క్లిప్ చేసిన వీడియోని చూపి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర రాజకీయనాయకుడిని విమర్శించినట్టుగా షేర్ చేసారు

ద్వారా: రోహిత్ గుత్తా
జనవరి 23 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
క్లిప్ చేసిన వీడియోని చూపి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర రాజకీయనాయకుడిని విమర్శించినట్టుగా షేర్ చేసారు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ 2023 నాటి వీడియో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటిది. ఆయన ఈ వీడియోలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మంత్రిని విమర్శిస్తున్నప్పటిది.

క్లైమ్ ఐడి f5d71274

క్లెయిమ్ ఏమిటి?

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) మరియు ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో 15 సెకెన్ల నిడివిగల వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియోలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడైన కడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని)ని సవాలు చేస్తున్నట్టుగా మరియు విమర్శిస్తున్నట్టుగా ఉంది. అలాంటి ఒక ఎక్స్ పోస్ట్ కు 80,000 కు పైగా వ్యూస్ వచ్చాయి, ఇలాంటి ఫేస్బుక్ పోస్ట్ కు 3,00,000 పైగా వ్యూస్ వచ్చాయి. అలాంటి ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలో రేవంత్ రెడ్డి తెలుగు మీడియాతో మాట్లాడుతూ ఉండటం మనం చూడవచ్చు. ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు నమిలేటోడు కుడా నా గురించి మాట్లాడితే, అంత గౌరవంగా ఉండదు.  ఒకవేళ ఆయనకు అంతగా కోరిక ఉంటే, అయన ఏం పిసకాలనుకుంటున్నాడో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాల్నో చెప్తే, తప్పకుండ నేను అక్కడికి వస్తా,” అని అనటం మనం వినవచ్చు.

రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు కొడాలి నాని గురించే అంటున్నట్టుగా సామాజిక మాధ్యమాలలో యూజర్లు షేర్ చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో తను ముఖ్య మంత్రిగా ఎన్నికయ్యాక, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీసం మర్యాదకైనా ఫోన్ చేసి మాట్లాడలేదు అని తెలిపారు. దీనికి ప్రతిగా కొడాలి నాని మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ఆసుపత్రిలో చేరిన రోగి కాదు ఫోన్ చేసి పరామర్శించడానికి,” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సమాధానంగానే రేవంత్ రెడ్డి కొడాలి నానిని విమర్శించారు అన్నట్టుగా వీడియో వైరల్అయ్యింది. 


సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే,  ఇది రేవంత్ రెడ్డి పాత వీడియో. దీనిని క్లిప్ చేసి కొడాలి నానికి సమాధానం ఇస్తున్న రేవంత్ అని షేర్ చేస్తున్నారు.

మేము ఏమి కనుగొన్నాము?

భారత్ రాష్ట్ర సమితి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి గతంలో రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడిన వీడియోని కొడాలి నాని గురించి మాట్లాడుతున్నారు అనే విధంగా షేర్ చేస్తున్నారు అని మేము కనుగొన్నము. శ్రీనివాస్ యాదవ్ గతంలో అంటే డిసెంబర్ 2023 వరకు నాటి ప్రభుత్వంలో  పశు సంవర్దక, మత్స్య  మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా వ్యవహరించారు.

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా, రేవంత్ మీడియాతో మాట్లాడుతున్న మరింత నిడివి గల వీడియో మాకు లభించింది. తెలుగు వార్త సంస్థలు అయిన V6 న్యూస్, ఎన్టీవీ, జీ న్యూస్ ఈ వీడియోని తమ యూట్యూబ్ చానళ్లలో మే 2023 లో అప్లోడ్ చేశాయి. అప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, ఇంకా ముఖ్యమంత్రి కాలేదు. అప్పట్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేరు కుడా వాడారు.

V6 న్యూస్ మే 10, 2023 నాడు తమ యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసిన వీడియోలో మనం రేవంత్ రెడ్డి, “శ్రీనివాస్ యాదవ్ గారికి, చిన్నప్పటి నుండి పెండ పిసికే అలవాటు ఉంది కదా..పెండ పిసికే అలవాటుతోని, ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ పిసుకుడి సంగతి దేవుడు ఏరుగు, ఆ నమిలే పాన్ పరాగ్ మానేస్తే బావుంటది. ప్రజా ప్రతినిధులుగా మనం యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకుని నమిలేటోడు కుడా నా గురించి మాట్లాడితే, అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరిక ఉంటే, అయన ఏం పిసకాలనుకుంటున్నాడో చెప్తే, ఆయన ఒక తారీఖు చెప్తే, ఎక్కడ రావాల్నో చెప్తే, తప్పకుండా నేను అక్కడికి వస్తా.” అని మాట్లాడటం మనం వినవచ్చు. ఇందులో 00:48 నుండి 01:03 వరకు ఉన్న భాగమే వైరల్ వీడియో.

ఎన్టీవీ అప్లోడ్ చేసిన వీడియోలో వైరల్ క్లిప్, 1:20 నిడివి దగ్గర నుండి ఉంది.

కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన ఆరు ఎన్నికల ప్రమాణాలను విమర్శిస్తూ, యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేసారు, ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఎత్తు గురించి కుడా వెక్కిరించారు, “వాడు పొట్టోడు.  డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. వాడికి అయితే, నోటికి బటనే లేదు, ఎంఎల్ఏ లేదు మంత్రి లేదు, వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. వాడు ఉన్న పర్సనాలిటీ ఎంత, వాడు పిసుకుతే ప్రాణం పోతది కొడుకు మాట్లాడుతున్నాడు,” అని అన్నారు. దీనికి సమాధానంగా, ఆ సమయంలో రేవంత్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడారు.

తీర్పు :

2023 లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ మంత్రి గురించి చేసిన వ్యాఖ్యలను, ఆంధ్ర ప్రదేశ్ లోని వై ఎస్ ఆర్ సి పి శాసన సభ్యుడి గురించి చేసినట్టుగా షేర్ చేసారు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)


Read the English check here.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.