అక్షరధామ్ ఆలయంకి సంబంధించిన డ్రోన్ వీడియోని చూపి అయోధ్య రామాలయంగా షేర్ చేశారు

ద్వారా: చందన్ బొర్గోహాయ్
ఫిబ్రవరి 2 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
అక్షరధామ్ ఆలయంకి సంబంధించిన డ్రోన్ వీడియోని చూపి అయోధ్య రామాలయంగా షేర్ చేశారు

వైరల్ వీడియో యొక్క పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇంస్టాగ్రామ్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయం వీడియోనిలో ఒక అయోధ్య రామాలయం ఫోటో పెట్టి మొత్తం వీడియో అయోధ్య రామాలయానిదే అన్నట్టుగా మలిచారు.

క్లైమ్ ఐడి 03d75aa3

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక వీడియోని షేర్ చేసి ఇది జనవరి 22న అయోధ్యలో  ప్రాణ ప్రతిష్ట తరువాత తీసిన వీడియో అంటూ వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వేదికలలో ఇది రీల్స్ మాదిరిగా షేర్ అవుతూ, గుడి పై భాగము, వివిధ కోణాలలో తీసిన విజుఅల్స్ ని చూపిస్తుంది.

ఈ వీడియోని షేర్ చేస్తూ, అనేక మంది యూజర్లు అయోధ్య రామాలయం ఫోటోని కుడా జత చేసి, వీడియో మొత్తం రామాలయానిదే అన్నట్టుగా షేర్ చేసారు. వాటి ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియో యొక్క పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఇంస్టాగ్రామ్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

న్యూస్ అస్సాం 24X7 అనే ఒక అస్సామీస్ ఫేస్బుక్ పేజీ ఈ వీడియోని షేర్ చేస్తూ, రామాలయ ప్రాణ ప్రతిష్ట తరువాత అధితమైన వీడియో అని రాసి షేర్ చేసారు. (అస్సామీస్ నుంచి అనువాదం)


వైరల్ వీడియో కి సంబందించిన ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇలాంటి వీడియో నే యూట్యూబ్ లో కుడా అలాంటి వ్యాఖ్యలతోనే షేర్ చేసారు. 

కానీ, మా పరిశోధన ప్రకారం, ఇది ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయం, అయోధ్య లోని రామాలయం కాదు. 

మేము ఏమి కనుగొన్నము?

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, యూట్యూబ్ లో జూన్ 19, 2023 నాడు అప్లోడ్ అయిన ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయం వీడియో ఒకటి లభించింది.

పైగా, wearedelhi.in వెబ్సైటు లో “ఢిల్లీ లోనే అక్షరధామ్ ఆలయం గురించి 7 అద్భుత నిజాలు” అని ఒక వీడియో ఉంది, ఇందులో కుడా వైరల్ వీడియో లానే ఉంది. ఈ రెండు వీడియోలను పోల్చి చూస్తే,రెండు ఒకటే అని అర్థమయింది. 

వైరల్ వీడియో మరియి wearedelhi.in.  వెబ్సైటు లో ఉన్న వీడియోల మధ్య పోలిక (సౌజన్యం : ఫేస్బుక్/wearedelhi.in/స్క్రీన్ షాట్స్)


దీనినుంచి, మేము ఢిల్లీ లోని అక్షరధామ్ ఫోటోలను వెతుకగా అడోబ్ స్టాక్ అనే ఒక ఫోటోల వెబ్సైటులో వైరల్ వీడియో మాదిరిగానే ఉన్న మరి కొన్ని ఆలయం పై నుంచి తీసిన అక్షరధామ్ ఫోటోలు ఉన్నాయి.


వైరల్ వీడియో మరియు అడోబ్ స్టాక్ వీడియోకి మధ్య పోలిక (సౌజన్యం : ఇంస్టాగ్రామ్/ అడోబ్ స్టాక్/స్క్రీన్ షాట్) 

పైగా, జియోలోకేషన్ ద్వారా వెతుకగా, ఈ అక్షరధామ్ ఆలయం న్యూ ఢిల్లీ లోని నోయిడా మోర్, పాండవ నగర్ లో ఉందని తేలింది. గూగుల్ మప్స్ లో చూస్తే, వైరల్ వీడియోలో ఉన్న మాదిరిగానే ఉంది. 

అక్షరధామ్ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్స్ ఫోటో (సౌజన్యం : గూగుల్ మ్యాప్స్/స్క్రీన్ షాట్)

తీర్పు : 

వైరల్ వీడియోలో ఉన్నది న్యూ ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయం, దీనిని తప్పుగా అయోధ్య రామాలయం అని ప్రచారం చేసారు. కనుక దీనిని అబద్దం అని నిర్ధారించాము.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.