2019 ఎన్నికల షెడ్యూల్ ని 2024 భారతదేశ ఎన్నికల షెడ్యూల్ లాగ షేర్ చేసారు

ద్వారా: రజిని కె జి
ఫిబ్రవరి 16 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2019 ఎన్నికల షెడ్యూల్ ని 2024 భారతదేశ ఎన్నికల షెడ్యూల్ లాగ షేర్ చేసారు

ఆన్లైన్ లో వైరల్ అయిన పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధిచిన అధికారిక షెడ్యూల్ భారతదేశ ఎన్నికల కమిషన్ ఇంకా విడుదల చేయలేదు

క్లైమ్ ఐడి 7d3da1c8

క్లెయిమ్ ఏమిటి?

భారతదేశం లోని 543 లోక్ సభ సీట్లకు గాను పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే లో జరగున్నాయి. ఈ నేపధ్యంలో బీహార్ లో ఎన్నికలు, ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు జరగున్నాయి అంటూ ఒక ప్రకటన వైరల్ అవుతుంది.

ఆ నోటీసు ప్రకారం, వోటింగ్ ఏడు దశల వారీగా, వేరు వేరు తేదీలలో జరగనున్నాయి అని పేర్కొని ఉంది. ఆర్కైవ్ చేసిన పోస్ట్లు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

కొంత మంది యూజర్లు, ఈ ప్రకటన మహారాష్ట్ర కి చెందినది అని వేరే తేదీలను కుడా షేర్ మరాఠి లో షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టుల ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆన్లైన్ లో వైరల్ అయిన పోస్టుల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఇలా వైరల్ అవుతున్న షెడ్యూల్, 2019 ఎన్నికలది. భారతదేశ ఎన్నికల సంఘం 2024 ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు.

మేము ఏమి కనుగొన్నము?

భారత ఎన్నికల సంఘం కానీ బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ 2024 ఎన్నికలకి సంబంధించిన, షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు. ఒకవేళ ప్రకటన ఇచ్చిఉంటే, ఆ విషయం వార్త కథనాలతో ప్రచురింపబడి ఉండేది మరియు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక వెబ్సైటు లో కుడా ఇది ఉండేది, కానీ అలాంటిది ఏమి మాకు లభించలేదు. 

బీహార్ ఎలక్షన్ తేదీలుల గురించి గూగుల్ లో సెర్చ్ చేయగా మాకు 2019 లోని వార్త కథనాలు లభించాయి. గత సారి ఎన్నికలు, ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు జరిగినట్టు ది హిందూ లో మార్చ్ 10, 2019 నాడు ప్రచురితమయిన కథనం పేర్కొంది.

మాకు బీహార్ ఎన్నికల సంఘం విడుదల చేసిన 2019 నోటిఫికేషన్ వారి అధికారిక వెబ్సైటు లోని డాక్యూమెంట్లో పేజీ నెంబర్ 18 లో లభించింది, ఇవే తేదీలతో ప్రస్తుత ప్రకటన కుడా వైరల్ అవుతుంది.


బీహార్ ఎన్నికల సంఘం 2019 లో జారీచేసిన అధికారిక ప్రకటన (సౌజన్యం : ceobihar.nic.in/స్క్రీన్ షాట్)

మహారాష్ట్ర ఎన్నికల తేదీలు అని ప్రచారం లో ఉన్న తేదీలు కుడా 2019 షెడ్యూల్ నుంచి తీసుకున్నవే. ఒక హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ కథనం ప్రకారం, 2019 లో మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11, 18, 23, మరియు 29 తేదీలలో నాలుగు దశలలో జరిగాయి. 


మహారాష్ట్ర ఎన్నికల నేపధ్యం లో జారీ చేసిన అధికారిక ప్రకటన. (సౌజన్యం : ceoelection.maharashtra.gov.in) 

2024 ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ ఇంకా విడుదల చేయలేదు. 17 వ లోక్ సభ జూన్ 16 న ముగియనుంది, కనుక ఏప్రిల్ లేదా మే నెలల ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. 2019 లో ఎలక్షన్ షెడ్యూల్, మార్చ్ రెండో వారం లో విడుదల చేసారు. 

తీర్పు: 

2019 కి చెందిన ఎన్నికల షెడ్యూల్ ని రాబోయే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ గా విధుల చేసారు, కనుక మేము దీనిని తప్పుదోవ పట్టించేటట్టుగా ఉందని నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.