పచ్చి పాల వలన లాక్టోస్ అసహనం తగ్గుతుందని ఏ రుజువు లేదు

ద్వారా: నబీలా ఖాన్
మార్చి 11 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పచ్చి పాల వలన లాక్టోస్ అసహనం తగ్గుతుందని ఏ రుజువు లేదు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

పచ్చి పాలు ఎక్కువ పోషణ ఇస్తుందని, అది లాక్టోస్ ఇన్టాలరెన్స్ ని నయం చేస్తుందని నిర్ధారించడానికి ఎలాంటి శాస్త్రీయ రుజువు లేదు.

క్లైమ్ ఐడి 4342f7bd

పచ్చి పాల వల్ల లాక్టోస్ అసహనం (అంటే, పాలలో ఉన్న చక్కర పదార్థాలను జీర్ణించుకోలేకపోవటం) అనే దానిని నయం చేయవచ్చు అంటూ యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోకి ఈ కథనం రాసే సమయానికి 49,000 కు పైగా వ్యూస్ మరియు 1,400 లైక్స్  వచ్చాయి. ఈ వీడియో ప్రకారం పాశ్చరైజేషన్ ప్రక్రియలో చక్కరను కరిగించే లాక్టేస్  అనే ఎంజైమ్ ధ్వంసం కాబడుతుంది, కానీ పచ్చి పాలలో లాక్టేస్ మరియు లాక్టోస్ రెండు ఉంటాయి అని, ఇది ఎక్కువ పోషణ ఇస్తుంది అని ఉంది.

మేము ఈ వీడియోలో తెలిపే అన్ని క్లెయిమ్స్ ని పరిశీలించాము.

మొదటి క్లెయిమ్ : పచ్చి పాలలో లాక్టేస్ మరియు లాక్టోస్ రెండు ఉంటాయి

ముందుగా ఈ  క్లైమ్ ని సమర్ధించడానికి ఏ విధమయిన శాస్త్రీయ ఆధారాలు లేవు. 2011లో యు ఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డి ఏ) పచ్చి పాలలోను మరియు కాచిన పాలలోనూ రెండింటిలోనూ లాక్టోస్ ఉంటుంది అని చెప్పింది. ఆ వెబ్సైటు ప్రకారం, “పచ్చి పాలని సమర్ధించే వారు పచ్చి పాల కారణంగా పాలు/పాల ఉత్పత్తులు పడకపోవటం (లాక్టోస్ ఇంటోలరెన్స్) జరగదు అని చెబుతారు. ఎందుకు అంటే పచ్చి పాలలో ప్రోబయోటిక్ సూక్ష్మజీవులు లాక్టేస్ అనే పదార్ధాన్ని విడుదల చేస్తాయి కాబట్టి అని వారి వాదన.”

యుకే ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ కుడా పచ్చి పాలలో మరియు పాశ్చరైజేషన్ చేయని పాలలో ప్రమాదకర బాక్టీరియా ఉండే అవకాశం ఉందని, అది ఆహారాన్ని విషయమయం చేసే అవకాశం ఉందని తెలిపింది.

2014 లో స్టాన్ఫోర్డ్ ప్రచురించిన “ఎఫెక్ట్ అఫ్ రా మిల్క్ ఆన్ లాక్టోస్ ఇన్టాలరెన్స్: ఏ రండోమైజ్డ్ కంట్రోల్డ్ పైలట్ స్టడీ” అనే ఒక పరిశోధనలో భాగంగా వీరు పచ్చి పాలు, పాస్టరిజ్డ్ పాలు మరియు సొయా పాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అని 16 మంది వ్యక్తుల మీద ప్రయోగం చేసారు. ఈ ప్రయోగం ద్వారా పచ్చి పాలు లేదా పాస్టరిజ్డ్ పాలు రెండింటి వలన లాక్టోస్ ఇన్టాలరెన్స్ పై పెద్దగా పురోగతి లేదు అని తెలుసుకున్నారు.

2018 లో ప్రచురితమయిన మరో సమీక్షలో పచ్చి పాలలో రక్షణ లేదు అనే దానిని పేర్కొన్నారు. డాక్టర్ అమిత గాద్రే అనే ఒక పోషకాహార నిపుణులు లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ పచ్చి పాలు మరియు  పాస్టరైజ్డ్ పాలు రెండింటిలోనూ లాక్టోస్ ఉంటుంది అని తెలిపారు, లాక్టోస్   ఇన్టాలరెన్స్ఉన్న వారు ఈ రెండింటి వలన అరుగుదలకు సంబందించిన ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

పచ్చి పాలతో వచ్చే  ప్రమాదాల గురించి, కారా లించ్ అనే ఒక డైటీషన్ 2021లో మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ కొరకు ఒక బ్లాగ్ రాసారు. దీని ప్రకారం, పచ్చి పాలలో అనేకమైన ప్రమాదకర సూక్ష్మ జీవులు ఉండొచ్చు అని, అవి ఆరోగ్యకరమైన ప్రమాదాలకు దారి తియ్యవచ్చు అని తెలిపారు. పైగా, ఆ కథనం లో పచ్చి పాలలో ప్రమాద శాతం 150 కంటే  అధికంగా ఉంటుందని తెలిపారు. “పాల వలన వచ్చే అలెర్జీలు ఒక పాల ప్రోటీన్ వలన కలుగుతున్నాయి, లాక్టోస్  అనే చక్కర వలన లాక్టోస్ ఇన్టాలరెన్స్ వస్తుంది. పచ్చి పాలు మరియు పాస్టరిజ్డ్ పాలు రెండింటిలోనూ ఇవి ఉంటాయి.” అని అందులో రాశారు. 

రెండో క్లైమ్ : పచ్చి పాలు అత్యంత పోషకాహారమైనవి 

పాశ్చరైజేషన్ ప్రక్రియ అనేది పాలను సురక్షితంగా చేసి,ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి చేస్తారు. ఎఫ్ డి ఏ ప్రకారం, అనేక అధ్యయనాలు, ఈ పాశ్చరైజేషన్ ప్రక్రియ వలన పాల పోషక విలువలపై ఎటువంటి ప్రభావం ఉండదని వెలువరించాయి.

డాక్టర్ గాద్రే ప్రకారం, “పాశ్చరైజేషన్ ప్రక్రియ పాల పోషక విలువను ఏ మాత్రం తగ్గించదు. ఇది కేవలం పాలలో ఉండే హానికర బాక్టీరియా ను తగ్గించడానికి మాత్రమే చేస్తారు. దీని వలన పాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి ఎక్కువ మంది సురక్షితంగా వాడుకోడానికి ఉపయోగపడుతుంది.”

ది సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సి డి సి) ప్రకారం పచ్చి పాలు అత్యంత ప్రమాదకరమైనవి. పచ్చి పాలతో తయారు చేసిన జున్ను, ఐస్ క్రీం, పెరుగు లాంటి ఉత్పత్తులు కుడా సూక్ష్మ జీవులు కలిగి  రోగాలకు దారి తీసే ప్రమాదం ఉంది అని పేర్కొంది. పైగా, పచ్చి పాలకి ప్రత్యేక పోషక విలువలు ఉన్నట్టుగా కుడా ఆ ఆధారం లేదని పేర్కొంది.

చివరగా, లాక్టోస్ ఇన్టాలరెన్స్ అనేది శరీరంలో తగినంత లాక్టేస్ ఉత్పత్తి అవ్వకపోతే వస్తుంది, ఈ లాక్టేస్ అనేది పాలలో ఉన్న లాక్టోస్ అనే చక్కర పదార్థం అరగడానికి ఉపయోగపడుతుంది. క్లీవ్లాండ్ క్లినిక్ ప్రకారం, లాక్టోస్ ఇన్టాలరెన్స్ అనేది శరీరంలో చిన్న ప్రేగులో లాక్టోస్ ని కరిగించే శక్తి లేకపోవటం, దీని వలన పెద్ద ప్రేగులో కొన్ని లక్షణాలు కనపడేట ట్టు చేస్తుంది. వాస్తవం ఏమిటంటే, పచ్చి పాలు అయినా పాస్టరై జ్డ్ పాలు అయినా రెండింటిలోనూ లాక్టోస్ ఉంటుంది. పైగా పచ్చి పాలు కల్తీకి గురి అయ్యే అవకాశం కుడా ఉంటుంది అని దీని వలన అనారోగ్యానికి గురికావొచ్చు అని సి డి సి పేర్కొంది.

తీర్పు :

ఏ శాస్త్రీయ  రుజువు లేనందువలన మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము.


(అనువాదం : రాజేశ్వరి పరస)

Read this story in English here.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.