తెలంగాణ లో కాంగ్రెస్ ఎన్నికైతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని రేవంత్ రెడ్డి అనలేదు

ద్వారా:
నవంబర్ 24 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తెలంగాణ లో కాంగ్రెస్ ఎన్నికైతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని రేవంత్ రెడ్డి అనలేదు

ఆన్లైన్ లో వైరల్ అవుతున్న క్లెయిమ్ ( సౌజన్యం: స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆ వైరల్ వీడియో డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియో. కెసిఆర్ మరియు అతని కుటుంబాన్ని ఉద్దేశించి తాను ‘పవర్ కట్ చేస్తా’ అని.రేవంత్ రెడ్డి అన్నాడు.

క్లైమ్ ఐడి 1dd03450

క్లెయిమ్ ఏమిటి ?

తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి నవంబర్ 30 నాడు ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది, అదే విధంగా సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం కుడా ప్రచారంలో ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ భారత్ రాష్ట్ర సమితి మరియు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మధ్య కర్ణాటకలో విద్యుత్ సరఫరా గురించి వాగ్వాదం నడుస్తూ ఉంది. కొన్ని నెలల క్రితమే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుడా ఏర్పాటు చేసింది. 

ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ లో మాట్లాడుతున్న 16 సెకన్ల వీడియో, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇందులో, రేవంత్ రెడ్డి, “నిన్నమొన్న ఏడ చుసినా, కాంగ్రెస్ వస్తే బిడ్డ మీ కరెంటు 

ఊడపీకుతాననని చెప్తున్నా. కాంగ్రెస్ రాంగానే కరెంటు ఊడపీకుతా. మీకు ఫ్యూజ్లే ఉండవ్ బిడ్డ, మీ మోటార్లు కాల్తాయ్, మీ ట్రాన్సఫార్మర్లు పేల్తాయ్ అని చెప్పి నేను చెప్పదల్చుకున్న”, అనటం మనం వినవచ్చు.  ఆర్కైవ్ చేసిన పోస్ట్లు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 


ఈ వీడియోని షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు, “రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు. నోరు జారీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ ఊడగొడతా అంటూ ఫీజులు పికేస్తా అంటూ సంచలన వాఖ్యలు చేసిన రేవంత్.”

కానీ ఈ వీడియో ఎడిట్ చేయబడినది. మూడు వివిధ సన్నివేశాలను జోడించి ఈ విధంగా తప్పుదోవ పట్టించేటట్టుగా మార్చారు.

మేము ఏమి కనుగొన్నము?

ఈ వైరల్ వీడియో లో చాలా జంప్ కట్స్ మేము చూసాము, ఇవన్నీ కుడా సహజంగా అనిపించలేదు. 

ఆ తరువాత, వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే రేవంత్ రెడ్డి అసలయిన ప్రసంగం వీడియో మాకు లభించింది. ఈ వీడియోని తెలుగు న్యూస్ చానెల్స్ ఎన్ టీవీ మరియు V6 న్యూస్ తెలుగు కుడా షేర్ చేసాయి. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా, వర్ధన్నపేటలో నవంబర్ 14న జరిగిన కాంగ్రెస్ జన సభలో రేవంత్ మాట్లాడుతున్న వీడియో అది. అనేక న్యూస్ చానళ్ళు దీనిని లైవ్ స్ట్రీమ్ చేసాయి. 

ఈ ప్రసంగం నుంచే మూడు వేరు వేరు సన్నివేశాలు తీసుకుని జోడించినట్టు మాకు అర్దమవుతుంది. వైరల్ వీడియోలోని మొదటి భాగాన్ని  (0:01-0:03) మనం 42:28-42:32 మార్క్ దగ్గర ఎన్ టి వి లైవ్ స్ట్రీమ్ లో చూడవచ్చు, సెకండ్ పార్ట్  (0:03-0:07) ఏమో 42:38-42:42 మధ్య చూడవచ్చు, మూడోభాగం 42:53-43:00 నిడివి వద్ద కనిపిస్తుంది.


ఒరిజినల్ స్పీచ్ లో రేవంత్ రెడ్డి తెలుగులో, “ఈయాలా అయన అంటున్రు (బీఆర్ఎస్ ని ఉద్దేశిస్తూ) కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసులకి. కాంగ్రెస్ వస్తే బిడ్డా మీ కరెంటు ఊడపీకుతానేను అని చెప్తున్నా.కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు కరెంటు, కాంగ్రెస్ రాంగానే …కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు, సంతోష్ రావు , దయాకర్ రావు, కవిత కరెంటు ఊడపీకుతా, మీకు ఫ్యూజులే ఉండవ్, మీ ట్రాన్సఫార్మర్లు పేల్తాయ్ అని నేను చెప్పదలుచుకున్న.”

ఇక్కడ కేసీఆర్ అంటే కే చంద్రశేఖర్ రావు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి. కేటీఆర్ అంటే కే తారక రామారావు, ప్రస్తుత ఇన్ఫర్మేషన్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి, హరీష్ రావు కేసీఆర్ మేనల్లుడు, ప్రస్తుతం ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ చూసుకుంటున్న మంత్రి. కవిత రావు కేసీఆర్ కూతురు మరియు శాసనమండలి సభ్యులు. . 

రేవంత్ రెడ్డి మాట్లాడింది కేసీఆర్ కుటుంబాన్ని ఆదేశించి. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికైతే వాళ్ళ ‘పవర్ కట్ చేస్తా’ అని మాట్లాడాడు. ఆ ప్రసంగంలో నుంచి, వీరి పేర్లు ఉన్న భాగాన్ని తీసేసి, ప్రజలని ఉద్దేశించి ఆ విధంగా పవర్ కట్ గురించి మాట్లాడినట్టుగా మార్చారు. 

తీర్పు: 

ఒక ప్రజా సభ లోని రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఎడిట్ చేసి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్తు సరఫరా తీసేస్తాం అన్నట్టుగా చిత్రీకరించారు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము. 


(అనువాదం: రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.