2023లో తుర్కియేలో భూకంపానికి సంబంధించిన వీడియోని తాజా జపాన్ భూకంపం వీడియోగా షేర్ చేశారు

ద్వారా: ఉమ్మే కుల్సుం
జనవరి 2 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2023లో తుర్కియేలో భూకంపానికి సంబంధించిన వీడియోని తాజా జపాన్ భూకంపం వీడియోగా షేర్ చేశారు

తాజా జపాన్ భూకంపంకి సంబంధించిన ఘటనకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అంటూ క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఫిబ్రవరీ 2023లో తుర్కియేలో ఒక ఆసుపత్రి కంపించినప్పటి సీసీటీవీ ఫుటేజీ ఇది. తాజా జపాన్ భూకంపానికి సంబంధం లేదు.

క్లైమ్ ఐడి 11a27f9c

క్లైమ్ ఏంటి?

జనవరి 1, 2024 నాడు 7.6 తీవ్రతతో జపాన్ ఉత్తర మధ్య ప్రాంతంలో భూమి కంపించింది. దీని తరువాత అనేక సార్లు చిన్న స్థాయి కంపనాలు చోటుచేసుకున్నాయి. దీనితో ఐషికవా, నిగాట, టొయామా లాంటి తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నేపధ్యంలో జపాన్ భూకంపానికి సంబంధించిన వీడియోలు అంటూ అనేక వీడియోలు సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్నాయి. అందులో ఒక వీడియోలో భూమి కంపిస్తున్నప్పుడు ఆసుపత్రిలో ఒక నర్సు ఒక పిల్లవాడిని కాపాడటానికి పరిగెడుతున్నట్టున్న వీడియో బాగా వైరల్ అయ్యింది.

ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, “ఇప్పుడే అందిన వార్త. జపాన్ లో భూమి కంపించటంతో ఆందోళనలో పడిన నర్సులు,” అనే శీర్షిక పెట్టారు. ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ వీడియోకి 5 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇదే వీడియో ఫేస్బుక్ లో కూడా వైరల్ అయ్యింది. ఆ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

అయితే ఇది జనవరి 1 ,2024 నాడు జపాన్ లో చోటుచేసుకున్న భూకంపానికి సంబంధించిన వీడియో కాదు. 

మేము ఏమి తెలుసుకున్నాము?

వైరల్ వీడియోలో “టి ఆర్ టి వల్డ్” లోగో ఉంది. దాని ఆధారంగా వైరల్ వీడియో సోర్స్ కోసం ఈ తుర్కియే మీడియా సంస్థ వీడియోలు వెతికాము. ఇదే వీడియోని ఈ సంస్థ ఫిబ్రవరీ, 2023 లో తమ యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసిందని తెలుసుకున్నాము. “భారీగా భూమి కంపించిన తరుణంలో పిల్లలని రక్షించడానికి పరుగులు పెడుతున్న నర్సులు,” అనేది ఈ వీడియో శీర్షిక. 

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా ది టైమ్స్ మరియు ది సండే టైమ్స్ ఫిబ్రవరీ 13, 2023 నాడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఇదే వీడియో మాకు దొరికింది. ఈ ఘటన దక్షిణ మధ్య తుర్కియేలో ఘజియాన్టెప్ అనే ప్రాంతంలో ఉన్న ఒక ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఉన్న వివరాల ప్రకారం ఫిబ్రవరీ, 2023లో తుర్కియేలో భూమి కంపించినప్పుడు ఘజియాన్టెప్ రాష్ట్రంలో ఉన్న ఇనాయెత్ టోప్కుయోగ్లు అనే ఆసుపత్రిలో సెయ్మా అలాకుస్ అనే నర్సు కుదిరినంత మంది పిల్లలని కాపాడటానికి చేసిన ప్రయత్నం ఇది.

మిడిల్ ఈస్ట్ ఐ అనే మీడియా సంస్థ ఫిబ్రవరీ, 2023 లో తమ యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసిన ఇదే వీడియో మాకు దొరికింది. “ఘజియాన్టెప్ లో ఒక ఆసుపత్రి ఒక వీడియోని విడుదల చేసింది. ఇది తుర్కియేలో 7.8 తీవ్రతతో భూమి కంపించినప్పుడు చిన్న పిల్లలని కాపాడటానికి ఆసుపత్రిలోని కార్మికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి పని చేసిన, అలాగే నెలల నిండక ముందే పుట్టిన పిల్లలు ఉన్న ఇంక్యుబేటర్లు పడిపోకుండా పిల్లల వార్డులో నర్సులు చేసిన పనికి సంబంధించిన వీడియో అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి,” అని ఈ వీడియో వివరాలలో ఉంది.

ఫిబ్రవరీ 6, 2023 నాడు దక్షిణ తుర్కియే, ఆలాగే సిరియా సరిహద్దు ఉత్తర ప్రాంతంలో 7.8 తీవ్రతతో భూమి కంపించటంతో కనీసం 1500 మంది మృత్యువాత పడ్డారు. 

జపాన్ లో తాజాగా 7.6 తీవ్రతతో భూమి కంపించినప్పుడు కనీసం 30 మంది చనిపోయారు. ఆలాగే తీవ్ర ఆస్తి నష్టం చోటుచేసుకుంది. జపాన్ టైమ్స్ లో ఒక కథనం ప్రకారం ఈ భూకంపం తరువాత సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఆ తరువాత సునామీ హెచ్చరికలని ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

తీర్పు

ఫిబ్రవరీ, 2023లో దక్షిణ తుర్కియేలో 7.8 తీవ్రతతో భూమి కంపించినప్పుడు ఘజియాన్టెప్ రాష్ట్రంలో ఒక ఆసుపత్రిలో నర్సు పిల్లలని కాపాడటానికి చేసిన ప్రయత్నాలకి సంబంధించిన వీడియో ఇది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.