నటి కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టున్న వైరల్ వీడియో డీప్ ఫేక్

ద్వారా: రాహుల్ అధికారి
నవంబర్ 20 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
నటి కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టున్న వైరల్ వీడియో డీప్ ఫేక్

ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న పోస్ట్ (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

కృత్రిమ మేధా ద్వారా ఈ వీడియో ని తయారు చేశారు. ఒరిజినల్ వీడియోని యూకేకి చెందిన ఒక ఫాషన్ ఇన్ఫ్లుయెన్సర్ టిక్ టాక్ లో పోస్ట్ చేసారు.

క్లైమ్ ఐడి d0762864

కృత్రిమ మేధ సాంకేతికత పెరుగుతున్న తరుణంలో తప్పుడు సమాచారం కుడా సామాజిక మాధ్యమాలలో విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. మిడ్ జర్నీ మరియు ఇతర ముఖ మార్పిడి సాధనాలను ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఎంతో నమ్మదగిన డీప్ ఫేక్ వీడియోలను తయారు చేస్తున్నారు. గడిచిన సంవత్సరంలో రాజకీయ నాయకులవి, ప్రముఖ సినీ నటులవి, మరెన్నో ఇతరుల డీప్ ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టాయి.

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాల్లో బాలీవుడ్ నటి కాజోల్ కెమెరా ముందు దుస్తులు మార్చుకుంటున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇలాంటి వ్యాఖ్యలతోనే రాస్తూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోని షేర్ చేశారు. అలాంటి ఒక పోస్ట్ కు ఫేస్బుక్ లో 5,200 లైక్స్, 108 కామెంట్లు మరియు 90 షేర్లు ఈ కథనం రాసే సమయానికి వచ్చాయి. ఆ పోస్ట్ కు శీర్షికగా, “కాజోల్ దేవగన్ దుస్తులు మార్చుకుంటుంది” అని రాసుకొచ్చారు. ఆ పోస్ట్ యెక్క ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.

ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న పోస్ట్ (సౌజన్యం : ఇన్స్టాగ్రామ్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నది నటి కాజోల్ కాదు. ఇది యూకేకి సంబంధించిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో.

మేము ఏమి కనుగొన్నాము?

వైరల్ అవుతున్న వీడియోని జాగ్రత్తగా పరిశీలించగా మాకు కొన్ని లొసుగులు కనిపించాయి. వీడియో చివర్లో ఆ వ్యక్తి షూస్ ధరిస్తున్న సమయంలో, ఒక కన్ను కిందకి ఒక కన్ను పైకి ఉన్నట్టు మొహంలో మనకి కనిపిస్తుంది. (కృత్రిమ మేధ ద్వారా తయారు చేయబడిన వీడియోలలో ఒక ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్ కి మారే సమయంలో, కళ్ళు సరిగ్గా ఉండకపోవడం అనేది మనకు తరచుగా కనిపించే విషయం) 

వైరల్ వీడియో నుండి స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

దీనికి సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే మాకు ఒరిజినల్ వీడియోకి సంబందించిన న్యూస్ రిపోర్ట్ లభ్యమైంది. ది యుఎస్ సన్ లో జూన్ 7, 2023 నాడు ఒక కథనం ప్రచురితమయింది. దాని ప్రకారం, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి, రోసీ బ్రెయిన్, ఈ వీడియోని మొదటిగా టిక్ టాక్ లో అప్లోడ్ చెయ్యటం జరిగింది.

బ్రెయిన్ ఒక ఫాషన్ ఇన్ఫ్లుయెన్సర్, ఆమెకు టిక్ టాక్ లో 5,84,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె బయోలో “మిడ్ సైజ్డ్ ఫ్యాషన్ + ఇతర బిట్స్” ( "Midsized Fashion + other bits 🦋☔️🍂💐🩷.") అని రాసి ఉంది.

టిక్ టాక్ లో ఒరిజినల్ వీడియోని జూన్ 5, 2023న పోస్ట్ చేసారు అని తెలుసుకున్నాము. ఈ వీడియో 0:27 నిముషాలు ఉంది. ఇందులో బ్రెయిన్ మొత్తం మూడు దుస్తులు మార్చుకోవటం ఉంటుంది, వాటితో పాటు ఆమె ఆ వస్త్రాల ధర కుడా వీడియో శీర్షికలో జత చేసింది. ఇదే వీడియోని బ్రెయిన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో జూన్ 3, 2023న పోస్ట్ చేసింది. తన ఇన్స్టాస్టాగ్రామ్ బయోలో తాను “యూకే- ఇండియన్ ఐరిష్ మిడ్ సైజ్డ్ గాళ్” అని రాసి ఉంది

వైరల్ వీడియో 0:14 నిమిషాల ఉంది, ఇది 0:02 నుండి 0:11 వ్యవధిలో భాగాన్ని ఒరిజినల్ వీడియో నుండి తీశారు. దీనిని డిజిటల్ గా మార్చటమే కాక 0:09 నిమిషాలు ఉన్న ఈ క్లిప్ ని ఇంకాస్త నెమ్మదిగా చేసి, 0:14 నిమిషాల వీడియోగా చిత్రీకరించారు. 

మేము ఈ వైరల్ వీడియోని మరియు ఒరిజినల్ వీడియోని పోల్చి చూసినప్పుడు ముఖ మార్పిడి సాఫ్ట్వేర్ వాడి బ్రెయిన్ బదులుగా కాజోల్ మొహాన్ని జోడించినట్టు తెలుసుకున్నాము. 

వైరల్ వీడియో ఒరిజినల్ వీడియో మధ్య పోలిక (సౌజన్యం : ఫేస్బుక్/టిక్ టాక్ / లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఒరిజినల్ వీడియో వైరల్ వీడియోని పోల్చి చూస్తే వైరల్ వీడియోలో ఉన్నది నటి కాజోల్ కాదు అని మనకు అర్ధం అవుతుంది. ఇంతకు మునుపు కుడా ఇలానే మరో నటి రష్మిక మందన్నకి సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోని కూడా లాజికల్లి ఫ్యాక్ట్స్ మరియు ఇతర సంస్థలు డీబంక్ చేశాయి. 

తీర్పు: 

బాలీవుడ్ నటి కాజోల్ కెమెరా ముందు దుస్తులు మార్చుకుంటుంది అన్న శీర్షికతో ఒక డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది.  టిక్ టాక్ నుంచి ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోని తీసుకుని, ముఖ మార్పిడి సాఫ్ట్వేర్ వాడి కాజోల్ మొహం జోడించి, ఈ వీడియోని షేర్ చేశారు. కనుక మేము దీనిని ఫేక్ అని నిర్ధారించాము. 

(అనువాదం: రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.