సంబంధం లేని ఫొటో షేర్ చేసి తెలుగుదేశం నాయకుని డబ్బు జప్తు చేశారని ప్రచారం చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
అక్టోబర్ 20 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సంబంధం లేని ఫొటో షేర్ చేసి తెలుగుదేశం నాయకుని డబ్బు జప్తు చేశారని ప్రచారం చేశారు

సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

బెంగళూరులో బృహత్ బెంగళూరు మహానగర పాలికేకి చెందిన ఒక కాంట్రాక్టర్ ఇంట్లో అక్టోబర్ 13, 2022 నాడు ఆదాయపు పన్ను శాఖ వారు జప్తు చేసిన డబ్బుల ఫొటో ఇది.

క్లైమ్ ఐడి 967707f2

క్లైమ్ ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ వారు అక్టోబర్ 12, 2023 నాడు సోదాలు నిర్వహించారు. 

ఆ నేపధ్యంలో ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ అక్టోబర్ 13, 2023 నాడు ఒక ఫొటో షేర్ చేసి, “ఆదాయపు పన్ను శాఖ వారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో సోదాలు నిర్వహించారు అని వార్తలు వస్తున్నాయి”, అని రాసుకొచ్చారు. ఈ ఫొటో ఈ సోదాలకి సంబంధించినది అన్నట్టు ఈ వ్యాఖ్యానం ఉంది (ఆర్కైవ్ ఇక్కడ). 

ఇంకొక యూజర్ ఈ పోస్ట్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి, “టిడిపి నాయకుల ఇళ్లల్లో బయటపడుతున్న కట్టల పాములు”, అని రాసుకొచ్చారు (ఆర్కైవ్ ఇక్కడ). 

సామాజిక మాధ్యమాలలో పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో జప్తు చేసిన డబ్బుల కట్టల ఫొటో కాదిది. 

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే అక్టోబర్ 13, 2023 నాడు బెంగళూరులో బృహత్ బెంగళూరు మహానగర పాలికేకి చెందిన కాంట్రాక్టులు చేసే ఒక కాంట్రాక్టర్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాల తరువాత జప్తు చేసిన డబ్బు కట్టల ఫొటో అని తెలిసింది. 

అక్టోబర్ 13, 2023 నాడు ది హిందూలో వచ్చిన ఒక వార్తా కథనం ప్రకారం, అక్టోబర్ 13, 2023 తెల్లవారజామున బెంగళూరుకి చెందిన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. సోదాలలో 40 కోట్ల వరకు డబ్బు పట్టుబడినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయని ఈ కథనంలో పేర్కొన్నారు. వైరల్ పోస్ట్ లో ఉన్న ఫొటోనే ఈ కథనంలో జోడించారు. ఈ కాంట్రాక్టర్ పేరు ఆర్. అంబికాపతి అని, ఆయన అనేక కాంట్రాక్టర్ సంఘాల బాధ్యుడు అని ఈ కథనంలో పేర్కొన్నారు. 

ది హిందూ పత్రికలో ప్రచురించిన ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ది హిందూ)

అలాగే, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఏషియన్ ఏజ్ పత్రికలు కూడా ఇదే ఫొటోని ఇదే వార్తాతో జోడించి అక్టోబర్ 13, 2023 నాడు ప్రచురించాయి.

అలాగే, గుణ్ణం చంద్రమౌళి ఇళ్లల్లో డబ్బు జప్తు చేసినట్టు ఎటువంటి వార్తలు కానీ ఫొటోలు కానీ ఇప్పటికి రాలేదు.

తీర్పు

ఆదాయపు పన్న శాఖ వారు బెంగళూరులో ఒక కాంట్రాక్టర్ ఇంట్లో జప్తు చేసిన డబ్బు కట్టల ఫొటోని ఆంధ్ర ప్రదేశ్ లో ఒక తెలుగుదేశం నాయకుని ఇంట్లో జప్తు చేసిన ఫొటోగా షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్) 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.