ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ న్యాయమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈమధ్య చేసినట్టుగా ప్రచారం చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
సెప్టెంబర్ 20 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ న్యాయమూర్తి  గతంలో చేసిన వ్యాఖ్యలను ఈమధ్య చేసినట్టుగా ప్రచారం చేశారు

పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: మెటా)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

2017లో చంద్రబాబు నాయుడు పాలనలో ఒక కార్టూనిస్ట్ మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగి అరెస్ట్ చేసిన సందర్బంలో న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ ఈ వ్యాఖ్యలు చేశారు.

క్లైమ్ ఐడి 7e0377df

క్లెయిమ్ ఏంటి?

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును 2014 -2019 మధ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో నైపుణ్యాభివృద్ధి శాఖలో నిధులు దుర్వినియోగానికి సంబంధించిన కేసులో ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ తరువాత మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తున్నట్టుగా  మెటా మరియు వాట్సాప్  లాంటి సామాజిక మాధ్యమాలలో ఒక ఫొటో వైరల్ అయ్యింది.

ది హిందూలో ప్రచురించిన కథనం ప్రకారం సెప్టెంబర్ 9న విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టు నాయుడికి 14 రోజుల జుడీషియల్ కస్టడీకి విధించింది. 

ఒక ఫేస్బుక్ యూజర్ సెప్టెంబర్ 14వ తేదీన ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో, “ఆంధ్ర ప్రదేశ్ లో అరాచక పాలన. భావప్రకటనా స్వేచ్చకు సంకెళ్ళు. వ్యక్తిగత స్వేచ్చకు భంగం. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. తక్షణం రాష్ట్రపతి పాలన పెట్టాలి”, అని మార్కండేయ ఖట్జూ డిమాండ్ చేస్తునట్టు ఉంది.  ఆర్కైవ్ చేసిన పోస్ట్ ని ఇక్కడ చూడగలరు. ఇదే క్లెయిమ్ వాట్సాప్ లో కూడా వైరల్ అయ్యింది. 

ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో ప్రచారం అవుతున్న పోస్టులు(సౌజన్యం: ఫేస్బుక్ / వాట్సాప్/ లాజికల్లీఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


ఈ పోస్ట్ ను నాయుడు అరెస్ట్ తరువాత కొన్ని రోజులకి ప్రచారంలోకి వచ్చింది. అయినప్పటికీ, ఇది ఈ మధ్య  చేసినది కాదు

వాస్తవం ఏమిటి ?

న్యాయమూర్తి ఖట్జూ ఈ మధ్య ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా అని మేము వెతుకగా అలాంటి కథనాలు ఏమీ మాకు లభించలేదు. కానీ మాజీ న్యాయమూర్తి ఇలాంటి వ్యాఖ్యను 2017 లో చేశారు. మే 16వ తేదీన 2017 లో ఖట్జూ తన ఫేస్బుక్ లో ఒక లేఖను షేర్ చేశారు. అది ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ రాసిన లేఖ. గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో నాయుడు మరియు అతని కుమారుడు లోకేష్ పై కార్టూన్ వేసిన కారణంగా ఒక కార్టూనిస్ట్ ని అరెస్ట్ చేయడం జరిగినది, దీనిని  వ్యతిరేకిస్తూ, ఇది రాజ్యాంగ విరుద్దం అని, నిరంకుశత్వం అని, అప్రజాస్వామికమని, ఖట్జూ 2017లో మే 14న రాష్ట్రపతికి, ప్రధానికి ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ లేఖ రాశారు. “ప్రస్తుత ఆంధ్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చెయ్యడం లేదని దీని ద్వారా తెలుస్తుంది. కనుక రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఆంధ్రలో రాష్ట్రపతి పాలనవిధించాలి,” అని ఆ లేఖలో రాశారు. 

2017 లో ఫేస్బుక్ లో షేర్ చేసిన లేఖ (సౌజన్యం: ఫేస్బుక్ /మార్కండేయ ఖట్జూ)

రాష్ట్రపతి పాలన అంటే ఆ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పాలనను ఆపివేసి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవటం. ఇది రాజ్యాంగం లోని 356 ఆర్టికల్ ప్రకారం అమలు చేస్తారు. దీని ప్రకారం స్వయంగా రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్నీ లేదా కొన్ని బాధ్యతలని తన అధీనంలోకి తీసుకుంటారు. 

ది హిందూ, ది న్యూస్ మినిట్ లాంటి కొన్ని వార్త సంస్థలు ఆ లేఖ గురించిన కథనాలను ప్రచురించాయి. ది హిందూలో వచ్చిన కథనం ప్రకారం, మే 17, 2017న “మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన కావాలి అంటూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విటర్ ద్వారా లేఖ రాశారు. “

అదే విధంగా ది న్యూస్ మినిట్ లో మే 19న వచ్చిన కథనం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక వారంలో ఇద్దరిని అరెస్ట్ చేసింది - ఒకరు కార్టూనిస్ట్ రవి కిరణ్, మరొకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఐ రవీంద్ర. పాయకరావుపేట తెలుగుదేశం శాసనసభ్యులు వి అనితపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ మీద ఈయన్ని అరెస్ట్ చేశారు. 

లేఖ రాసిన తరువాత, ఖట్జూ, X (పూర్వపు ట్విటర్) లో ఒక పోల్ ని కూడా నిర్వహించారు, “ఆర్టికల్ 19(1) ని ఉల్లంఘిస్తూ కార్టూనిస్ట్ రవి కిరణ్ ని అరెస్ట్ చేసినందుకు ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలా  వద్దా”  అనేది ఈ పోల్. 

ఖట్జూ గతంలో కూడా ఇలా రాష్ట్రపతి పాలన కావాలి అంటూడిమాండ్ చేసినట్టు కథనాలు ఉన్నాయి. అక్టోబర్ 17, 2016 నాడు కూడా తమిళనాడులో రాష్ట్రపతి పాలన కావాలి అంటూ ఆ రాష్ట్ర హోమ్ మంత్రి కి లేఖ రాశారు. ఈ లేఖ ను అక్టోబర్ 17, 2016 న ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆంధ్ర ప్రదేశ్ కు సంబందించి అలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా ఎక్కడా కథనాలు లేవు. ఖట్జూ ఫేస్బుక్ మరియు ఎక్స్ అకౌంటు లో కూడా అలాంటి లేఖలు ఏమీ లేవు. 

తీర్పు

2017లో ఖట్జూ ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన కావాలి అంటూ చేసిన డిమాండ్ ను మొన్నీ మధ్య చేసిన డిమాండ్ గా ప్రచారం చేశారు. కనుక మేము దీనినిఅబద్ధం అని నిర్ధారించాము. 

 

(అనువాదం- రాజేశ్వరి పరస)

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.