కూటమి మేనిఫెస్టోని ఆంధ్ర ప్రదేశ్ బిజేపీ అధ్యక్షులు విమర్శించారని బీబీసీ తెలుగు పేరు మీద వచ్చిన కథనం ఫేక్

ద్వారా: రోహిత్ గుత్తా
మే 8 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కూటమి మేనిఫెస్టోని ఆంధ్ర ప్రదేశ్ బిజేపీ అధ్యక్షులు విమర్శించారని బీబీసీ తెలుగు పేరు మీద వచ్చిన కథనం ఫేక్

తెలుగుదేశం-జనసేన మేనిఫెస్టోని ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు విమర్శించారని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఆంధ్ర ప్రదేశ్ బిజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదు. ఇది ఫేక్ అని బీబీసీ తెలుగు కూడా స్పష్టం చేసింది.

క్లైమ్ ఐడి 41726bd6

క్లైమ్ ఏంటి?

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి మిత్ర పక్షాలైణ తెలుగుదేశం, జన సేన విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోని తమ పార్టీ సభ్యులు విస్మరించాలని అన్నారని బీబీసీ తెలుగు వార్తా కథనం పేరు మీద ఒక ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. అలాగే పార్టీ సభ్యులు కేంద్రంలో బిజేపీ ప్రకటించిన మేనిఫెస్టోనే పరిగణలోకి తీసుకోవాలని అన్నారని ఇందులో ఉంది. 

ఈ వార్తా కథనం ప్రకారం, “చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఉన్నాయి. చంద్రబాబుకి ఇదే చివరి ఎన్నిక కావడంతో ప్రజలను మోసం చేసి, పీఠం ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీ శ్రేణులు కేంద్రంలో బిజేపీ ప్రకటించిన మేనిఫెస్టోనే పరిగణలోకి తీసుకోవాలి,” అని పురందేశ్వరి అన్నారని ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13 నాడు జరగనున్నాయి. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాగా, తెలుగు దేశం, జన సేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. 

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, పురందేశ్వరి అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. ఇది ఫేక్ ఫొటో.

మేము ఏమి తెలుసుకున్నాము?

పురందేశ్వరి చేశారు అని చెబుతున్న వ్యాఖ్యల గురించి వార్తా కథనాల కోసం చూశాము. అయితే మాకు ఏమీ దొరకలేదు. బీబీసీ ఇటువంటి కథనాన్ని ఏమన్నా ప్రచురించిందా అని వారి వెబ్సైట్, సామాజిక మాధ్యమాలలో చూశాము. అక్కడా ఏమీ లేదు.

అప్పుడు ఈ ఫొటోని క్షుణ్ణంగా పరిశీలించాము. ఈ ఫొటోలోని టెంప్లేట్ బీబీసీ సాధారణంగా వాడే టెంప్లేట్ ని పోలి ఉంది, కానీ ఇందులో అనేక లొసుగులు ఉన్నాయి. ‘మీరేమంటారు’ అనే పేరు మీద బీబీసీ ఈ టెంప్లేట్ మీద రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కానీ, లేదా ఏమైనా ప్రశ్నలు కానీ ప్రచురించి, తమ సామాజిక మాధ్యమ అకౌంట్ లలో పోస్ట్ చేసి, ఆ వ్యాఖ్యల మీద యూజర్ల అభిప్రాయం, ఆ ప్రశ్నలకి యూజర్ల జవాబులు అడుగుతూ ఉంటుంది.

ఒరిజినల్ బీబీసీ టెంప్లేట్ లో ‘మీరేమంటారు’ అనే పదం ఎడమ వైపున ఉంటుంది. అయితే వైరల్ ఫొటోలో ఇది మధ్యలో ఉంది. అలాగే రెండిటి ఫాంట్ కూడా వేరు. బీబీసీ తెలుగు టెంప్లేట్ ఫాంట్ మరింత మందంగా ఉంటుంది. అలాగే ఒరిజినల్ టెంప్లేట్ లోని బీబీసీ తెలుగు లోగో వైరల్ దాంట్లో కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది. 

వైరల్ పోస్ట్ లో వాడిన టెంప్లేట్, బీబీసీ తెలుగు ఒరిజినల్ టెంప్లేట్ మధ్య తేడాలు (సౌజన్యం: ఫేస్బుక్/బీబీసీ తెలుగు/స్క్రీన్ షాట్స్)

ఈ ఫొటో ఫేక్ అని బీబీసీ తెలుగు కూడా తన సామాజిక మాధ్యమ అకౌంట్ లలో (ఆర్కైవ్ ఇక్కడ) స్పష్టం చేసింది. “ఇది బీబీసీ ప్రచురించింది కాదు. ఇది ఫేక్ న్యూస్!,” అని వారు తెలిపారు.

బీబీసీ తెలుగు వివరణ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/బీబీసీ న్యూస్ తెలుగు)

తెలుగుదేశం-జనసేన మేనిఫెస్టో మీద వివాదం

ఎన్ డి టి వి లో వచ్చిన ఒక కథనం ప్రకారం, తెలుగుదేశం- జనసేన ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టో మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బొమ్మలు ఉన్నాయి కానీ, బిజేపీకి చెందిన ఏ నాయకుని బొమ్మ లేదు. 

ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, ఏప్రిల్ 30 నాడు తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు, ఆంధ్ర ప్రదేశ్ బిజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో కలిసి ఈ మేనిఫెస్టోని పట్టుకుని ఫొటో దిగటానికి నిరాకరించారు. దీనితో బిజేపీ ఈ మేనిఫెస్టోతో సంబంధం లేదు అని సంకేతాలు ఇస్తున్నది అన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ, “అయోమయానికి గురి కాకండి. ఇది తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో. తెలుగుదేశం-జనసేన తమ మేనిఫెస్టోని విడుదల చేశాయి. దానికి మద్ధతుగా నేను ఇక్కడ ఉన్నాను,” అని సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. 

ఇదే కథనం ప్రకారం, ఈ కార్యక్రమంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో బిజేపీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది అని, రాష్ట్ర మేనిఫెస్టోకి తన సూచనలు ఇచ్చింది అని, వాటిని ఇందులో పొందుపరిచాము అని తెలిపారు. ఆ తరువాత, బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్ర ప్రదేశ్ సమన్వయకర్త అర్జున్ సింగ్ ఈ మేనిఫెస్టోకి ఒక ఎక్స్ పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ ) ద్వారా తమ మద్దతు తెలిపారు.

తీర్పు

ఒక ఫేక్ బీబీసీ తెలుగు వార్తా కథనం షేర్ చేసి, ఆంధ్ర ప్రదేశ్ బిజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి కూటమి మేనిఫెస్టోని తిరస్కరించమని తమ కార్యకర్తలకి తెలిపారని క్లైమ్ చేశారు. అయితే, తను అటువంటి వ్యాఖ్యా చేయలేదు, ఈ కథనాన్ని బీబీసీ ప్రచురించనూ లేదు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్) 

 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.