హోమ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత దేశానికి వచ్చినపుడు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేయలేదు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత దేశానికి వచ్చినపుడు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేయలేదు

ద్వారా: రాహుల్ అధికారి

సెప్టెంబర్ 29 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత దేశానికి వచ్చినపుడు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేయలేదు సామాజిక మాధ్యమాలలో పాకిస్థాన్ మురదబాద్ అని ఉన్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ప్రస్తుతం ‘పాకిస్థాన్ ముర్దాబాద్ ’ అనే నినాదాలతో వైరల్ అవుతున్న వీడియో, ఎడిట్ చేసిన వీడియో.

నేపధ్యం

ఐసిసి వన్ డే పురుషుల ప్రపంచ కప్పు 2023 సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెప్టెంబర్ 27వ తారీఖున భారత దేశం విచ్చేసింది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 5వ తారీఖున మొదలయ్యి నవంబర్ 9వ తారీఖున ముగుస్తుంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు దాదాపుగా ఏడు సంవత్సరాల తరువాత ఇండియాకి విచ్చేశారు. వీరు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు.

క్లెయిమ్ ఏమిటి?

పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ లో దిగిన వెంటనే సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో వాళ్ళు వచ్చిన వెంటనే ‘పాకిస్థాన్ ముర్దాబాద్ ’ అంటూ నినాదాలు చేశారు అని ఉంది. ఈ వైరల్ వీడియోలో, ఒక వైపు ‘పాకిస్థాన్ ముర్దాబాద్’  నినాదాలు వినబడుతూ ఉంటే, పోలీసుల రక్షణ మధ్యలో పాకిస్థాన్ క్రికెటర్లు విమానాశ్రయం నుండి బయటకి వస్తున్నట్టు ఉంది. ఈ వీడియోలో పాకిస్థాన్ ఆటగాళ్లు బాబర్ ఆజామ్, షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ నవాజ్ మరియు ఇమామ్-ఉల్-హక్ లాంటి వారిని మనం చూడవచ్చు.

ఆ వీడియో ని షేర్ చేస్తూ, ఒక యూజర్ ఎక్స్ (ఇంతకుమునుపు ట్వట్టర్) లో ఇలా రాసుకొచ్చారు, “భారత దేశానికి ఆ పాకిస్థానీ ఉగ్రవాదులు వచ్చినపుడు పాకిస్థాన్ మురదబాద్ అనే నినాదాలు చేశారు. వారికి నా వందనాలు. #PakistanCricketTeam”, అని షేర్ చేశారు. ఆర్కైవ్ చేసిన పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. ఈ పోస్ట్ కు ఈ కథనం రాసే సమయానికి 44,000 వేల వ్యూస్ ఉన్నాయి.  

ఇలాంటి శీర్షికలతోనే ఈ వీడియో ఫేస్బుక్ లో కూడా వైరల్ అవుతుంది. అలాంటి పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 


వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయితే వైరల్ అవుతున్న క్లెయిమ్ అబద్దం. ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అని ఉన్న వీడియో డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియో. . 

వాస్తవం ఏమిటి?

ఇదే వీడియోకి సంబంధించి పూర్తి ఫుటేజ్ మాకు దొరికింది. ఈ వీడియోని ఎకనామిక్ టైమ్స్ సెప్టెంబర్ 27న వారి యూట్యూబ్ చానెల్ లో, “క్రికెట్ ప్రపంచ కప్పు 2023: పాకిస్థాన్ క్రికెట్ టీం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది,” అనే శీర్షిక తో అప్లోడ్ చేశారు. ఈ వీడియో నిడివి 126 సెకండ్లు, ఈ వీడియోలో మనం పాకిస్థాన్ జట్టు వారు విమానాశ్రయం నుండి బయటకి వచ్చి బస్ ఎక్కడం చూడవచ్చు, ఈ ఎకనామిక్ టైమ్స్ వీడియోకి వేరే మ్యూజిక్ జత చేసినప్పటికీ మనకి ఒరిజినల్ ఆడియో వినపడుతుంది, దీనిలో ఎటువంటి పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు వినపడలేదు. 


ఎకనామిక్ టైమ్స్ వీడియో లో 1:21 నిడివి దగ్గర కెమెరాలోకి చూస్తూ, ఒక ఐడెంటిటీ కార్డ్ వేసుకుని కనపడే ఒక వ్యక్తి, వైరల్ వీడియో లో కూడా 0:04 దగ్గర కనపడతాడు. 

వైరల్ వీడియో కి మరియు ఎకనామిక్ టైమ్స్ అప్లోడ చేసిన వీడియో కి పోలిక (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఒక సెకండ్ తరువాత ఎకనామిక్ టైమ్స్ వీడియోలో పాకిస్థాన్  జట్టు ఆటగాళ్లు ఒక వరుస లో నిలుచుని ఉన్నట్టు కనపడతారు, వైరల్ వీడియో లో కూడా ఇదే మనం 0:05 వద్ద చూడవచ్చు, ఈ పోలీకల బట్టి ఈ రెండు వీడియోలు ఒకటే అనే అర్దమవుతుంది.



వైరల్ వీడియో కి మరియు ఎకనామిక్ టైమ్స్ అప్లోడ చేసిన వీడియో కి పోలిక (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే వైరల్ అవుతున్న వీడియోలో ‘పాకిస్థాన్ ముర్దాబాద్ ’ అనే నినాదాలు ఉన్నాయి, కానీ ఎకనామిక్ టైమ్స్ పెట్టిన వీడియో లో లేవు. దీనిబట్టి వైరల్ అవుతున్న వీడియో కావాలని మర్చినది అయిఉండవచ్చు అని తెలుస్తుంది. ఈ పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలని డిజిటల్ గా చేర్చారు. 

హిందుస్థాన్ టైమ్స్ కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత దేశానికి విచ్చేసింది అంటూ వీడియోని ప్రచురించింది, ఇది వేరే కోణం నుండి తీసినది. అయితే ఇందులో కూడా ‘పాకిస్థాన్ ముర్దాబాద్’  అనే నినాదాలు ఏమి మాకు వినబడలేదు. ఆ కథనంలో అలాంటి నినాదాలు చేసినట్టు ఎక్కడా రాయలేదు. 

న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కూడా పాకిస్థాన్ ఆటగాళ్లు హైదరాబాద్ విమాశ్రయం నుండి బస్ ఎక్కుతున్న ఒక వీడియోని ప్రచురించింది, ఇందులో ఏ ఇతర సంగీతం జోడించని వీడియోనే ఉంది, ఇందులో కూడా ఎలాంటి నినాదాలు వినపడలేదు. 

పైగా, ఈ విషయం నిర్ధారణ గురించి లాజికల్లీ ఫ్యాక్ట్స్ సైబరాబాద్ పోలీస్ వారిని సంప్రదించింది. ఆర్ జి ఐ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అలాంటి సంఘటన ఏమి జరగలేదు అని వెల్లడించారు. “ప్రపంచ కప్పు వీక్షించటానికి వచ్చిన అమెరికాలో ఉండే బషీర్ అనే ఒక పాకిస్థానీ వ్యక్తి పాకిస్థాన్ కి మద్దతుగా నినాదాలు చేశారు.”

ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, పోలీసులు పాకిస్థాన్ క్రికెట్ అభిమాని అయిన బషీర్ ని విమానాశ్రయంలో పాకిస్థాన్ జెండా ని ఊపినందుకు గాను నిర్భందించారు. బషీర్ చాచా బషీర్ గా పాకిస్థాన్ మరియు భారతీయ క్రికెట్ అభిమానులకి పరిచయస్తుడు, ఈయనకి మాజీ భారతీయ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య మంచి బంధం ఉంది.

తీర్పు:

పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ విమానాశ్రయం వీడుతున్న సమయంలో తీసిన వీడియోని డిజిటల్ గా ఎడిట్ చేసి పాకిస్థాన్ కి వ్యతిరేక నినాదాలు చేస్తున్నట్టు గా చిత్రీకరించారు. పోలీసులు కూడా అలాంటిది ఏమి జరగలేదు అని ధృవీకరించారు. కాబట్టి దీనిని మేము అబద్దం అని నిర్దారించాము. 

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.