ప్యాకెట్ పాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు

ద్వారా: నబీలా ఖాన్
ఫిబ్రవరి 26 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ప్యాకెట్ పాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు

ప్యాకెట్ పాల వినియోగం కారణంగా క్యాన్సర్ వస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది అని క్లైమ్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: వాట్సాప్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి హెచ్చరికా జారీ చేయలేదు. ప్యాకెట్ పాలకి క్యాన్సర్ కి సంబంధం ఉందంటూ ఎటువంటి నివేదికా ప్రచురించలేదు.

క్లైమ్ ఐడి f7695f0c

క్లైమ్ ఏంటి?

భారతదేశంలో కల్తీ పాలు వినియోగం కారణంగా 2025 నాటికి జనాభాలో 87 శాతం క్యాన్సర్ బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వానికి నివేదించినదని వార్తా కథనం వచ్చిందంటూ ఒక స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్నది.

ప్యాకెట్ పాలలో ఒక పౌడర్ ఉంటుందని, అది ఆరోగ్యానికి ప్రమాదకరం అని కూడా ఈ స్క్రీన్ షాట్ లో ఉంది. ఈ సమాచారాన్ని జనాలకి తెలియకుండా తొక్కిపెట్టారని, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ స్క్రీన్ షాట్ లో ఉంది.

వాస్తవం ఏమిటి?

ఈ స్క్రీన్ షాట్ ని గమనించగా, ఈ కథనంలో మొదటి లైన్, రెండవ లైన్ ఫాంట్లు వేరువేరుగా ఉన్నాయని మేము తెలుసుకున్నాము. అలాగే పదాల పరిమాణం కూడా ఎక్కడికక్కడా మారుతూ వచ్చింది. 

వాట్సాప్  కథనం స్క్రీన్ షాట్ లో లొసుగులు (సౌజన్యం: వాట్సాప్)

అలాగే 87 శాతం మంది క్యాన్సర్ బారిన పడతారని చెబుతూ ఎటువంటి వార్తా కథనం మాకు లభించలేదు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ ప్రశ్నకి జవాబిస్తూ, తాము ఇటువంటి హెచ్చరిక ఏమీ జారీ చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాగే క్యాన్సర్ కి సంబంధించి దేశాల వారీగా వారి గణాంకాలని మాకు అందించారు. అందులో 2024 వరకే గణాంకాలు ఉన్నాయి. 2025 గణాంకాలు లేనే లేవు.

“కల్తీ పాలు/పాల పదార్ధాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వానికి ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు,” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వివరణలో పేర్కొన్నది కూడా. ఈ వివరణ ఇచ్చిన తారీఖు అయితే ఈ పత్రంలో లేదు కానీ, ఈ పత్రాన్ని నవంబర్, 2020 నాడు అప్లోడ్ చేశారని మాత్రం తెలుసుకున్నాము. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన వివరణ (సౌజన్యం: ప్రపంచ ఆరోగ్య సంస్థ)

“కల్తీ పాలు/పదార్ధాలని ఆపకపోతే 2025 నాటికి భారతదేశం జనాభాలో 87 శాతం మంది క్యాన్సర్ బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది అని అంటూ కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన వార్తలు తప్పుడు సమాచారం. ఇటువంటి తప్పుడు సమాచారం ప్రజలలో ఆందోళనని కలగచేస్తాయి,” అంటూ జనవరి 2023లో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డైరీ మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన (సౌజన్యం: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)

మీ పాలు సురక్షితమేనా?

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు పాల నాణ్యత మీద 2019లో చేసిన ఒక సర్వే ప్రకారం, “93 శాతం శాంపిల్స్, అనగా 6432 శాంపిల్స్ లో 5976, మనుషులు తాగటానికి పూర్తి సురక్షితంగా ఉన్నాయి.”

ఈ 6432 శాంపిల్స్ లో 12 మాత్రమే కల్తీవి. ఇవి మనుషులు తాగటానికి సురక్షితం కాదు. “పాల గురించి సమాజంలో  కొన్ని భయాందోళనలు ఉన్నా కూడా, ఈ సర్వే ఈ దేశంలో ద్రవ పాలు కల్తీవి అనే ఒక భావనని పటాపంచలు చేసింది,” అని అథారిటీ పేర్కొంది.

2022లో అథారిటీ 12 రాష్ట్రాలలో పాల సర్వే చేపట్టింది. అందులో 10 రాష్ట్రాలలో లంపీ స్కిన్ డీజీస్ ఆనవాళ్ళు లభించాయి. అయితే ఈ 12 రాష్ట్రాలలో అమ్మే పాలు వినియోగానికి పూర్తిగా సురక్షితం అని కూడా ఈ సర్వేలో తేలింది.

అలాగే యూకేకి చెందిన క్యాన్సర్ రీసర్చ్ వారి ప్రకారం పాలు లేదా పాల పదార్ధాల కారణంగా క్యాన్సర్ వస్తుందనేదానికి సరైన ఆధారాలు లేవు. 

తీర్పు

కల్తీ పాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వానికి ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. అలాగే పాల వినియోగం కారణంగా క్యాన్సర్ వస్తుంది అని కూడా ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.