ఎడిటెడ్ వీడియోని తెలుగు ఇన్ఫ్లూయెన్సర్లు బీఆర్ఎస్ వ్యతిరేక పాటకి డ్యాన్స్ చేస్తున్నట్టుగాషేర్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
నవంబర్ 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎడిటెడ్ వీడియోని తెలుగు ఇన్ఫ్లూయెన్సర్లు బీఆర్ఎస్  వ్యతిరేక పాటకి డ్యాన్స్ చేస్తున్నట్టుగాషేర్ చేశారు

సామాజిక మాధ్యమాలలో వచ్చిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఒరిజినల్ వీడియోలో ఈ ఇన్ఫ్లూయెన్సర్లు బీఆర్ఎస్ ప్రచార పాటకి డ్యాన్స్ వేస్తున్నారు.

క్లైమ్ ఐడి 7fa86276

క్లైమ్ ఏమిటి?

తెలంగాణలో నవంబర్ 30 నాడు జరగనున్న శాసనసభ ఎన్నికలకి ప్రచారం ఊపందుకుంటున్న నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం అంతే వేగంగా వ్యాప్తి చెందుతున్నది.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన ఇన్ఫ్లూయెన్సర్లు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక దొంగ అంటున్నారంటూ క్లైమ్ చేస్తూ ఈ వీడియోలని షేర్ చేస్తున్నారు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒక యూజర్ నవంబర్ 4 నాడు ఈ రెండు వీడియోలని షేర్ చేసి “టాలీవుడ్ ఇన్ఫ్లూయెన్సర్స్ కేసీఆర్ ఒక దొంగ అంటూ కాంగ్రెస్ కి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు”, అనే శీర్షిక పెట్టారు. మొదటి వీడియోలో ఒక జంట “గులాబీ దొంగలే, గులాబీ దొంగలే, గులాబీ దొంగలే, కల్వకుంట్ల దొంగలే” అంటూ ఉన్న ఒక పాటకి డ్యాన్స్ వెయ్యటం మనం చూడవచ్చు. రెండవ వీడియోలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అదే పాటకి డ్యాన్స్ వెయ్యటం చూడవచ్చు. రెండవ వీడియోలో ఇతర డ్యాన్స్ వీడియోకి సంబంధించిన క్లిప్ లని కూడా చేర్చారు. 

ఈ ఎక్స్ పోస్ట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ రాసే సమయానికి 45000 వ్యూస్ ఉన్నాయి. ఈ ట్వీట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. ఇవే వీడియోలని కాంగ్రెస్ మద్ధతుదారులు కూడా ఇదే క్లైమ్ తో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. 

ఎడిట్ చేసిన వీడియోలని షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ రెండు వీడియోలు కూడా డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియోలు.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోల కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికాము. ఇందులో మొదటి వీడియోని యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లలో నవంబర్ 3, 2023 నాడు షేర్ చేశారని తెలుసుకున్నాము. ఈ పోస్ట్ లో వీడియోలో తనతో డ్యాన్స్ చేస్తున్న ‘సుప్రీత_9’ అనే వ్యక్తిని ట్యాగ్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం సుప్రీత ఒక ఆర్టిస్ట్. 

నవంబర్ 3 నాడు నిఖిల్ విజయేంద్ర సింహా పోస్ట్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/nikhilvijayendrasimha) 

నిఖిల్ పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోలో వాళ్ళు ఏ పాటకి డ్యాన్స్ వేస్తున్నారనేది మనం స్పష్టంగా వినవచ్చు. ఇది వైరల్ వీడియోలో ఉన్న పాట కాదు. వాళ్ళు డ్యాన్స్ వేస్తున్న పాట “గులాబీ జెండాలే రామక్కా, గుర్తులే గుర్తుంచుకో రామక్క”. ఇది బీఆర్ఎస్ పార్టీ వారి ప్రచార పాట.

అలాగే వైరల్ వీడియోలో ఈ జంట పెదాల కదలిక కూడా వెనుక వస్తున్న పాటకి సరితూగడం లేదు. దీనిబట్టి కూడా ఇది ఎడిటెడ్ వీడియో అని చెప్పవచ్చు.

వైరల్ పోస్ట్ లో ఉన్న రెండో వీడియోని యూట్యూబర్ మరియు యాంకర్ అయిన లాస్య మంజునాథ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మొదటిసారిగా నవంబర్ 3 నాడు పోస్ట్ చేశారు. ఇందులో కూడా మనకి వినిపిస్తున్న పాట పైన చెప్పుకున్న ప్రచార పాటనే. 

లాస్య మంజునాథ్ నవంబర్ 3 నాడు తన ఇన్స్టాగ్రామ్  అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/lasyamanjunath)

అలాగే, ఈ వీడియోలు షేర్ చేసినప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ అనుకూల హ్యాష్ ట్యాగ్ లు పెట్టారు. దీనిబట్టి కూడా వీళ్ళు బీఆర్ఎస్ అనుకూల పాటకి డ్యాన్స్ వేస్తున్నారు అనేది స్పష్టం.

టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఒక కథనం ప్రకారం తెలంగాణ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం యూట్యూబర్లని, ఇన్ఫ్లూయెన్సర్లని, టీవీ నటులని రంగంలోకి దింపాయి.

తీర్పు

బీఆర్ఎస్ కి అనుకూలంగా డ్యాన్స్ చేస్తున్న రెండు వీడియోలని ఎడిట్ చేసి అందులో ఉన్న వారు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా డ్యాన్స్ చేస్తున్నారు అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.