ఒక మతపరమైన ర్యాలీ వీడియోని రాహుల్ గాంధీ కోసం వచ్చిన జనసంద్రం లా చూపారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
ఏప్రిల్ 19 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒక మతపరమైన ర్యాలీ వీడియోని రాహుల్ గాంధీ కోసం వచ్చిన జనసంద్రం లా చూపారు

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్ / స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో గత సంవత్సరం మార్చ్ నుండి ఆన్లైన్ లో ఉంది, ఇది రాహుల్ గాంధీకి ర్యాలీకి సంభందించిన వీడియో కాదు.

క్లైమ్ ఐడి dd4744dc

క్లెయిమ్ ఏమిటి? 

2024 ఎన్నికల నేపధ్యంలో రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ సమయంలో ఒక 22 సెకెన్ల జనసంద్రం తో కూడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. కొంత మంది యూజర్లు సామాజిక మాధ్యమాలలో రాహుల్ గాంధీ చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీలో జనసంద్రం అంటూ షేర్ చేస్తున్నారు.

ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూజర్ ఈ వీడియోని షేర్ చేసి హిందీలో శీర్షిక పెట్టి ఇలా షేర్ చేసారు, ‘రాహుల్ గాంధీకి మద్దతు పలికే ఈ జనాభా మోడీజీకి నిద్ర పట్టనివ్వదు’ అని. ఇతరులు కుడా, ‘ఈ జనాభా నియంతృత్వ పాలనకి అంతమా?’ అని అంటూ ఎన్నికలకి సంభందించిన కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీ హష్టాగ్ లను వాడి షేర్ చేసారు. 

మేము ఈ కథనం రాసే సమయానికి అలాంటి ఒక పోస్టుకు 5,96,900 మంది చూసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్ / స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ, ఈ వీడియో ఆంధ్ర ప్రదేశ్ లోని గోరంట్ల అనే ఊరులో ప్రతి సంవత్సరం జరిగే ఒక మతపరమైన వేడుక లోనిది. 

మేము ఏమి కనుగొన్నము?

వైరల్ ఫోటో లోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు మరింత నిడివి ఉన్న వీడియో ఒకటి ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్లో లభించింది. హోసన్నా ఫెలోషిప్ అఫీషియల్ పేరుతో ఉన్న ఈ అకౌంట్లో మార్చ్ 11 నాడు ఆ ఫోటో షేర్ చేసారు. ఈ పోస్ట్ ద్వారా ఇది హోసన్నా మినిస్టరీస్ యొక్క ‘47 వ ఇంటర్నేషనల్ ఫీస్ట్ అఫ్ తాబేర్నక్కల్’ అని అర్ధమైంది.

ది ఫీస్ట్ అఫ్ తాబేర్నక్కల్ నే గుడారాల పండగ అని కుడా అంటారు ఇది క్రైస్తవ మతస్థులు చేసుకునే పండగ, ఆంధ్ర ప్రదేశ్ లోని హోసన్నా మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తుంటారు, ఇది క్రైస్తవ మతానికి  సంభందించిన వ్యవస్థ, ఇది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ, ఇతరత్రా దాన కార్యక్రమంలో చేపడుతూ ఉంటుంది. 

ఇంకాస్త నిడివి గల వీడియోలో మనకి డ్రోన్ షాట్లు లు కనపడతాయి ఇందులో స్టేజీమీద, ఒక క్రాస్ సింబల్ ఉంటుంది, దాని పై హోసన్నా అని ఉన్నట్టు కుడా వీడియోలో ఉంది. ఈ వీడియోకి కుడా వేరే సౌండ్ ట్రాక్ ఉంది. 

(సౌజన్యం : ఇంస్టాగ్రామ్)


పైగా
యూట్యూబ్ లో కుడా “హోసన్నా మిస్టీరియస్ 47వ ఫీస్ట్ అఫ్ తాబేర్నక్కల్ హైలైట్స్ అని ఒక వీడియోని చూసాము, ఇది హోసన్నా మినిస్టరీస్ అఫీషియల్ ఛానల్ అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో కుడా వైరల్ వీడియో మరియు ఇంస్టాగ్రామ్ రీల్ లో ఉన్నట్టుగానే ఉంది. ఇందులో ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని గోరంట్ల అనే పల్లెటూరులో జరిగినట్టు ఉంది.

వైరల్ వీడియో మరియి హోసన్నా మినిస్టరీస్ ఆఫీషియల్ యూట్యూబ్ వీడియోకి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ యూట్యూబ్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)

హోసన్నా మినిస్టరీస్ ఆఫీషియల్ పేరుతో మేము ఉన్న ఒక ఫేస్బుక్ పోస్ట్ కుడా మాకు లభించింది. మార్చ్ 2 నాడు పబ్లిష్ అయిన ఈ పోస్టులో గోరంట్ల-గుంటూరు వద్ద ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అఫ్ తాబేర్నక్కల్ మార్చ్ 2024 గురించిన ప్రకటన ఉంది.

వైరల్ వీడియో ఎక్కడినుంచి వచ్చింది? 

వైరల్ వీడియోలో ఒక వాటర్ మార్క్ చూసాము, “ DEGITAL ????? ---SUBSCRIBE--- Follow @ Facebook, X, Instagram, and YouTube."అని ఉంది 

ఇంకాస్త వెతుకగా ఇదే వాటర్ మార్క్ తో ఉన్న ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ దొరికింది. ఈ అకౌంట్ లో ముందుగా కాస్త తక్కువ నిడివి ఉన్న ఈ వీడియోని హోసన్నా ఫెలోషిప్ అకౌంట్ పోస్ట్ చేసారు. ఈ వీడియోకి ఇతర సౌండ్ ట్రాక్ కుడా ఉంది.

ఈ పోస్టులో మనకి రాహుల్ గాంధీ ప్రచారం అని ఎక్కడ తెలుపకపోయినా, ఇతర యూజర్లు ఈ వీడియోని కట్ చేసేయి వేరే సౌండ్ ట్రాక్ పెట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. 

 

తీర్పు 

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఒక మతపరమైన మీటింగ్ ను తప్పుగా రాహుల్ గాంధీ కోసం జరిగిన ర్యాలీ లాగ షేర్ చేసారు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.