సంబంధం లేని వీడియో షేర్ చేసి మోదీకి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు ఫొటోని ప్రజలు తగలబెడుతున్నారు అని క్లైమ్ చేశారు

ద్వారా: రజిని కె జి
జూన్ 6 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సంబంధం లేని వీడియో షేర్ చేసి మోదీకి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు ఫొటోని ప్రజలు తగలబెడుతున్నారు అని క్లైమ్ చేశారు

మోదీకి మద్ధతు తెలిపినందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ లో నిరసనలు చేస్తున్నారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

శాసనసభ ఎన్నికలలో గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరాంకి ఇచ్చినందుకు తెలుగుదేశం కార్యకర్తలు నిరసన తెలుపుతున్న వీడియో ఇది.

క్లైమ్ ఐడి 6cf47216

క్లైమ్ ఏంటి?

చంద్రబాబు నాయుడు ఫొటోని చెప్పుతో కొడుతూ, దానిని తగలబెడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, చంద్రబాబు మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు ప్రజలు నిరసన తెలియచేస్తున్న వీడియో అని క్లైమ్ చేశారు.

2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 292 సీట్లు గెలుచుకోగా, ఇండియా కూటమి 232 గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 272 సీట్లు అవసరం. తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్నికలలో పోటీ చేసింది. అలాగే తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని ప్రకటించింది. ది హిందూలో కథనం ప్రకారం జూన్ 5 నాడు ఎన్డీఏ కూటమి తమ ప్రధానిగా మోదీని ఎన్నుకుంది.

ఈ నేపధ్యంలో, ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, “మోదీకి మద్దతు తెలిపినందుకు కోపోద్రిక్తులైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చంద్రబాబు ఫొటోలని తగాలబెడుతున్నారు,” అని రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ క్లైమ్ తప్పు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకి ముందు సీట్ల కేటాయింపునకి సంబంధించి నిరసన తెలియచేస్తున్న వీడియో ఇది.

మేము ఏమి తెలుసుకున్నాము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ వీడియో మార్చ్, 2024 నాటిదని మేము తెలుసుకున్నాము. ఇదే వీడియోని తెలుగు వార్తా సంస్థ సమయం తెలుగు తమ యూట్యూబ్ చానల్ (ఆర్కైవ్ ఇక్కడ) లో మార్చ్ 29, 2024 నాడు పోస్ట్ చేసిందని తెలుసుకున్నాము. “గుంతకల్లు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు ఫొటోని తగాలబెట్టారు” అనేది ఈ వీడియో శీర్షిక. ఈ వీడియోలో వివరాల ప్రకారం, తెలుగుదేశం కార్యకర్తలు గుమ్మనూరు జయరాంకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగు దేశంకి మారిన గుమ్మనూరు జయరాంకి తెలుగుదేశం గుంతకల్లు టికెట్ ఇచ్చినందుకు తెలుగుదేశం కార్యకర్తలు నిరసన తెలియచేస్తున్న వీడియో ఇది మేము తెలుసుకున్నాము. స్థానిక తెలుగుదేశం నేత జితేందర్ గౌడ్, ఆయన అనుచరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి, నిరసనలు చేపట్టారని తెలుసుకున్నాము. 

సమయం తెలుగు యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: యూట్యూబ్)

ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కథనం ప్రకారం, జితేందర్ గౌడ్ అనుచరులు గుంతకల్లు తెలుగుదేశం కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి అక్కడ ఉన్న ఫర్నీచర్ ని ధ్వంసం చేశారు. ఆ తరువాత, చంద్రబాబు ఫొటోని చెప్పుతో కొట్టి, దానికి నిప్పు అంటించారు అని ఈ కథనంలో ఉంది. ది హిందూ లో వచ్చిన కథనం ఈ వివరాలని ధృవపరుస్తున్నది.

ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13, 2024 నాడు జరిగాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 144 శాసనసభ స్థానాలకి కానూ 135 చోట్ల విజయం సాధించింది. కూటమి పార్టీలైన జన సేన 21 చోట్ల, భారతీయ జనతా పార్టీ 8 చోట్ల గెలిచాయి. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం ఈ ఎన్నికలలో గుమ్మనూరు జయరాం 1010700 ఓట్లు సాధించి గెలుపొందారు.

దీనిబట్టి ఈ వీడియో ఎన్నికలకి ముందటి వీడియోని మనకు స్పష్టం అవుతున్నది.

తీర్పు

గుంతకల్లు నియోజకవర్గం సీటు గుమ్మనూరు జయరాంకి ఇచ్చినందుకు రెండు నెలల క్రితం తెలుగు దేశం కార్యకర్తలు నిరసన చేపట్టిన వీడీయోని షేర్ చేసి, మోదీకి మద్దతు తెలిపినందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలౌ నిరసనలు చేపడుతున్నారని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

(అనువాదం - గుత్తా రోహిత్) 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.