ఆంధ్ర ముఖ్య మంత్రి జగన్, ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకున్నట్టుగా ఎడిట్ చేసిన ఫోటో షేర్ చేసారు

ద్వారా: రాజేశ్వరి పరస
ఫిబ్రవరి 19 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ముఖ్య మంత్రి జగన్, ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకున్నట్టుగా ఎడిట్ చేసిన ఫోటో షేర్ చేసారు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఒరిజినల్ ఫోటోలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాజీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ కాళ్ళు పట్టుకున్నారు

క్లైమ్ ఐడి db837648

క్లెయిమ్ ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈమధ్య కలంలో ఫిబ్రవరి 9 నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీని న్యూ ఢిల్లీలో కలుసుకుని, ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన విషయాల గురించి చర్చించారు. ఇంకొన్ని నెలలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు కుడా సిద్ధమవుతుంది.

ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీ కాళ్ళను పట్టుకున్నట్టు ఒక ఫోటో ప్రచారం అవుతుంది. ఈ ఫోటో ని షేర్ చేస్తూ, కొందరు యూజర్లుఅసభ్య కార భాషను వాడి, జగన్ కడప కి చెందిన వాడు అని, ఎవరికీ వంగడు అని అంటారు కదా మరి ఇప్పుడు చుడండి అంటూ వ్యంగంగా శీర్షిక పెట్టి షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.


సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ ఈ ఫోటో ఫేక్. నిజమయినది కాదు. 

మేము ఏమి కనుగొన్నము?

చూడగానే మనకి వెంటనే అనుమానం కలిగించే విషయం, ఆ ఫొటోలో మోడీ తల భాగం, మిగితా శరీరం తో పోల్చుకుంటే, ఇది పెద్దదిగా కనిపిస్తుంది. ఒకవైపు ఆయన తల పక్కన ఉన్న భాగం కుడా మసకబారి ఉంది, దీని వలన ఇది వేరే ఫోటో నుండి తీసి అతికించి ఉండొచ్చు అనే అనుమానం కలుగుతుంది.

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, ది న్యూ ఇండియన్ ఎక్సప్రెస్ ఫిబ్రవరి 23, 2023 నాడు ప్రచురించిన ఒక కథనంలో ఒరిజినల్ ఫోటో లభ్యమైంది. ఈ ఫోటోలో జగన్, అప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ కి గవర్నర్ గా సేవలు అందించి బదిలీ అవుతున్న బిస్వ భూషణ్ హరిచందన్ కాళ్ళు పట్టుకున్నారు. ఈ ఫోటో కి శీర్షికగా, ముఖ్యమంత్రి, బదిలీ అవుతున్న గవర్నర్ హరిచందన్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్తున్నాడు అని పేర్కొని ఉంది. వైరల్ అవుతున్న ఫోటోని మరియు ఒరిజినల్ ఫోటోని మనం పోల్చి చూస్తే, వీటిలో చాలా అంశాలు ఒకే లాగ ఉన్నాయి, వెనుక ఉన్న బండి, పక్కన ఉన్న ఆఫీసర్ల మోహము ఇలాగ.


వైరల్ ఫోటో కి మరియు ది న్యూ ఇండియన్ ఎక్సప్రెస్ ఫోటో కి మధ్య పోలిక (సౌజన్యం : ఫేస్బుక్/ ది న్యూ ఇండియన్ ఎక్సప్రెస్ స్క్రీన్ షాట్)

మరో వార్త వెబ్సైటు, లోకమాత్ న్యూస్ కుడా ఒరిజినల్ ఫోటోని పబ్లిష్ చేసి, ఈ ఫోటోని జివిఎస్ రమణ అనే ఒక ది హిందూ పత్రిక కి సంబంధించిన పాత్రికేయుడికి కి జత చేసారు. 

ఒడిశా టివి అనే ఒక న్యూస్ ఛానల్ కుడా తమ యూట్యూబ్ లో ఈ సంఘటనకు చెందిన వీడియోని ఫిబ్రవరి 22, 2023 నాడు అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో జగన్ మాజీ గవర్నర్ ని పలకరిస్తూ, అయన కాళ్ళు పట్టుకోవటం మనం చూడవచ్చు. మరో యూట్యూబ్ ఛానల్ యో యో టివి కుడా ఈ వీడియోని అప్లోడ్ చేసింది, ఇందులో 1:09 టైం స్టాంప్ వద్ద, జగన్ హరిచందన్ కాళ్ళు పట్టుకోవటం మనం చూడవచ్చు.

తీర్పు:

ఫిబ్రవరి 2023 లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ గవర్నర్ బిస్వా భూషణ్ హరిచందన్ ఉన్న ఫోటో ని ఎడిట్ చేసి, ఆంధ్ర ముఖ్య మంత్రి ప్రధాని కాళ్ళు పట్టుకున్నట్టు గా మార్చారు. కనుక మేము దీనిని ఫేక్ అని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

Read the fact check in English here.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.