తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినందుకు కమెడియన్ ఆర్పీ హోటల్ మీద అల్లు అర్జున్ అభిమానులు దాడి చేయలేదు

ద్వారా: రాజేశ్వరి పరస
జూన్ 11 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినందుకు కమెడియన్ ఆర్పీ హోటల్ మీద అల్లు అర్జున్ అభిమానులు దాడి చేయలేదు

కమెడియన్ ఆర్పీ హోటల్ మీద అల్లు అర్జున్ అభిమానులు దాడి చేశారు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది హైదరాబాద్ లోని గ్రాండ్ హోటల్ లో హోటల్ సిబ్బంది, వినియోగదారుల మధ్య జరిగిన గొడవ వీడియో. ఈ హోటల్ ఆర్పీది కాదు.

క్లైమ్ ఐడి 78187aeb

క్లైమ్ ఏంటి?

సామాజిక మాధ్యమాలలో 45 సెకన్ల వీడియో ఒక దానిని షేర్ చేసి, అల్లు అర్జున్ అభిమానులు రాతకొండ ప్రసాద్ కి చెందిన హోటల్ మీద దాడి చేస్తున్న వీడియో అని క్లైమ్ చేశారు. ఆర్పీగా పరిచయం ఉన్న ప్రసాద్ ‘జబర్దస్త్’ షోలో కిరాక్ ఆర్పీ అనే పాత్ర ద్వారా ప్రసిద్ధి చెందారు. తను ఈ మధ్య తెలుగు దేశం పార్టీలో చేరి, తాజా ఎన్నికలలో కూటమి తరుపున ప్రచారం చేశారు. 

‘పుష్ప’ లాంటి సినిమాల ద్వారా పేరు పొందిన అల్లు అర్జున్ తాజా ఎన్నికలలో  వై ఎస్ ఆర్ సీ పీ నంద్యాల అభ్యర్ధి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తరుపున ప్రచారం చేశారు.

తెలుగుదేశానికి మద్ధతు ఇచ్చినందుకు అల్లు అర్జున్ అభిమానులు ఆర్పీకి చెందిన ఈ హోటల్ మీద దాడి చేశారని క్లైమ్ చేస్తున్నారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఈ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 175 సీట్లలో 164 చోట్ల గెలిచి కూటమి అధికారం చేపట్టింది.

అయితే, ఈ క్లైమ్ తప్పు. ఈ వీడియో హైదరాబాద్ లో ఒక హోటల్ లో హోటల్ సిబ్బంది, వినియోగదారుల మధ్య జరిగిన గొడవకి సంబంధించినది. ఈ హోటల్ ఆర్పీకి కాదు. 

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వాస్తవాలు ఏమిటి?

ఈ వీడియోని రివర్స్ ఇమేజ్ కి సెర్చ్ లో వెతికితే, టైమ్స్ నౌ కథనం ఒకటి మాకు లభించింది. “హైదరాబాద్ లో ఒక హోటల్ లో హోటల్ సిబ్బంది, వినియోగదారుల మధ్య గొడవ/వీడియో” అనేది ఈ కథనం శీర్షిక. ఇందులో వైరల్ వీడియో స్క్రీన్ షాట్ ఉంది. ఈ కథనం ప్రకారం , ఈ గొడవ అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్ లో జనవరి 1, 2024 నాడు చోటు చేసుకుంది. 

హైదరాబాద్ కి చెందిన పాత్రికేయులు శాయి శేఖర్ అంగర కూడా ఈ వీడియోని జనవరి 1, 2024 నాడు తన ఎక్స్ అకౌంట్  (ఆర్కైవ్ ఇక్కడ)లో షేర్ చేశారు. ఈ గొడవ డిసెంబర్ 31, 2023 నాడు జరిగింది అని, గ్రాండ్ హోటల్ లోని వెయిటర్స్ వినియోగదారుల మీద కర్రలతో దాడి చేశారని రాశారు. 

ది న్యూస్ మినిట్ లో కథనం ప్రకారం, మటన్ బిర్యానీలో ఉడకని మాంసం ఉందని వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో గొడవ మొదలయ్యింది. వినియోగదారులు బిల్లు కట్టడానికి నిరాకరించడంతో, గొడవ పెరిగి వెయిటర్స్ వారి మీద దాడి చేశారు అని ఇందులో ఉంది. 

దీనికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డెక్కన్ క్రానికల్ లో కథనం ప్రకారం, 10 మంది హోటల్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. 

దీని బట్టి, ఈ ఘటన ఎన్నికలకి ముందు జరిగింది అని, అల్లు అర్జున్ అభిమానులు ఆర్పీ హోటల్ మీద దాడి చేసిన ఘటన కాదని స్పష్టం అవుతున్నది.

అలాగే, మా పరిశోధనలో ఈ హోటల్ యజమాని జలీల్ ఎఫ్ రూజ్ అని, ఆర్పీ కాదని తేలింది. తెలుగు సమయంలో కథనం ప్రకారం, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరు మీద ఆర్పీకి ఉభయ తెలుగు రాష్ట్రాలలో హోటల్ చైన్ ఉంది. చేప వంటకాలకి ఈ చైన్ ప్రసిద్ధి.

అలాగే అల్లు అర్జున్ అభిమానులు ఆర్పీకి చెందిన హోటల్ మీద దాడి చేయడం గురించి ఎటువంటి వార్తా కథనం లేదు.

తీర్పు

హోటల్ సిబ్బంది, వినియోగదారుల మధ్య జరిగిన గొడవకి సంబంధించిన జనవరి, 2024 నాటి వీడియోని షేర్ చేసి, అల్లు అర్జున్ అభిమానులు కమెడియన్ ఆర్పీ మీద దాడి చేసిన వీడియో అని తప్పుగా క్లైమ్ చేశారు. 

(అనువాదం - గుత్తా రోహిత్)

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.