ఒక స్టాక్ మార్కెట్ వేదికని ప్రొమోట్ చేయడానికి ముకేష్ అంబానీ డీప్ ఫేక్ వీడియో సర్కులేట్ చేశారు

ద్వారా: రాహుల్ అధికారి
మార్చి 6 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒక స్టాక్ మార్కెట్ వేదికని ప్రొమోట్ చేయడానికి ముకేష్ అంబానీ డీప్ ఫేక్ వీడియో సర్కులేట్ చేశారు

ముకేష్ అంబానీ స్టాక్ మార్కెట్ సూచనలు ఇచ్చే ఒక వేదికని ప్రొమోట్ చేస్తున్నారంటూ క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

‘2024 వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ లో ముకేష్ అంబానీ మాట్లాడిన వీడియోని ఎడిట్ చేసి ఒక స్టాక్ మార్కెట్ వేదికని ప్రొమోట్ చేస్తున్నట్టు తయారు చేశారు.

క్లైమ్ ఐడి b237091f

క్లైమ్ ఏంటి?

ముకేష్ అంబానీ ఒక స్టాక్ మార్కెట్ సూచనల వేదికని ప్రొమోట్ చేస్తునట్టున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. “స్టాక్ మార్కెట్ లో తాజాగా బాగా లాభాలు అందిస్తున్న స్టాక్ ల” గురించి సమాచారం అందించే ఒక స్టాక్ మార్కెట్ సమాచార వేదికని తను ప్రారంభిస్తునట్టు తాను చెబుతున్నట్టు ఈ వీడియోలో ఉంది. “స్టాక్ లలో పెట్టుబడి ద్వారా సంపాదన, ఎటువంటి స్టాక్ లని ఎంచుకోవాలి, ఆర్థికపరమైన రక్షణ కలిగిన వ్యూహాలు, స్టాక్ లలో పెట్టుబడి పెట్టగలిగే నైపుణ్యాలు. పెట్టుబడి సలహాలు మేము మీకు నేర్పుతాము. మార్కెట్ ని విశ్లేషించడానికి మాతో పనిచేస్తున్న ఒక ప్రొఫెషనల్ బృందం మీకు సహాయపడుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించిన మదుపరులు కూడా మీకు సహాయపడతారు. మీకు స్టాక్ మార్కెట్ అర్థమయ్యిందా? మా వేదికలో చేరండి,” అని తాను ఈ వీడియోలో చెప్పడం మనం వినవచ్చు.

‘Evercore 2’ అనే ఫేస్బుక్ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది. 3500 కి పైగా లైక్స్ కూడా వచ్చాయి ఈ పోస్ట్ కి. 3500 కి పైగా లైక్స్ కూడా వచ్చాయి. ‘స్టాక్ మార్కెట్ లో లాభాల’ కోసం ‘స్టాక్ గురు’ అనే గ్రూప్ లో చేరండి అనే శీర్షిక పెట్టారు ఈ వీడియోకి. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది డీప్ ఫేక్ వీడియో.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వైరల్ వీడియోలో న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ లోగో ఉంది. అలాగే పోడియం నుండి మాట్లాడుతున్న అంబానీ వెనుక బ్యానర్ మీద ‘వైబ్రంట్ గుజరాత్ 10-12 జనవరి’ అని కూడా ఉంది. వీటి ద్వారా అంబానీ మాట్లాడుతున్న ఒరిజినల్ వీడియోని ఏఎన్ఐ వారు జనవరి 10 నాడు తమ అధికారిక యూట్యూబ్ చానల్ లో షేర్ చేశారని తెలుసుకున్నాము. 

వైరల్ వీడియో, ఒరిజినల్ క్లిప్ మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ వీడియోలో అంబానీ జనవరి 10-12 మధ్య గుజరాత్ లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడుతున్నారు. ఆ సమ్మిట్ లో తాను గుజరాత్ లో వ్యాపారాభివృద్ధి గురించి, ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడారు. ఇందులో స్టాక్ మార్కెట్ వేదిక గురించి ఏమీ లేదు. దాని బట్టి వైరల్ వీడియో ఎడిటెడ్ వీడియో అని మాకు అర్థమయ్యింది. ఏఎన్ఐ వీడియోలో ఒక భాగాన్ని వాడుకుని డీప్ ఫేక్ వీడియో చేశారని మాకు అర్థమయ్యింది. 

దూరదర్శన్ కూడా ఈ వీడియోని జనవరి 10 నాడు తమ అధికారిక యూట్యూబ్ అకౌంట్ లో షేర్ చేసింది. “వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో మాట్లాడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్” అనేది ఈ వీడియో శీర్షిక.

ఇది కృత్రిమ మేధా ద్వారా తయారుచేసిన వీడియో అని మేమెలా తెలుసుకున్నాము?

అంబానీ పెదాల కదలికకి, ఆడియోకి పొంతన కుదరటం లేదు. అలాగే ఇందులో అంబానీ స్వరం తన నిజ జీవిత స్వరం లాగా లేదు. అలాగే పెదాలు, నాలుక కదలికలు కూడా వింతగా ఉన్నాయి. దీని బట్టి ఇది కృత్రిమ మేధ ద్వారా చేసిన వీడియో అని అర్థమావుతున్నది.

అలాగే లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ వీడియోని Itisaar అనే యాప్ లో పరిశీలించింది. ఈ యాప్ ని ఐఐటి జోధ్ పూర్ ఆచార్యులు మయాంక్ వత్స మరియు రిచా సింగ్ అభివృద్ధి చేశారు. ఇందులో ఈ వైరల్ వీడియో ఫేక్ అని కాన్ఫిడెన్స్ స్కోర్ 1 తో నిరూపితం అయ్యింది. కాన్ఫిడెన్స్ స్కోర్ 1 అంటే అత్యున్నత స్కోర్ అని. అంటే ఇది పూర్తిగా ఫేక్ వీడియో అని.

డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పే స్కామ్ పధకాలు, అబద్ధపు ఆన్లైన్ పెట్టుబడి పధకాలు ఈ మధ్య ఇటువంటి డీప్ ఫేక్ వీడియోలని బాగా వాడుతున్నాయి. దాని గురించి మీరు మరింత ఇక్కడ చదవొచ్చు.

తీర్పు

ముకేష్ అంబానీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్న వీడియోని వాడి తయారుచేసిన డీప్ ఫేక్ వీడియో ఇది. ఒరిజినల్ వీడియోలో అంబానీ ఎటువంటి స్టాక్ మార్కెట్ వేదికని ప్రొమోట్ చేయలేదు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.