2019 నాటి ఢిల్లీ వీడియోని హర్యానాలో యువత రైతుల నిరసనను వ్యతిరేకిస్తున్నట్టుగా చూపించారు

ద్వారా: అజ్రా అలీ
ఫిబ్రవరి 20 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2019 నాటి ఢిల్లీ వీడియోని హర్యానాలో యువత రైతుల నిరసనను వ్యతిరేకిస్తున్నట్టుగా చూపించారు

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో ఢిల్లీలో 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా జరిగిన ర్యాలీ లోనిది. రైతుల నిరసనల కంటే ముందే జరిగింది.

క్లైమ్ ఐడి 780a239d

క్లెయిమ్ ఏమిటి?

ఈ మధ్య రైతుల నిరసనలు జరుగుతున్న నేపధ్యం లో, హర్యానాలో యవకుల వీడియోగా ఒక వీడియో  వైరల్ అవుతుంది, ఈ వీడియో లో యువత నిరసన చేపడుతున్న రైతులపై హింస ను వాడాలని పిలుపునిస్తున్నటుంది, వారు ప్రధాని నరేంద్ర మోడీకి మరియు పోలీసులకి మద్దతుగా నినాదాలు చేస్తున్నట్లుంది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలను జోడించి ఈ వీడియోని కొంతమంది యూజర్లు షేర్ చేస్తున్నారు ‘ఖలిస్తాని నిరసనలతో’ హర్యానా యువత ఇబ్బంది పడుతున్నారని పోస్ట్ చేస్తున్నారు. ఆర్కైవ్ చేసిన  ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు.


వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఢిల్లీలోకి రానివ్వకపోవటంతో గత కొన్ని రోజులుగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో  కొన్ని సంబంధం లేని విజుఅల్స్  ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కుడా అలాంటిదే.

మేము ఏమి కనుగొన్నాము?

ప్రస్తుతం వైరల్ అవుతున్న లాంటి వీడియోనే మాకు 2019 లో ఒక ఫేస్బుక్ యూజర్ డిసెంబర్ లో అప్లోడ్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోకి శీర్షికగా, ఢిల్లీ పోలీసులను లాఠీ పట్టుకోమని, తాము వారి వెంట ఉంటామని రాసుకొచ్చారు. ఈ వీడియోని హర్యానాకి చెందిన బిజెపి నేత, జవహర్ యాదవ్ వారి ఎక్స్ అకౌంట్ లో డిసెంబర్ 26, 2019న షేర్ చేసారు, అని లోకమాత్ అనే వార్త సంస్థ ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా జరిగిన  కార్యక్రమంలో ఈ వీడియో తీశారు అని రాసి ఉంది.

వీడియోలో ఉన్న వ్యక్తులు ఢిల్లీ పోలీసులను లాఠీ పట్టుకోమంటారు, అంటే ఈ వీడియో ఢిల్లీ లోనిది, హర్యానాకు సంబంధం లేదు అని అర్ధమవుతుంది.

0:02 టైం స్టాంప్ వద్ద, యునిక్ బజార్ అనే స్టోర్ ఉంది, మేము ఈ స్టోర్ ని ఢిల్లీ లోని లక్ష్మి నగర్ లో జియోలొకేట్ చేయగలిగాము. 

 

గూగుల్ మ్యాప్స్ లో కనిపించిన స్టోర్ (సౌజన్యం : స్క్రీన్ షాట్/ ఎక్స్/ గూగుల్ మ్యాప్స్)

ట్రోల్ ఇండియన్ పాలిటిక్స్ అనే అకౌంట్ అప్లోడ్ చేసిన మరి కాస్త స్పష్టంగా కనపడే వీడియోలో, లత సారీస్ అనే షాపు 0:10 మార్క్ లో కనపడింది. దీనిని కుడా మేము గూగుల్ మ్యాప్స్ లో కనిపెట్టాము. 


గూగుల్ మ్యాప్స్ లో కనపడే మరో స్టోర్ (సౌజన్యం : ఫేస్బుక్/గూగుల్ మ్యాప్స్)

పైన పేర్కొన్న ఆధారాలతో వైరల్ అవుతున్న వీడియో హర్యానాకి సంబంధించినది కాదని, ఢిల్లీ కి చెందినది అని అర్ధమవుతుంది, మరియు వైరల్ అవుతున్న వీడియో 2019 నుండి సామాజిక మాధ్యమాలలో ఉంది. 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఈ చట్టం ద్వారా, ఆఫ్ఘనిస్థాన్, బాంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ దేశాలనుండి డిసెంబర్ 2014 లోపు భారతదేశానికి వచ్చిన ఇతర మైనారిటీ మతాలకు (హిందూ, సిఖ్, బుద్దిస్ట్, జైన్, పార్శి మరియు క్రిస్టియన్) చెందిన వారికి పౌరసత్వం లభిస్తుంది. కానీ ఈ చట్టంలో ముస్లిం మతాలకు చెందిన వారిని జత చేయనందుకు గాను దీనిని విమర్శించారు.

తీర్పు : 

ప్రధాని మోడీకి మరియు పోలీసులకి మద్దతుగా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో రైతుల నిరసనలకు సంబంధించినది కాదు. ఇది ఢిల్లీ లో 2019 లో పౌరసత్వ చట్టానికి సంబంధించి జరిగిన నిరసన లోనిది. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము.

(అనువాదం: రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.