విద్యుత్తు కార్లు రవాణాని నియంత్రించే సాధనాలు కాదు

ద్వారా: జాన్ ఫార్సేథ్
డిసెంబర్ 5 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
విద్యుత్తు కార్లు రవాణాని నియంత్రించే సాధనాలు కాదు

సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్ (లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

దాదాపుగా ఆధునిక కార్లన్నీ ఆ కారు డ్రైవింగ్ గురించిన సమాచారం సేకరిస్తాయి. విద్యుత్తు కార్లు అనేవి ‘ది గ్రేట్ రీసెట్’ లో భాగం అనేదానికి ఏ ఆధారం లేదు.

క్లైమ్ ఐడి 6bb988d0

క్లైమ్

విద్యుత్తు కారులు మన రవాణాని నియంత్రిస్తాయి అని చెబుతూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. “వాళ్ళు మీరు విద్యుత్తు కారు వాడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీరు మీ స్మార్ట్ సిటీ దాటి వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి. అలాగే ఈ కారుని రిమోట్ గా ఆపేయవచ్చు, అలాగే మీ కార్బన్ ఫుట్ ప్రింట్ లెక్క వేయడానికి మీ డ్రైవింగ్ వివరాలు అన్నీ సేకరిస్తారు. హరిత జీవనం అంటే ఇదే. మీ జీవతాన్ని నియంత్రించడం,” అంటూ ఈ పోస్ట్ ని ఫేస్బుక్ లో 1000కి పైగా మంది షేర్ చేశారు.

అయితే ఈ పోస్ట్ ‘గ్రేట్ రీసెట్’ అనే కుట్ర సిద్ధాంతానికి సంబంధించినది. 

వాస్తవం

అమెరికాకి చెందిన మొజిల్లా ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ  2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం దాదాపుగా అన్ని ఆధునిక కార్లు కూడా ఆయా డ్రైవర్ల గురించి, డ్రైవింగ్ గురించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమస్త వారు సర్వే చేసిన కార్లలో 67 శాతం ఈ సమాచారాన్ని థర్డ్ పార్టీకి అమ్ముతున్నాయి కూడా. 56 శాతం న్యాయ అధకారుల, పోలీసుల విజ్ఞప్తి మేరకు అవసరం పడినప్పుడు ఈ సమాచారాన్ని వారికి అందిస్తున్నాయి. ఈ నివేదికలో శిలాజల ఇంధనాల ఆధారంతో, విద్యుత్తు ఆధారంతో నడిచే కార్లు అనే తేడా లేదు.

కొన్ని బీమా సంస్థలు ‘టెలిమాటిక్ బీమా’ అనే పధకానని ప్రవేశపెట్టాయి. ఈ పధకం ప్రకారం సరైన ధర నిర్ణయించటం కోసం జిపిఎస్ మరియు కారులో ఉండే ఇతర సాంకేతికతని ఈ బీమా అందించే సంస్థలు ట్రాక్ చేస్తాయి. ఇవి వాహనం తయారీదారులు ఇన్స్టాల్ చేసినవి కాదు. కాబట్టి రిమోట్ గా కారుని ఆపేయటం నియంత్రించడం లాంటి ప్రశ్నే లేదు. ఈ కారు శిలాజల ఇంధన కారు అవ్వనివ్వండి, విద్యుత్తు కారు అవ్వనివ్వండి.

2021 లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ లు ఆమోదించిన ఒక మౌలిక వసతుల బిల్లుని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆమోదించారు. దీని ప్రకారం కొత్త కారులలో డ్రైవర్ల ప్రవర్తనని కనిపెట్టేందుకు, వారు మద్యం సేవించి ఉన్నా లేదా కారు నడపలేని పరిస్థితులలో ఉన్నా ఆ కారుని నియంత్రించే సాంకేతికత కొత్త కారులలో ఇన్స్టాల్ చేయాలి. ఈ నిబంధన విద్యుత్తు కార్లకి మాత్రమే పరిమితం కాదు.

విద్యుత్తు ద్వారా నడిచే కార్లని హ్యాకర్లు రిమోట్ గా ఆపేసే అవకాశం ఉందనే ఆందోళన కొంత మంది లేవనెత్తారు కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ప్రకారం ప్రభుత్వం ఏ కారుని కూడా రిమోట్ గా ఆపేయలేదు.

ఈ క్లైమ్ స్మార్ట్ సిటీ కుట్ర సిద్ధాంతానికి సంబంధించినది. ఈ సిద్ధాంతం ప్రకారం టెక్నలాజీ ద్వారా మనుషుల స్వేచ్ఛని, కదలికలని నియంత్రించే కుట్ర జరుగుతున్నది అని ఈ కుట్ర సిద్ధాంతం ప్రచారం చేసేవారి అభియోగం. ప్రస్తుతం ఉన్న 15 నిమిషాల పట్టణాలు అనే కాన్సెప్ట్ భారీ నిఘా సమాజానికి తొలిమెట్టు అనేది వీరి వాదన.

పట్టణ ప్రణాళిక కాన్సెప్ట్ అయిన ఈ 15 నిమిషాల పట్టణం అంటే మన ఇంటి దగ్గర నుండి దైనందిక అవసరాలైన బడులు, దుకాణాలు, బ్యాంకులు, ఆసుపత్రులు, కార్యాలయాలు పదిహేను నిమిషాలలో నడక ద్వారా కానీ, బైక్ మీద కానీ చేరుకోగలగటం.

కుట్ర సిద్ధాంతకర్తలకి ఈ కాన్సెప్ట్ ఒక కుట్ర. మునిసిపల్ అధికారులని సంప్రదించటానికి యాప్ లు, సెన్సార్స్ వాడే విద్యుత్తు పరికరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ నిఘాలో భాగం అని వీరు నమ్ముతుంటారు.

ప్రపంచంలో కొన్ని నగరాలు “ట్రాఫిక్ ఫిల్టర్స్” అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాయి. దీని ఉద్దేశం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి లైసెన్స్ ప్లేట్ ఫొటో తీసి, వారికి జరిమానా విధించే కెమెరాలు రోడ్ల మీద ఏర్పాటు చేయడం. అంతే కానీ రోడ్డుకి అడ్డంగా బ్యారికేడ్లు లాంటివి ఏర్పాటు చేయడం కాదు. దీని ఉద్దేశం ట్రాఫిక్ జామ్ లని నియంత్రించడమే కానీ రవాణని నియంత్రించడం కాదు. ఇది రవాణాని నియంత్రిస్తుంది అనే క్లైమ్ లని రాయిటర్స్ సంస్థ ఫ్యాక్ట్ చెక్ విభాగం అనేక సార్లు డీబంక్ చేసింది.

ఈ “స్మార్ట్ సిటీ” కుట్ర సిద్ధాంతాలు మొదటిసారిగా కోవిడ్ సమయంలో 2020లో మొదలయ్యాయని వైర్డ్ సంస్థ తెలిపింది. శిలాజల ఇంధనాల లాబీకి చెందిన వారు ప్రభుత్వం “క్లైమేట్ లాక్ డౌన్” విధిస్తున్నదని, ప్రజలు తమ జిల్లాలు దాటి వెళ్లలేరు అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అనుమతి లేకుండా తమ ప్రదేశం దాటి ప్రజలు వెళ్ళకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలని వాడుతున్నదని వీరు ప్రచారం చేశారు.

ప్రపంచ ఆర్థిక వేదిక కోవిడ్ తరువాత ఆర్థిక వ్యవస్థ కొలుకోవటానికి “ది గ్రేట్ రీసెట్” అనే ప్రణాళికని తీసుకువచ్చాక ఈ కుట్ర సిద్ధాంతం మరింత ఊపందుకుంది. ఈ ప్రణాళిక ఉద్దేశం టెక్నాలజీ వాడి నాగరాలని మరింత సుస్థిరంగా చేయడం. కుట్ర సిద్ధాంతవాదులు ఇది ప్రభుత్వం పర్యావరణం పేరు మీద ప్రజల ప్రాధమిక హక్కులని, వ్యక్తిగత ఆస్తిని లాక్కునే ప్రయత్నం అని ప్రచారం చేస్తున్నారు.

తీర్పు

దాదాపుగా అన్ని ఆధునిక కార్లు ఈ రోజున డ్రైవర్ల సమాచారం సేకరిస్తున్నాయి. ప్రభుత్వం రిమోట్ గా కార్లని ఆపేయటం కుదరదు. ఈ క్లైమ్ ‘ది గ్రేట్ రీసెట్’ కుట్ర సిద్ధాంతానికి సంబంధించినది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.