కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్వాన పత్రిక అని ఒక అబద్ధపు ఆహ్వానం వైరల్ అయ్యింది

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 24 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్వాన పత్రిక అని ఒక అబద్ధపు ఆహ్వానం వైరల్ అయ్యింది

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 18 నాడు కాదు. మే 20 నాడు.

క్లైమ్ ఐడి b152e4fa

నేపధ్యం

కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార ఆహ్వాన పత్రిక అని చెబుతూ ఒక ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యని అధికారికంగా ప్రకటించారని, ఆయన ప్రమాణస్వీకారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 18 నాడు సాయంత్రం 3:30కి జరగనుందని అందులో ఉంది. ఈ ఆహ్వాన పత్రిక కర్ణాటక గవర్నర్ కార్యాలయం నుండి అని అందులో పేర్కొని ఉంది. అయితే దీనిమీద ఎటువంటి సంతకం లేదు. 

 
వాస్తవం

కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ కార్యాలయం నుండి అటువంటి సర్కులర్ ఏదీ మాకు లభించలేదు. ఆహ్వాన పత్రిక అని చెబుతున్న దీనిని కాంగ్రెస్ పార్టీ తన వెబ్సైట్ లో కానీ అధికార సామాజిక మాధ్యమ హ్యాండిల్స్ లో కానీ షేర్ చెయ్యలేదు. ఈ ఆహ్వాన పత్రిక వివిధ రంగులలో ఉంది- నలుపు, నీలం, ఎరుపు, పచ్చ. ప్రభుత్వ సర్కులర్లు, ప్రకటనలు ఇలా వివిధ రంగులలో ఉండవు. అలాగే ప్రమాణ స్వీకార వేదిక పేరులో కూడా తప్పు ఉంది. ఆ స్టేడియం పేరు శ్రీ కంఠీరవ స్టేడియం. అయితే ఇందులో కేవలం కంఠీరవ స్టేడియం అని మాత్రమే ఉంది. 

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కె. సి. వేణుగోపాల్ కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు, ఉప ముఖ్యమంత్రిగా డి. కె. శివకుమార్ పేరు అధికారికంగా ప్రకటించిందే మే 18, 2023 నాడు. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ గవర్నర్ కార్యాలయాన్ని సంప్రదించగా మే 18 నాడు ఎటువంటి ప్రమాణ స్వీకారం లేదని, తామటువంటి ఆహ్వానం కాని సర్కులర్ కానీ జారీ చెయ్యలేదు అని తెలిపారు. అలయాగే ఈ ఫొటో ఫేక్ అని కర్ణాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఐశ్వర్య మహదేవ్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు. ప్రమాణ స్వీకారం ఎప్పటిలాగానే శ్రీ కంఠీరవ స్టేడియంలో మే 20 నాడు జరగనున్నదని తెలిపారు. 

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే బృందం మీడియాకి పంపిన అధికారిక సమాచారం ప్రకారం ప్రమాణ స్వీకారం మే 20 నాడు జరగనున్నది. “కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అర్థరాత్రి కూడా చర్చలు జరిపి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించి ఒక అంగీకారానికి అందరినీ తీసుకొచ్చారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డి. కె. శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 20 నాడు మధ్యాహ్నం 12:30కి జరుగుతుంది. కాంగ్రెస్ శాసనసభా కమిటీ సమావేశం ఈ రోజు సాయంత్రం 7 గంటలకి బెంగళూరులో జరగనుంది.” అని అందులో ఉంది. 

తీర్పు

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డి. కె. శివకుమార్ లని కాంగ్రెస్ ప్రకటించింది. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 20 నాడు మధ్యాహ్నం 12:30 కి జరగనుంది. మే 18 నాడు ప్రమాణ స్వీకారం అని తప్పుడు సమయంతో కూడిన ఒక ఫేక్ ఫొటో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నది. కాబట్టి ఇది ఆబద్ధం అని మేము నిర్ధారించాము.  

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.