ఉత్తర్ ప్రదేశ్ లో ఒక ట్రాఫిక్ పోలీసు దుందుడుకు ప్రవర్తన వీడియోని ఆంధ్ర ప్రదేశ్ వీడియో అని షేర్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
అక్టోబర్ 16 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఉత్తర్ ప్రదేశ్ లో ఒక ట్రాఫిక్ పోలీసు దుందుడుకు ప్రవర్తన వీడియోని ఆంధ్ర ప్రదేశ్ వీడియో అని షేర్ చేశారు

ఆన్లైన్ లో చేసిన క్లైమ్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

సెప్టెంబర్ 2023 లో ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో తీసిన వీడియో ఇది.

క్లైమ్ ఐడి 690054ec

క్లైమ్ ఏమిటి?

ఒక కాన్వాయ్ వెళుతుండగా సైకిల్ మీద పక్కనే వెళ్తున్న ఒక వ్యక్తిని ఒక ట్రాఫిక్ పోలీసు తోసేస్తున్న వీడియోని ఒక యూజర్ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో అక్టోబర్ 12, 2023 నాడు షేర్ చేశారు. సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని ట్రాఫిక్ పోలీసు ఆపేసి తోసేయడంతో ఆ వ్యక్తి కిందపడిపోవటం మనం ఈ వీడియోలో చూడవచ్చు. 

“సజ్జల” కాన్వాయ్ వెళుతుండగా ఈ ఘటన జరిగిందని, “ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న చెత్త ప్రభుత్వ పాలనకి” ఇది నిదర్శనం అనే శీర్షికతో ఈ వీడియో షేర్ చేశారు. సజ్జల అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి. తాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు, పాలక వై ఎస్ ఆర్ సి పి పార్టీ ముఖ్య నాయకుడు. ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ వీడియోకి 12000 కి పైగా వ్యూస్ ఉన్నాయి.  ఈ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వీడియో కాదు.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియో మీద ‘పంజాబ్ కేసరి’ వాటర్ మార్క్ గమనించాము. పంజాబ్ కేసరి అనేది హిందీ వార్తా పత్రిక. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశ పత్రిక. దీని ద్వారా వివిధ కీ వర్డ్స్ ద్వారా సెర్చ్ చేస్తే ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు మాకు లభించాయి.

ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థకు చెందిన జన్ సత్తా పత్రిక ఈ ఘటనకు సంబంధించిన కథనాన్ని సెప్టెంబర్ 1, 2023 నాడు ప్రచురించింది. ఇందులో ఈ వీడియో తాలూకు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళుతుండగా అక్కడ బందోబస్తులో ఉన్న ఒక ట్రాఫిక్ పోలీసు అదే రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని పక్కకి తోసేశారు అని ఈ కథనంలో రాశారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని మౌ జిల్లాలో జరిగిన ఘటన అని ఇందులో పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య. వీరిద్దరిలో ఈ కాన్వాయ్ ఎవరిదో అనే దాంట్లో స్పష్టత లేదు.

ఇదే వీడియోని వివిధ వార్తా సంస్థలు ప్రచురించాయి. అందులో ట్రాఫిక్ పోలీసు సైకిల్ తొక్కుకుని వస్తున్న వ్యక్తి మీద హిందీలో అరవటం, తరువాత తనని పక్కనున్న పొలంలోకి తోసేయటం, దాని కారణంగా సైకిల్ మీదున్న వ్యక్తి కింద పడిపోవటం మనం చూడవచ్చు.

క్వింట్ హిందీ వారు తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఇదే వీడియోని సెప్టెంబర్ 1, 2023 నాడు అప్లోడ్ చేశారు. ఈ కాన్వాయ్ ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ అని అందులో తెలిపారు.

రెండూ వీడియోలలోనూ కాన్వాయ్, పసుపు జెండాలు కట్టి ఉన్న ఒక పసుపు రంగు ఆటో, ఒక వాటర్ ట్యాంకర్, ట్రాఫిక్ పోలీసు, సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని మనకం చూడవచ్చు. 

వైరల్ వీడియో, ఒరిజినల్ వీడియో మధ్య పోలిక  (సౌజన్యం: ఎక్స్/జన్ సత్తా/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వన్ ఇండియా హిందీ అనే వార్తా సంస్థ ఈ వీడియోని తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో సెప్టంబర్ 1, 2023 నాడు అప్లోడ్ చేసి ఈ వీడియో ఉత్తర్ ప్రదేశ్ లోని మౌ జిల్లాలో ఘోసీ అనే ప్రాంతంలో జరిగినది అని తెలిపారు. ఘోసీ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఘటన అని కూడా పేర్కొన్నారు. ఘోసీ నియోజకవర్గానికి సెప్టంబర్ 5, 2023 నాడు ఉపఎన్నిక జరిగింది. 

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన విపక్షమైన సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ సింగ్ ఇదే వీడియోని సెప్టంబర్ 1, 2023 నాడు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘోసీ ఓటర్లని పక్కకి నెట్టేస్తున్నదని, అలా నెట్టేసి పాదాచారులని, సైకిల్ తొక్కుకునే వాళ్ళని రోడ్డు మీదకి రానివ్వటం లేదని ఈ వీడియోతో పాటు రాసుకొచ్చారు. 

మనోజ్ సింగ్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

దీనిబట్టి ఈ వీడియో ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వీడియో అని మనకి స్పష్టం అవుతున్నది.

తీర్పు

ఉత్తర్ ప్రదేశ్ లో సైకిల్ తొక్కుతున్న ఒక వ్యక్తితో ఒక ట్రాఫిక్ పోలీసు దుందుడుకుగా ప్రవర్తిస్తున్న ఘటనకి సంబంధించిన వీడియో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఘటనగా క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.