ పేజ్. “ఎలాన్ మస్క్ ‘ది డైనోసర్ హంటర్’ పుస్తకం చదువుతూ మాకు దొరికిపోయాడు. ఈ మనిషి ఎవరో మీకు తెలియకపోతే అలా ఒక సారి ఇంటర్నెట్ లో వెతకండి. ఇతను చాలా ముఖ్యమైన వ్యక్తి అనేది మాత్రం స్పష్టం. కృతజ్ఞతలు ఎలాన్”, అనే శీర్షికతో ఈ ఫొటోని ఈ పేజ్ లో పోస్ట్ చేశారు. 

హోమార్ హికం అధికారిక పేజ్ లో పోస్ట్ చేసిన ఫొటో (సౌజన్యం: ఫేస్బుక్)

తీర్పు

ఈ వైరల్ ఫొటో ఎడిటెడ్ ఫొటో. వాస్తవమైన ఫొటోలో ఎలాన్ మస్క్ ‘ది డైనోసర్ హంటర్’ అనే పుస్తకం చదువుతున్నారు. ఈ ఫొటోని 2010 లో మొదటిసారిగా ఆన్లైన్ లో పోస్ట్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.