వైఎసార్సీపి నేతలు తమ పార్టీ అధినేత మరియు ఆంధ్రా ముఖ్య మంత్రి జగన్ ని విమర్శించినట్టుగా ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసారు

ద్వారా: రోహిత్ గుత్తా
మార్చి 4 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వైఎసార్సీపి నేతలు తమ పార్టీ అధినేత మరియు ఆంధ్రా ముఖ్య మంత్రి జగన్ ని విమర్శించినట్టుగా ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసారు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ ల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఒరిజినల్ వీడియోలలో జోగి రమేష్ మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి మరియు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గురించి.

క్లైమ్ ఐడి bdaaf97f

క్లెయిమ్ ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లో ఉన్న వైఎసార్సీపి పార్టీకి సంబంధించిన ఇరువురు పార్టీ నాయకులు, ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్టుగా రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.

ఒక వీడియోలలో ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మరొక వీడియోలో ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్  పోసాని కృష్ణ మురళి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినట్టుగా ఉంది. ఈ రెండు వీడియోలు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు వెళ్లబోయే రెండు నెలలు ముందు సామాజిక మధ్యమాలలో వైరల్ అయ్యాయి.

మొదటి వీడియోలో జోగి రమేష్ మాట్లాడుతూ, “జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాట మీద నిలబడలేడు అని చెప్పేసి డే వన్ (మొదటి రోజు) నుండి చెప్తా ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. వైఎసార్సీపి పార్టీ ఒక విలువలు లేని, సిద్ధాంతాలు లేని విశ్వసనీయత లేని పార్టీ”

రెండో వీడియోలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ, “మీరొక అవినీతి పరుడని. . . మీరొక తార్పుడు గాడని, మీరు ఆడపిల్లల్ని వాడుకుని వదిలేస్తారని, ఇన్ని రకాల బాడ్  (చెడు అభిప్రాయం) ఉంది.”

ఆర్కైవ్ చేసిన పోస్ట్ లింకులు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.


సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ ల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది నిజం కాదు. ఇవి ఎడిట్ చేసిన వీడియోలు. 

మేము ఏమి కనుగొన్నము?

జోగి రమేష్ వీడియో

ఈ వీడియోలో కింద భాగంలో తెలుగు సినిమా సన్నివేశాలను, పై భాగం లో జోగి రమేష్ వీడియోను జత చేశారు, ఈ వీడియోలో తరుచుగా జంప్ కట్స్ గమనించవచ్చు, దీని బట్టి మనకి ఈ వీడియో ఎడిట్ చేయబడినది అని అర్ధమవుతుంది. జోగి రమేష్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా మాకు ఒరిజినల్ వీడియో యూట్యూబ్ లో దొరికింది. ఈ వీడియో జోగి రమేష్, సాక్షి టివి కి ఫిబ్రవరి 24, 2024 నాడు ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించినది. వైరల్ వీడియోలో సాక్షి టివి వాటర్ మార్క్ ని, లోగో ని తొలగించారు. 


ఈ వీడియోలో రమేష్ రాబోయే ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ మరియు జన సేన పార్టీల కూటమి గురించి, వారి పార్టీ తరపున నిలబడుతున్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు

వైరల్ అవుతున్న వీడియోలో మొత్తం మూడు భాగాలూ అనుకోవచ్చు, మొదటి భాగం 02:19 నుండు 02:25 వరకు. ఇక్కడ రమేష్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచి ఒక్క మాట మీద కుడా నిలబడలేదు అని అన్నాడు. (పవన్ కళ్యాణ్, నటుడు మరియు రాజకీయ వేత్త. ఈయన జన సేన పార్టీ అధినేత)

ఈ వీడియో రెండో భాగం 02:40 నుండు 02:43 మధ్యలో “పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు” అని ఉంది. పైగా 02:43 నుండి 02:49 వరకు, పవన్ కళ్యాణ్ ఒక విలువలు, నిజాయితీ మరియు సిద్ధాంతాలు లేని వ్యక్తి అని, అలాంటిదే జన సేన పార్టీ అని అన్నారు. 02:53 నుండి 02:55 వద్ద వాడిన వైఎసార్సీపి అనే పదాన్ని మరియు 02:59 నుండి 03:01 వద్ద వాడిన జగన్ మోహన్ రెడ్డి అనే పదాన్ని ఒరిజినల్ వీడియో నుండి తీసి వైరల్ వీడియోలో జోడించి, జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్టుగా చేశారు.


పోసాని కృష్ణ మురళి వీడియో 

ఈ వీడియోలో కుడా జంప్ కట్స్ మనం గమనించవచ్చు, పైగా వీడియో కింద భాగం లో తెలుగు సినిమా సన్నివేశాలను జత చేయడంతో, ఇది ఎడిట్ చేయబడ్డ వీడియో అని అర్ధం అవుతుంది.  రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఈ వీడియోని ఫిబ్రవరి 20 నాడు సాక్షి టీవిలో పోసాని కృష్ణ మురళి ఇంటర్వ్యూ నుండి తీసుకున్నది అని అర్ధమవుతుంది, వైరల్ అవుతున్న వీడియోలో ఛానల్ లోగో ని ఛానల్ వాటర్ మార్క్ ని  మసకబార్చారని అర్ధమవుతుంది.

ఒరిజినల్ వీడియోలో  పోసాని కృష్ణ మురళి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ,  వాళ్ళ ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడారు. ఈ వైరల్ వీడియోను రెండు భాగాలుగా అనుకుంటే, ఒకటో భాగం 02:11 నుండి 02:13 టైం స్టాంప్ మధ్య ఉంది. ఇక్కడ కృష్ణ మురళి, చంద్రబాబు గురించి మాట్లాడుతూ, “ఒక పెద్ద అవినీతిపరుడు” అని అన్నారు. ఇదే ఒరిజినల్ వీడియోలో 2:13 నుండి 02:25 వరకు, “నువ్వు (చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ) తార్పుడివని, వెన్నుపోటు పొడిచే వాడని, ఆడవారి జీవితాలతో ఆడుకుంటాడని ఉంది.” ఇలా అయన గురించి అనేక అభిప్రాయాలూ ఉన్నాయని ఉంది. కానీ ఇవన్నీ తన అభిప్రాయాలు కాదని, తనకు ముందు నుంచి చంద్రబాబు ఒక నిజాయితీ పరుడు అనే ఉద్దేశమే ఉందని తెలిపారు.

తీర్పు :

ప్రతిపక్ష పార్టీల గురించి వైఎసార్సీపి నాయకులు మాట్లాడిన వీడియోలను ఎడిట్ చేసి, వారు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నట్టుగా చిత్రీకరించారు. ఒరిజినల్ వీడియోలలో వారు విమర్శించింది  చంద్రబాబు నాయుడుని మరియు పవన్ కళ్యాణ్ ని. కనుక మేము దీనిని అబధ్ధం అని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.