ఫేక్ వార్తా కథనాలు షేర్ చేసి వైజాగ్ మాదకద్రవ్యాల కేసులో చంద్రబాబు, లోకేష్ నిందితులు అని క్లైమ్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
మార్చి 29 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఫేక్ వార్తా కథనాలు షేర్ చేసి వైజాగ్ మాదకద్రవ్యాల కేసులో చంద్రబాబు, లోకేష్ నిందితులు అని క్లైమ్ చేశారు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్లు (సౌజన్యం : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

వైరల్ పోస్ట్స్ లోని కథనాలు డిజిటల్ గా ఎడిట్ చేసినవి. ఈ కేసుకి సంబంధించి చంద్రబాబుని కానీ లోకేష్ ని కానీ సీబీఐ నిందితులుగా పేర్కొనలేదు.

క్లైమ్ ఐడి 70fb8aef

క్లైమ్ ఏంటి?

వైజాగ్ మాదక ద్రవ్యాల కేసుకి సంబంధించి సీబీఐ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లని నిందితులుగా పేర్కొన్నదని ఉన్న వార్తా కథనాల ఫొటోలని సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. 

మార్చ్ 21 నాడు సీబీఐ వైజాగ్ పోర్టు నుండి 25000 కిలోల కొకైన్ కలిపి ఉన్న డ్రై ఈస్ట్ ని జప్తు చేసింది. ఈ ఘటన అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య ఆరోపణల యుద్ధానికి దారి తీసింది. ఈ ఘటనతో సంబంధం ఉందని ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. 

ఈ నేపధ్యంలో, ఈ ఘటనకి చంద్రబాబు, లోకేష్ లకి సంబంధం ఉందని వే2న్యూస్, ప్రజాశక్తి కథానాలు ప్రచురించాయి అని చెబుతూ సామాజిక మాధ్యమాలలో ఈ కథానాల ఫొటోలు వైరల్ అయ్యాయి. “విశాఖ డ్రగ్స్ కేసులో నారా లోకేష్” శీర్షికన వే2న్యూస్ కథనం ఉంది. ఇందులో తాను, తన భార్య బ్రాహ్మిణి, ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకులు దామచర్ల సత్యనారాయణ కలిసి దిగిన ఫొటో ఒకటి జత చేశారు. ఈ కేసులో సీబీఐ దామచర్ల సత్యనారాయణని ఏ2 గా చేర్చింది అని, తను నారా లోకేష్ కి బాగా తెలుసునని ఉంది. 

అలాగే, “విశాఖ డ్రగ్స్ కేసులో చంద్రబాబు గ్యాంగ్” అనే శీర్షికతో ఉన్న ప్రజాశక్తి వార్తా కథనాన్ని కూడా షేర్ చేశారు. ఇందులో ఫలానా ఫలానా వారు ఏ1 అని అలా ఏ8 వరకు పేర్లు ఇచ్చారు. 

ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 


ప్రజాశక్తి కథనం అంటూ షేర్ చేసిన కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ రెండు వార్తా కథనాలు ఫేక్. చంద్రబాబు లేదా నారా లోకేష్ ని సీబీఐ నిందితులుగా పేర్కొనలేదు. 

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వార్తా కథనాలని నిజంగా ప్రచురించారా అని మొదట చూశాము. వీటి గురించి వే2న్యూస్, ప్రజాశక్తిలో వెతికాము. మాకు ఈ కథనాలు లభించలేదు. 

వే2న్యూస్ కథనంలో ఇచ్చిన లింక్ వేరే కథనానికి సంబంధించినది. ఈ లింక్ తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో ఉప కులపతుల నియామకానికి సంబంధించినది. 


వైరల్ కథనం, ఒరిజినల్ కథనం మధ్య పోలికలు (సౌజన్యం: ఫేస్బుక్/వే2 న్యూస్)

తమ ప్లాట్ఫాం ని తప్పుడు సమాచారం వ్యాప్తి కోసం ఉపయోగిస్తున్నారు అని వే2న్యూస్ తాము ఏ కథనాన్ని అయిన ప్రచురించామో లేదో పాఠకులు తెలుసుకోవటానికి ఈ లింక్ ఆప్షన్ ఇచ్చారు. వే2 న్యూస్ పేరు మీద ఇంతక ముందు సర్కులేట్ చేసిన ఫేక్ కథానాలని మేము ఇంతకముందు కూడా డీబంక్ చేశాము. కొన్నిటిని ఇక్కడ మరియు ఇక్కడ చదవండి.

వైరల్ స్క్రీన్ షాట్, ఒరిజినల్ ప్రజాశక్తి పత్రిక మధ్య పోలికలు చూస్తే అనేక లొసుగులు కనిపించాయి. వైరల్ స్క్రీన్ షాట్ లో ఈ కథనం పైన ఉన్న వాక్యాలు మార్చ్ 22 నాడు ప్రజాశక్తిలో వచ్చిన ఒక వార్తా కథనంలోనివి. అయితే ప్రజాశక్తి నలుపు- తెలుపు రంగులో ఉంటే, ఈ వైరల్ స్క్రీన్ షాట్ రంగులలో ఉంది. ‘విశాఖ డ్రగ్స్ కేసులో చంద్రబాబు గ్యాంగ్’ అనే పేరు మీద ప్రజాశక్తి ఎటువంటి కథనం ప్రచురించలేదు. 


వైరల్ కథనం, ఒరిజినల్ ప్రజాశక్తి కథనం మధ్య పోలికలు (సౌజన్యం: ఫేస్బుక్/ప్రజాశక్తి)

ఈ కేసుకి సంబంధించి సీబీఐ విచారణ జరుపుతున్నది. ఈ కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ లో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ని మాత్రమే ఏ1 నిందితులుగా చేర్చారు. ఏ2 అనే చోట గుర్తు తెలియని వ్యక్తులు అని మాత్రమే ఉంది. 

తెలుగుదేశానికి ఈ కేసుకి సంబంధం ఉందనే క్లైమ్ ఈ కేసుతో సంబంధం ఉన్న కారణంగా దామచర్ల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని రాశాడు అని సృష్టించిన ఫేక్ లేఖ సర్కులేట్ అయిన తర్వాత వచ్చింది. అయితే సత్యనారాయణ అటువంటి లేఖ ఏదీ రాయలేదు అని తెలుగుదేశం ఎక్స్ లో స్పష్టం చేసింది. 

తీర్పు 

ఎడిట్ చేసిన వార్తా కథనాలు షేర్ చేసి వైజాగ్ మాదక ద్రవ్యాల కేసులో సీబీఐ చంద్రబాబు, లోకేష్ లని నిందితులుగా చేర్చింది అని క్లైమ్ చేశారు. అయితే అటువంటి కథానాలని ఈ సంస్థలు ప్రచురించలేదు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.