స్వీడిష్ పాఠశాలలో ఖచ్చితంగా రమదాన్ వేడుకలు జరుపుకోవాలని వచ్చిన కథనం ఫేక్

ద్వారా: క్రిస్టియన్ హాగ్
మార్చి 21 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
స్వీడిష్ పాఠశాలలో ఖచ్చితంగా రమదాన్ వేడుకలు జరుపుకోవాలని వచ్చిన కథనం ఫేక్

సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

పాఠశాలలలో రమదాన్ వేడుకలు జరుపుకోవాలి అంటూ ఎటువంటి అధికారిక ఉత్తర్వులు జారీ అవ్వలేదు. వైరల్ అవుతున్న కథనం ఫేక్.

క్లైమ్ ఐడి 565ad472

నేపధ్యం

మునిసిపల్ స్కూళ్లలో ఖచ్చితంగా రమదాన్ వేడుకలు జరుపుకోవాలి అనే శీర్షిక తో డాగెన్స్ నిహీటర్ అనే ఒక స్వీడిష్ వార్త పత్రికలో కథనం వచ్చింది అంటూ ఒక స్క్రీన్ షాట్ ని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో మార్చ్ 9, 2024 నాడు ఒక ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.  ఆ స్క్రీన్ షాట్ లో స్వీడిష్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించిన మోర్గాన్ జోహన్సన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు ఉంది. పైగా విద్యార్థులు ఈ వేడుకలలో పాల్గొనకపోతే మతం అనే సబ్జెక్టులో వారికి తక్కువ మార్కులు వస్తాయని, ఆ తరువాత పిల్లల తల్లిదండ్రులే వారికి ఇస్లాం మతం గురించి నేర్పే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. 

ఈ కథనం రాసే సమయానికి ఎక్స్ లో ఈ పోస్టుకు 100,000 పైగా వ్యూస్ ఉన్నాయి, అనేక మంది యూజర్లు ఈ కథనాన్ని నిజమని నమ్మి మోర్గాన్ గురించి, అతని పార్టీ గురించి, ముస్లింల గురించిన విషయాలపై కామెంట్లలో స్పందిస్తున్నారు.

అయితే ఈ కథనం ఫేక్.  డాగెన్స్ నిహీటర్ వార్త పత్రిక ఇలాంటి కథనాన్ని ఏమి ప్రచురించలేదు.

వాస్తవం ఏమిటి?

ఆ కథనం స్క్రీన్ షాట్ పై ఒక ఎక్స్ అకౌంట్ వాటర్ మార్క్ ని మేము గమనించాము. మా పరిశోధన ప్రకారం, మొదటిగా ఈ స్క్రీన్ షాట్ ని ఈ అకౌంట్ నుండి షేర్ చేశారు. పైగా ఈ కథనంలో కనిపించే ఫొటో కి శీర్షిక కానీ, ఆ ఫోటోగ్రాఫర్ పేరు కానీ ఏమి ఇవ్వలేదు. సాధారణంగా డాగెన్స్ నిహీటర్ పత్రికలో ఇలాంటి వివరాలు అన్నీ మనకి కనిపిస్తాయి. 


ఫేక్ ఆర్టికల్ స్క్రీన్ షాట్ లో ఎక్స్ అకౌంట్ పేరుని ఎరుపు రంగులో హైలైట్ చేశాము (సౌజన్యం : ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


ఈ కథనం కోసం డాగెన్స్ నిహీటర్ పత్రికలో వెతుకగా మాకు అలాంటి కథనం ఏమి లభించలేదు. పైగా స్వీడిష్ రిక్స్డాగ్ (స్వీడన్ శాసనసభ/పార్లమెంట్) లో కూడా దానికి సంబంధించి అలాంటి తీర్మానాలు తీసుకున్నట్టుగా మాకు ఏ విధమైన పత్రాలు లభించలేదు. రమదాన్ గురించి మొత్తం 19 తీర్మానాలు కనపడినప్పటికీ అందులో ఏ ఒక్కటి కుడా మోర్గాన్ జోహన్సన్ జారీ చేసినది కాదు. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ మోర్గాన్ జోహన్సన్ ని సంప్రదించగా ఆయన అలాంటి తీర్మానం ఏమి తీసుకోలేదని , ఇది పూర్తిగా కల్పితమని తెలిపారు. ఇప్పటిదాకా అలాంటి తీర్మానం ఏదీ రాలేదని, ఆయన ఈ విషయం గురించి తన ఉద్దేశాన్ని కుడా ఎప్పుడూ తెలపలేదని మాకు తెలియజేసారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ డాగెన్స్ నిహీటర్ పత్రికను కూడా సంప్రదించింది.

ఆ ఎక్స్ అకౌంట్ గతంలో కుడా కొన్ని వ్యంగ్య రచనలని స్వీడిష్ న్యూస్ పేపర్ కథనాలుగా షేర్ చేసింది. కానీ ప్రస్తుతం షేర్ అవుతున్న కధనాన్ని మాత్రం అనేక మంది వాస్తవం అనుకుని నమ్మారు.

తీర్పు

డాగెన్స్ నిహీటర్ పత్రిక రమదాన్ వేడుక గురించి వైరల్ అవుతున్న కథనాన్ని ప్రచురించలేదు. మోర్గాన్ జోహన్సన్ కుడా అలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదని లాజికల్లీ ఫ్యాక్ట్స్ కు నిర్ధారించారు. కనుక మేము ఈ క్లెయిమ్ ఫేక్ అని నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరస)

Read this article in English here

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , Svenska

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.