లేదు, క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పాట్ కమిన్స్ అహ్మదాబాద్ లోని వీక్షకులను విమర్శించలేదు

ద్వారా: వివేక్ జె
నవంబర్ 22 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
లేదు, క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పాట్ కమిన్స్ అహ్మదాబాద్ లోని వీక్షకులను విమర్శించలేదు

వైరల్ పోస్ట్‌ల స్క్రీన్‌ షాట్స్. (సౌజన్యం: X//లాజికల్లీ  ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అహ్మదాబాద్ లోని క్రికెట్ వీక్షకులని విమర్శిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అతను అన్నట్లుగా ప్రచారం అవుతున్న వ్యాఖ్యలు ఫేక్.

క్లైమ్ ఐడి 092cade3

క్లెయిమ్ ఏమిటి?


ఇటీవల అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19నాడు జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు టీమ్ ఇండియాను ఓడించింది. ఈ నేపధ్యంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నట్టుగా సామాజిక మాధ్యమాలలో కొన్ని వ్యాఖ్యలు సర్కులేట్ అవుతున్నాయి. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో అలాంటి ఒక పోస్ట్ ని ఈ శీర్షికతో రాసి షేర్ చేసారు, “భారతదేశంలో వీక్షకులు సాధారణంగా అద్భుతంగా ఉంటారు, కానీ అహ్మదాబాద్‌లో ఆలా లేరు, వారు మొదటి మ్యాచ్‌లో కూడా బాబర్‌ పై అరిచారు. మేము చివరి మ్యాచ్‌లో వీళ్ళ నోరు మూగబోయేలా చేయాలనుకున్నాం.అలాగే చేశాము.” ఇలాంటి పోస్ట్‌ల ఆర్కైవ్‌లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు

 

వైరల్ పోస్ట్‌ల స్క్రీన్‌ షాట్స్. (సౌజన్యం: X//లాజికల్లీ  ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, కమిన్స్ అహ్మదాబాద్ వీక్షకుల గురించి కానీ, మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం గురించి కానీ ప్రస్తావించలేదని మేము కనుగొన్నాము.

వాస్తవం ఏమిటి?

ఆస్ట్రేలియన్ కెప్టెన్ అహ్మదాబాద్ లోని వీక్షకులని విమర్శించినట్టుగా ఏమైనా వార్త కథనాలు ఉన్నాయా అని మేము వెతికాము.  అటువంటి కథనాలు ఏమి లభించలేదు.

ఆ తరువాత, మేము ప్రపంచ కప్ ఫైనల్స్‌కు సంబంధించి కమిన్స్ ఇచ్చిన అన్ని ప్రీ-మ్యాచ్ మరియు పోస్ట్-మ్యాచ్ ఇంటర్వ్యూలను చూసాము

ప్రపంచ కప్ ఫైనల్ లో భారతీయ వీక్షకులతో మెలగడం గురించి కమిన్స్ తన ప్రణాళికను బయటపెట్టాడు అంటూ, నవంబర్ 18, 2023 నాడు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ ఆస్ట్రేలియన్ స్కిప్పర్ మాట్లాడుతూ, “రాబోయే ఆటలో కచ్చితంగా అక్కడ ఉన్న వీక్షకులు ఏకపక్షంగానే ఉంటారు, అలాంటి సమయంలో మా ఆటతో వారందరిని మౌనంగా ఉంచితే అంతకన్నా సంతృప్తి ఉండదు. అదే రేపటి మా లక్ష్యం కూడా. ఆఖరి మ్యాచ్ లోని ప్రతి విషయాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాము. రానున్న మ్యాచ్ లో ఖచ్చితంగా గోల ఉంటుంది, ఆసక్తి గల వాళ్ళూ ఉంటారు, వారందరిని చూసి మేము కంగారు పడకూడదు, దానికి సంసిద్ధంగా ఉండాలి మరియు దానిని ప్రేమించాలి కుడా.”

ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు జరిగిన విలేఖరుల సమావేశంలో కమిన్స్ ఈ విధంగా మాట్లాడారు. స్టార్ స్పోర్ట్స్ కుడా ఈ సమావేశాన్ని తమ యూట్యూబ్ చానల్ లో షేర్ చేసింది, అక్కడ కుడా అదే విషయాన్ని కమిన్స్ చెప్పటం మనం చూడవచ్చు. దీనిని కనుక పరీశీలిస్తే ఇక్కడ కమిన్స్, అహ్మదాబాద్ వీక్షకులను విమర్శించటం కానీ, అజాం గురించి ప్రస్తావించటం కానీ చెయ్యలేదని మనకి అర్థమవుతున్నది. 

మేము మరొక పోస్ట్-మ్యాచ్ వీడియోను OTT ప్లాట్‌ఫారమ్ అయిన డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూశాము.  అక్కడ కమిన్స్ ప్రెజెంటర్ మరియు మాజీ భారత క్రికెటర్ రవిశాస్త్రితో మాట్లాడాడు. ఇక్కడ రవి శాస్త్రి కమ్మిన్స్ ని, 125,000 మంది వీక్షకుల మధ్య ఆడటం ఎలా ఉంది అని అడగగా, ‘అద్భుతంగా’ ఉంది అని కమ్మిన్స్ సమాధానం ఇచ్చాడు. ఇంకా మాట్లాడుతూ, “ఒకటి రెండు సార్లు చాలా గట్టిగా అరిచారు అనిపించింది, అయినా కూడా అది అద్భుతంగా ఉంది. కాని ఇక్కడ జననానికి ఉన్న ఆసక్తి ప్రపంచం లోనే ఎదురులేనిది.”

పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ లో కమ్మిన్స్ వాళ్ళ విజయం గురించి మాట్లాడారు కానీ, అక్కడ ఉన్న వీక్షకులను తక్కువ చేసి మాట్లాడలేదు. ఇదే సమయంలో ఒక పాత్రికేయుడు, విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడం గురించి అడగగా, “మేము ఒక్క క్షణం తీసుకుని వీక్షకుల మౌనాన్ని గమనించాము. మాకు ఇది తాను మాములుగా సెంచరీ స్కోర్ చేసినప్పటి రోజు లాగానే భావించాము. అయితే అది చాలా సంతృప్తినిచ్చింది అని మాత్రం చెప్పాలి.”

క్రికెట్ వరల్డ్ వెబ్‌సైట్‌లో, కమ్మిన్స్ మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన పూర్తి వీడియోని ట్రాన్స్క్రిప్టు తో సహా పొందుపరిచారు. అనేక మంది ఈ వీడియోని యూట్యూబ్ లో కుడా షేర్ చేశారు.

తీర్పు

ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత అహ్మదాబాద్ లోని వీక్షకులని పాట్ కమ్మిన్స్ విమర్శించలేదు. అలాగే పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం గురించి కుడా అయన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ లలో ప్రసంగించలేదు. సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వ్యాఖ్యలు ఫేక్. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.