రైల్వే వ్యవస్థ లో కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ నియామకాలు అని వైరల్ అవుతున్న వార్త ఫేక్

ద్వారా: రాజేశ్వరి పరస
మార్చి 1 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రైల్వే వ్యవస్థ లో కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ నియామకాలు అని వైరల్  అవుతున్న వార్త ఫేక్

సామాజిక మాధ్యమాలలో మరియు వార్త కథనాలతో వచ్చిన ప్రకటన (సౌజన్యం : ఎక్స్/న్యూస్ 18, లైవ్ మింట్, జీ న్యూస్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ఎడిటింగ్ )

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ భారతీయ రైల్వే అధికారులు వైరల్ అవుతున్న ప్రకటన కల్పితమయినది అని తెలిపారు.

క్లైమ్ ఐడి c08d3dd8

క్లెయిమ్ ఏమిటి?

కొంత మంది సోషల్ మీడియా యూజర్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగ ప్రకటన చేసారు అంటూ ఒక నోటీసును వైరల్ చేసారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది రైల్వే ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఈ వైరల్ ప్రకటన, ఆర్ ఆర్ బి ఇచ్చినట్టుగా ఉంది, ఆర్ ఆర్ బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇది రైల్వేలో ఉద్యోగ నియామకాల గురించి చూసుకుంటుంది. ఈ ప్రకటనలో భారత ప్రభుత్వం పేరు మీద రైల్వే వారి పేరు మీద ఉంది.

ఈ ప్రకటన, ఫేస్బుక్ మరియు ఎక్స్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాలలో షేర్ చేయబడుతుంది. వాటి ఆర్కైవ్ చేసిన లింకులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ పోస్టులలో 4,208 కానిస్టేబుల్ పోస్ట్లు మరియు 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసారని వీటికి దరఖాస్తులు ఏప్రిల్ 15 నుండి మే 14 వరకు చేయొచ్చని ఉంది. ఈ విషయాన్ని అనేక వార్త సంస్థలు కుడా ప్రచురించాయి, న్యూస్18, లైవ్ మింట్, జీ న్యూస్ లాంటి సంస్థలు కుడా ప్రచురించాయి.



సామాజిక మాధ్యమాలలో మరియు వార్త కథనాలతో వచ్చిన ప్రకటన (సౌజన్యం : ఎక్స్/న్యూస్ 18, లైవ్ మింట్, జీ న్యూస్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ఎడిటింగ్ )


అయినప్పటికీ ఈ వైరల్ అవుతున్న వార్త నిజం కాదు. 

మేము ఏమి కనుగొన్నము?

ఈ ప్రకటన నిజమయినదో కాదో అని ఆర్ ఆర్ బి వెబ్సైటులో వెతికాము, ఇక్కడ అన్ని రైల్వే నియామకాల గురించి అధికారిక ప్రకటనలు ఉంటాయి. కానీ ఈ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల గురించి మాత్రం మాకు ఎటువంటి ప్రకటన లభించలేదు.

వైరల్ నోటిఫికేషన్ లో ఉన్న సీరియల్ నెంబర్లు, ‘CEN no.1/2024’ మరియు  ‘CEN no. 2/2024.’ గురించి వెతికాము. ఇక్కడ CEN అంటే సెంట్రలైజడ్ ఎంప్లొయిమెంట్ నోటీసు నంబర్లు అని అర్ధం, ఇవి ప్రతి నోటిఫికేషన్ లోను ఉంటాయి. వైరల్ అవుతున్న ప్రకటనల కుడా, ఈ నోటిఫికేషన్లు రైల్వే వారి అధికారిక వెబ్సైటులో ఉంటాయి అని పేర్కొంది.

ఆ తరువాత ఆర్ ఆర్ బి వెబ్సైటు లో ఈ నోటిసులని వెతికాము, అప్పుడు ‘CEN no.1/2024  ఈ నోటిఫికేషన్ నెంబర్ తో అసిస్టెంట్ లోకో పైలట్ల ఉద్యోగానికి ప్రకటన అని అర్ధమయింది, అలాగే CEN no. 2/2024’ టెక్నిషన్ల నియామకానికి అని కనుగొన్నము.


ఒరిజినల్ ఫోటో కి మరియు వైరల్ అవుతున్న ప్రకటనకు పోలిక (సౌజన్యం : ఫేస్బుక్/ఆర్ ఆర్ బి వెబ్సైటు)

ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ రేలషన్ డిపార్ట్మెంట్ వారు లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్ అని తెలియజేసారు. దక్షిణ మధ్య రైల్వే,  ప్రధాన పబ్లిక్ రేలషన్ అధికారి సిహెచ్ రాకేష్ దీనికి సంబంధించిన పత్రిక ప్రకటన విడుదల చేసి దీని ద్వారా రైల్వే వారు ఎటువంటి కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ల పోస్ట్లు విడుదల చేయాలేదు అని అధికారికంగా తెలిపారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారందరు మోసగాళ్ల భారి నుంచి జాగర్తగా ఉండాలి అని కోరారు.



భారతీయ రైల్వే వారు విడుదల చేసిన పత్రిక ప్రకటన (దక్షిణ మధ్యమ రైల్వే)

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు కుడా వారి అధికారిక వెబ్సైటులో ఉద్యోగ ప్రయత్నం చేసే వారందరు కుడా ఆ విధమైన నకిలీ ప్రకటనలకు కానీ ఫేక్ వెబ్సైట్లకు కానీ సామాజిక మాధ్యమాలలో చూసి మోస పోవొద్దు అని ఒక ముందస్తు నోటీసు కుడా పెట్టారు.

తీర్పు : 

కల్పించబడిన ఒక ప్రకటనను చూపి, ఆర్ ఆర్ బి వారు కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల కోసం ఉద్యోగ ప్రకటన చేసారు అని ప్రచారం చేసారు. భారతీయ రైల్వే అధికారులు ఇది నకిలీది అని తెలిపారు. కనుక మేము ఇది ఫేక్ అని నిర్ధారించాము.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.